బాబుకు పవన్ చేస్తున్న మహా మేలు… ?
సార్వత్రిక ఎన్నికలు జరిగి రెండున్నరేళ్లకు దగ్గర పడుతోంది. మరో ఏడాది గడిస్తే చాలు ఎన్నికల కోసం సన్నాహాలు మొదలవుతాయి. అయితే ఏపీలో సీన్ చూస్తే అలా లేదు. [more]
సార్వత్రిక ఎన్నికలు జరిగి రెండున్నరేళ్లకు దగ్గర పడుతోంది. మరో ఏడాది గడిస్తే చాలు ఎన్నికల కోసం సన్నాహాలు మొదలవుతాయి. అయితే ఏపీలో సీన్ చూస్తే అలా లేదు. [more]
సార్వత్రిక ఎన్నికలు జరిగి రెండున్నరేళ్లకు దగ్గర పడుతోంది. మరో ఏడాది గడిస్తే చాలు ఎన్నికల కోసం సన్నాహాలు మొదలవుతాయి. అయితే ఏపీలో సీన్ చూస్తే అలా లేదు. చంద్రబాబు ఓడిన మరుక్షణం నుంచి కూడా ఒంటికాలు మీదనే లేస్తున్నారు. జగన్ సర్కార్ ని విమర్శిస్తూ తన బాధను అలా చల్లార్చుకుంటున్నారు. మళ్ళీ అధికారంలోకి వచ్చేది మేమే అని ఇప్పటికి ఎన్నిసార్లు చెప్పారో ఆయనకే గుర్తు ఉండదు. మరి తాజాగా చంద్రబాబులో ధీమా బాగా పెరగడానికి కారణం ఏంటి అంటే ఏపీలోని రాజకీయ సమీకరణలే అంటున్నారు.
అక్కడితో సరి…
తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలో ఏది జరగాలి అని చంద్రబాబు అనుకున్నారో అదే జరిగింది. ఈ ఉప ఎన్నిక ఏపీలో రెండు పార్టీలే ఉండాలని గట్టిగా చాటి చెప్పినట్లు అయింది. పవన్ జనసేన, బీజేపీ కూటమికి డిపాజిట్లు గల్లంతు అయ్యాయి. అందరూ తిరుపతిలో వైసీపీ గెలిచింది కదా అని అనుకుంటారు. కానీ చంద్రబాబు వ్యూహం అక్కడ గెలిచింది అని టీడీపీ నేతలు చెబుతారు. ఇక తిరుపతి ఉప ఎన్నికల తరువాత పవన్ ఎక్కడా కనిపించలేదు. బీజేపీ జనసేన మూడవ ఆల్టర్నేషన్, మేమే రేపటి రోజున ఏపీలో అధికారంలోకి వస్తామంటూ చెప్పిన కబుర్లు అన్నీ కూడా గాలికి కొట్టుకుపోయాయి.
సోలోగా అయితేనే …?
ఇక ఇపుడు చూస్తే పవన్ కళ్యాణ్ ఏదో మొక్కుబడిగా రెండు రోజులు మంగళిగిరి పర్యటనకు వచ్చారు, వెళ్ళారు. ఈ సందర్భంగా ఆయన మునుపటి జోష్ ఎక్కడా చూపించలేకపోయారు. పవన్ మళ్లీ సినిమాల్లో బిజీ అయిపోతున్నారు. ఈ నేపధ్యంలో పొలిటికల్ గ్రౌండ్ అంతా టీడీపీకే వదిలేశారు. అదే చంద్రబాబుకు కూడా కావాల్సింది. కరోనా నెమ్మదించిన వెంటనే ఇలా పవన్ సినిమా షూటింగులకు వెళ్తే చంద్రబాబు అలా ఏపీలో మీటింగులకు వెళ్తున్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో వైసీపీ మీద వ్యతిరేకత తీవ్రంగా వస్తే దాన్ని ఒడిసిపట్టుకుని పసుపు సంచుల్లో నింపుకోవడానికి చంద్రబాబు తయారుగా ఉన్నారు. అందుకే ఆయన ధీమాగా చెబుతున్నారు. మేమే అధికారంలోకి మళ్ళీ వస్తామని కూడా గర్జిస్తున్నారు.
ఎలా అయినా ఒకే…?
ఇక చంద్రబాబు బీజేపీ, జనసేన తనతో కలసి రావాలని కోరుకుంటున్నారు. అయినా సరే పొత్తుల్లో వారు కోరిన సీట్లు ఇచ్చే సీన్ ఉండదని అంటున్నారు. ఒకవేళ వారు విడిగా పోటీ చేసినా తనకు పెద్దగా నష్టం లేదు అన్న అంచనాలు కూడా చంద్రబాబుకు ఉన్నాయట. అంటే ఏపీలో ప్రతీ ఎన్నికలోనూ వైసీపీకి ధీటుగా పోటీ ఇస్తున్న టీడీపీని కాదని జనాలు కూడా ఎక్కడికీ పోరని కూడా ధీమా. పొలిటికల్ సీన్ చూసినా ఆలాగే ఉంది మరి. పవన్ నిరాసక్తత. బీజేపీకి తగ్గుతున్న గ్లామర్ అన్నీ కలసి ఏపీలో టీడీపీని రోజురోజుకూ స్ట్రాంగ్ గా చేస్తున్నాయి. జగన్ మీద మోజు తగ్గాలే కానీ అసలైన ఆల్టర్నేషన్ అంటే టీడీపీయే అనే చెప్పాలిపుడు.