రాను రాను రీసౌండ్ పెరిగేదేగా?
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గతంలో ఎన్నడూ లేని విధంగా కొత్త కష్టాలను ఎదుర్కొంటున్నారు. సొంత పార్టీలోనే ఆయన నాయకత్వంపై నమ్మకాలు చెదిరిపోతున్నాయి. నలభై ఏళ్ల రాజకీయ [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గతంలో ఎన్నడూ లేని విధంగా కొత్త కష్టాలను ఎదుర్కొంటున్నారు. సొంత పార్టీలోనే ఆయన నాయకత్వంపై నమ్మకాలు చెదిరిపోతున్నాయి. నలభై ఏళ్ల రాజకీయ [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గతంలో ఎన్నడూ లేని విధంగా కొత్త కష్టాలను ఎదుర్కొంటున్నారు. సొంత పార్టీలోనే ఆయన నాయకత్వంపై నమ్మకాలు చెదిరిపోతున్నాయి. నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నడూ చంద్రబాబు ఇంతటి క్రైసిస్ ను ఎదుర్కొనలేదు. ఒకవైపు జగన్ మరోవైపు సొంత పార్టీలో జూనియర్ ఎన్టీఆర్ ప్రకంపనలు చంద్రబాబుకు నిద్రలేకుండా చేస్తున్నాయి. ఈ సమస్య నుంచి ఎలా అధిగమించాలో చంద్రబాబుకు అర్థం కాకుండా ఉంది.
ప్రతి చోటా….
ఒక చోట కాదు చంద్రబాబు వెళ్లిన ప్రతి చోటా జూనియర్ ఎన్టీఆర్ రావాలని నినాదాలు వినపడుతున్నాయి. నెక్ట్స్ సీఎం జూనియర్ ఎన్టీఆర్ అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు. అంటే వచ్చే ఎన్నికలకు సీఎంగా జూనియర్ ఎన్టీఆర్ ను ప్రకటించాలన్నది క్యాడర్ నినాదంగా ఉంది. అంటే చంద్రబాబును ముఖ్యమంత్రిగా క్యాడర్ అంగీకరించడం లేదన్న సంకేతాలు ప్రజల్లోకి బలంగా వెళుతున్నాయి. ఇది వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు తెలియని దెబ్బ తగులుతుందనడం వాస్తవం.
రానని చెబుతున్నా…?
నిజానికి జూనియర్ ఎన్టీఆర్ తాను రాజకీయాల్లోకి రాబోనని చెప్పేశారు. అయినా ఆయన అభిమానులు, టీడీపీ క్యాడర్ మాత్రం రావాల్సిందేనంటుంది. దీనికి ప్రధానకారణం గతంలో ఎన్నడూ లేని విధంగా పార్టీ దెబ్బతినింది. దీనికి తోడు చంద్రబాబు కుమారుడు లోకేష్ నాయకత్వాన్ని ఎవరూ స్వాగతించడం లేదు. తెలుగుదేశం పార్టీని కేవలం జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే కాపాడగలడన్న విశ్వాసాన్ని క్యాడర్ వ్యక్తం చేస్తుంది.
మెట్టు దిగొచ్చు కాని…
ఇది చంద్రబాబుకు రాజకీయంగా, కుటుంబ పరంగా ఇబ్బందికరంగా మారింది. అధికారంలో ఉన్న ఐదేళ్ల పాటు జూనియర్ ను చంద్రబాబు పట్టించుకోలేదు. ఇప్పుడు వచ్చి మద్దతివ్వమంటే జూనియర్ ఎన్టీఆర్ ఇస్తారా? అన్నది ప్రశ్న. రాజకీయం కోసం చంద్రబాబు ఏ స్థాయికైనా దిగివచ్చి జూనియర్ ఇంటికి వెళతారు. కానీ భవిష్యత్ లో తన కుమారుడికి జూనియర్ ఇబ్బందిగా మారతారన్న ఏకైక భావనతోనే ఆయనను దూరం పెట్టాల్సి వస్తుంది. ఎన్నికలకు మూడేళ్ల ముందే జూనియర్ నినాదం ఇలా విన్పిస్తుంటే, ఇక ఎన్నికల సమాయానికి రీసౌండ్ ఎలా ఉంటుందో చూడాలి మరి.