సీఎం కాకపోవడమే బెటరట.. బాబు కొత్త ఆలోచన… ?
చంద్రబాబు లాంటి రాజకీయ గండర గండడే వణుకుతున్నారు అంటే ఏపీలో ఆర్ధిక పరిస్థితి ఎంతలా పాతాళం అంచులకు చేరిపోయిందో అర్ధం చేసుకోవాల్సిందే. ప్రభుత్వ అధికారుల నుంచి ఈ [more]
చంద్రబాబు లాంటి రాజకీయ గండర గండడే వణుకుతున్నారు అంటే ఏపీలో ఆర్ధిక పరిస్థితి ఎంతలా పాతాళం అంచులకు చేరిపోయిందో అర్ధం చేసుకోవాల్సిందే. ప్రభుత్వ అధికారుల నుంచి ఈ [more]
చంద్రబాబు లాంటి రాజకీయ గండర గండడే వణుకుతున్నారు అంటే ఏపీలో ఆర్ధిక పరిస్థితి ఎంతలా పాతాళం అంచులకు చేరిపోయిందో అర్ధం చేసుకోవాల్సిందే. ప్రభుత్వ అధికారుల నుంచి ఈ మధ్య తెప్పించుకున్న సమాచారం చూసి చంద్రబాబు ఒక్కసారిగా ఖంగు తిన్నారని టాక్. కేవలం రెండేళ్ళకే ఏపీలో ఖజానాకు కూడా అతి పెద్ద చిల్లు పడిపోయిందట. ఇక తెచ్చిన అప్పులకు వడ్డీలు కూడా భారీగా ఉన్నాయట. ఇవన్నీ కూడా పదిహేను నుంచి ఇరవై ఏళ్ల దాకా అసలూ వడ్డీలు కడుతూ పోవాల్సిందేనట.
ఉరుకుతున్న బాబు….
ఎపుడెపుడా అధికారం అనుకుంటూ ఉరుకుతున్న బాబుకు బుర్ర తిరిగే సమాచారమే వచ్చిందట. పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ కూడా చాలా విషయాలు చంద్రబాబుకు చెప్పారట. దాంతో చంద్రబాబుకు ఏం చేయాలో పాలుపోలేదని అంటున్నారు. ఏపీలో సంక్షేమ పధకాలు మరో మూడేళ్ళు జగన్ కచ్చితంగా కొనసాగించాలని పట్టుదలతో ఉన్నారు. దాని కోసం ఎంత ఎక్కువ వడ్డీ అయినా తెచ్చేందుకు సిద్ధమని కూడా చెబుతున్నారు. సంక్షేమ పధకాలు ఎపుడూ ఓడించవు. అందువల్ల జగన్ అయిదేళ్ళూ వాటిని అమలు చేస్తే చంద్రబాబుకు గెలుపు ఇక కష్టమే. ఒకవేళ చంద్రబాబు అనుకుంటున్నట్లుగా తీవ్ర వ్యతిరేకత వచ్చి జగన్ ఓడినా కూడా చంద్రబాబుకు అధికారం ఒక ముళ్ళ కిరీటమే అవుతుంది అంటున్నారు.
జేసీ ముందే చెప్పారే…?
సీనియర్ నేత జేసీ దివాకరరెడ్డి ఏడాదిన్నర క్రితం ఒక మాట చెప్పారు. జగన్ ఒక వేళ దిగిపోయినా ఏపీని ఆర్ధికంగా గాడిలో పెట్టడం చంద్రబాబు వల్ల కూడా కాదు అని. పైగా జగన్ వీరూ వారూ అన్న తేడా లేకుండా అన్ని వర్గాలకు పంచుడు కార్యక్రమాన్ని మొదలెట్టేశారు. వాటికి కొరతా వచ్చినా ఏ ఒక్క పధకాన్ని ఆపినా కూడా చంద్రబాబు వెంటనే బదనాం అయిపోతారు. ఒకవేళ అమలు చేయాలంటే కూడా అసలు కుదిరే పని కానే కాదు. దాంతో చంద్రబాబుకు ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్లుగా ఆర్ధిక రాజకీయ పరిస్థితిని జగన్ కోరి తయారు చేస్తున్నారు అంటున్నారు.
బాబుకు అదే బెటర్…
ఏపీలో ఆర్ధిక పరిస్థితిని చూసిన వారు కానీ, మేధావులు కానీ ఒకే మాట అంటున్నారు. మరో పాతికేళ్ల వరకూ ఏపీ గురించి చూసుకోవాల్సిన అవసరం లేదు అని. రాష్ట్రాన్ని మొత్తం తాకట్టుపెట్టేసినా కూడా ఏపీ బకాయిలు రెండు దశాబ్దాలకు కానీ తీరవని అంటున్నారు. జగన్, చంద్రబాబులలో ఎవరో ఒకరు రాజకీయంగా పక్కకు వెళ్తేనే తప్ప ఈ పంతాలు ఆగవు. అపుడే ఏపీ పరిస్థితి గురించి ఆలోచించడం జరుగుతుంది అంటున్నారు. అలా కనుక చూసుకుంటే జగనే మరో మారు ఏపీలో అధికారంలోకి రావడం బెటర్ అంటున్నారు. జగన్ కి వయసు ఉంది కాబట్టి ఓడినా చంద్రబాబుని విపక్షంలో ఉంటూ సతాయిస్తారు. అదే చంద్రబాబు ఓడితే టీడీపీ ఇక ఉండదు, దాంతో జగన్ కి రాజకీయ పోటీ ఉండదు కాబట్టి 2024 తరువాత సంక్షేమ కార్యక్రమాల మీద పూర్తి సమీక్ష నిర్వహించి భారీగా కోత కోయడానికి వీలుంటుంది. ఇదేంటి అని అడగడానికి కానీ, రాజకీయ లాభం కోసం చూసే బలమైన ప్రత్యర్ధి కానీ అపుడు ఎవరూ ఉండరు అన్నదే ఒక విశేషణ. మొత్తానికి చూస్తే చంద్రబాబు మళ్లీ సీఎం కాకపోవడమే ఈ పరిస్థితుల్లో ఎంతో మేలు అన్నదే హితైషుల మాటగా ఉందిట.