బాబు ఆ నిర్ణయం… రిస్క్ లో బాలయ్య?
తెలుగుదేశం పార్టీలో ఎన్నికల మీదనే పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఇంకా బిగిసి మూడేళ్ల కాలం ఉన్నా కూడా ఎందుకో చంద్రబాబు తొందరపడుతున్నారు. ఈసారి రెండేళ్ల ముందుగానే [more]
తెలుగుదేశం పార్టీలో ఎన్నికల మీదనే పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఇంకా బిగిసి మూడేళ్ల కాలం ఉన్నా కూడా ఎందుకో చంద్రబాబు తొందరపడుతున్నారు. ఈసారి రెండేళ్ల ముందుగానే [more]
తెలుగుదేశం పార్టీలో ఎన్నికల మీదనే పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఇంకా బిగిసి మూడేళ్ల కాలం ఉన్నా కూడా ఎందుకో చంద్రబాబు తొందరపడుతున్నారు. ఈసారి రెండేళ్ల ముందుగానే వీలున్న చోట్ల అభ్యర్ధులను ప్రకటించేస్తే వారు హాయిగా పనిచేసుకుంటారు. అలా జనాలకు చేరువ అయితే విజయావకాశాలు ఉంటాయని చంద్రబాబు నమ్ముతున్నట్లుగా ఉంది. అందుకే ఆయన సందు దొరికితే చాలు అభ్యర్ధుల ఎంపిక మీదనే కసరత్తు చేస్తున్నారు అంటున్నారు. సరే అభ్యర్ధుల విషయం అలా ఉంటే భావి ముఖ్యమంత్రి అనిపించుకుంటున్న లోకేష్ ఎక్కడ నుంచి పోటీ చేస్తారు అన్నదే ఇపుడు చర్చగా ఉంది.
భారీ త్యాగమే…?
చంద్రబాబు చివరిసారి ఎన్నికలలో పోటీ చేయడం అంటున్నారు. ఆయనకు 2024 ఎన్నికలు ఆఖరువే అని పార్టీలో వినిపిస్తున్న మాట. ఆ మాత్రం దానికి ఎక్కడ నుంచి పోటీ చేస్తే ఏంటి అని చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకోబోతున్నారుట. తనకు అచ్చి వచ్చిన, ఏడు సార్లు గెలిపించిన కుప్పం సీటుని చంద్రబాబు ఈసారి వదిలేసుకుంటారు అన్నది సంచలనాత్మకమైన వార్తగా చక్కర్లు కొడుతోంది. కుప్పంలో తన వారసుడిగా లోకేష్ ని ఈసారి నిలబెట్టి ఆయనకు దాన్ని పర్మనెంట్ సీటుగా చంద్రబాబు చేయబోతున్నారుట. అంటే వైఎస్సార్ ఫ్యామిలీకి పులివెందుల ఎలాగో నారా ఫ్యామిలీకి కుప్పం అలాగన్న మాట. తనయుడు కోసం ఒక విధంగా చంద్రబాబు త్యాగం చేస్తున్నారు అనుకోవాలి మరి.
బావమరిది మీదకే …?
మరి చంద్రబాబు ఎక్కడ నుంచి పోటీ చేస్తారు అంటే దానికి జవాబే హిందూపురం అంటున్నారు. ఈ సీటు టీడీపీకి కంచుకోట. వరసపెట్టి గెలుస్తూ వస్తున్న సీటు. బాలయ్య రెండు సార్లు గెలిచిన హిందూపురంలో ఈసారి నారా వారు పోటీ చేస్తారుట. అంటే నందమూరి వారి స్ట్రాంగ్ సీటు మీద చంద్రబాబు జెండా పాతేస్తారు అన్న మాట. ఈ రెండు సీట్లు ఇకపైన తన ఫ్యామిలీకి అట్టేబెట్టుకోవాలని కూడా చంద్రబాబుకు ఏదో ఆలోచన ఉన్నట్లుగా ఉందిట. అంటే ఫ్యూచర్ లో కోడలి కోసం అని కూడా చెప్పుకోవాలి. లోకేష్ అంటే బాలయ్య తగ్గకపోవచ్చు కానీ బావ చంద్రబాబు అంటే కచ్చితంగా హిందూపురాన్ని త్యాగం చేస్తారు అంటున్నారు.
రిస్క్ లో బాలయ్య …?
మరి బాలయ్యకు కూడా ఒక సీటు చూపించాలి కదా. అంటే అక్కడే చంద్రబాబు అతి పెద్ద తెలివి తేటలను చూపిస్తున్నారట. బాలయ్య తండ్రి ఎన్టీయార్ సొంత జిల్లా కృష్ణా కాబట్టి అక్కడికే తనయుడిని పంపుతారని, ఎన్టీయార్ ఆరంభంలో పోటీ చేసి గెలిచిన గుడివాడ సీటునే బాలయ్యకు అప్పగిస్తారు అంటున్నారు. ఇది నిజంగా రిస్కీ సీటే అంటున్నారు. ఇక్కడ మంత్రి కొడాలి నాని పాతుకుపోయారు. ఆయన్ని ఢీ కొట్టడం చాలా కష్టం. ఎవరు బరిలోకి దిగినా అక్కడ కొడాలిదే గెలుపు. అది రాసేసుకోవచ్చు. ఇక్కడ నందమూరి ఫ్యామిలీ అని చెప్పడమే తప్ప వారి మద్దతు కూడా అంతంతమాత్రం అంటారు. నాని అలా టీడీపీ క్యాడర్ ని కూడా వైసీపీలోకి మిక్స్ చేసేశారు. అటువంటి గుడివాడలో బాలయ్యను పోటీకి పెడితే ఇద్దరు బాబులకు రెండిందాల లాభమట. ఆయన గెలిస్తే నానిని ఓడించామన్న పేరు వస్తుంది. ఓడిపోతే నందమూరి ఫ్యామిలీ నుంచి ఉన్న ఒకే ఒక ప్రాతినిధ్యం కూడా లేకుండా ఆధిపత్య పోటీ తప్పుతుంది. మొత్తానికి సేఫేస్ట్ జోన్ లలో తండ్రీ కొడుకులూ ఇద్దరు సర్దుకుని బాలయ్యని బలి ఇవ్వబోతున్నారా అన్నదే టీడీపీలో హాట్ టాపిక్ గా ఉంది మరి.