బాబూ ఇప్పటికైనా అర్థమయిందా?
ఏదైనా క్షవరం అయితే కాని వివరం తెలియదన్న సామెత ఉంది. ఇది తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు అక్షరాలా వర్తిస్తుంది. రాష్ట్రంలో ఇన్ని నామినేటెడ్ పోస్టులు పెట్టుకుని [more]
ఏదైనా క్షవరం అయితే కాని వివరం తెలియదన్న సామెత ఉంది. ఇది తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు అక్షరాలా వర్తిస్తుంది. రాష్ట్రంలో ఇన్ని నామినేటెడ్ పోస్టులు పెట్టుకుని [more]
ఏదైనా క్షవరం అయితే కాని వివరం తెలియదన్న సామెత ఉంది. ఇది తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు అక్షరాలా వర్తిస్తుంది. రాష్ట్రంలో ఇన్ని నామినేటెడ్ పోస్టులు పెట్టుకుని ఒక్కటి కూడా భర్తీ చేయకుండా ఐదేళ్ల కాలం గడిపేసిన చంద్రబాబుకు ఇప్పుడు పార్టీ నేతల నుంచే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఏవో రాజకీయ ప్రయోజనం కోసం కొన్ని కీలక పదవులు తప్పించి ఇంత పెద్ద స్థాయిలో చంద్రబాబు రాజకీయ జీవితంలో భర్తీ చేయలేదన్న విమర్శలు విన్పిస్తున్నాయి.
నమ్ముకున్న వారికి…
దాదాపు 135 నామినేటెడ్ పోస్టులను జగన్ ఒక్క సంతకంతో భర్తీ చేయగలిగారు. అదే చంద్రబాబు ఐదేళ్ల కాలంలో ఎందుకు భర్తీ చేయలేకపోయారన్న ప్రశ్న తలెత్తుతోంది. భర్తీ చేస్తే అసంతృప్తులు పెరుగుతాయని భయమా? లేకుంటే అవినీతి చేస్తారని వెనక్కు తగ్గారా? అన్న ప్రశ్నకు చంద్రబాబు నుంచే సమాధానం రావాల్సి ఉంటుంది. కానీ తెలుగుదేశం పార్టీని నమ్ముకున్న, జెండామోసిన వారికి మాత్రం చంద్రబాబు అన్యాయం చేశారనే వాదన మరింత పెరిగింది.
ఇన్ని పోస్టులున్నాయని …..
అసలు ఇన్ని పోస్టులు ఉన్నాయని, ఉంటాయని కూడా తమకు తెలియదంటున్నారు తెలుగు తమ్ముళ్లు. తమను ఐదేళ్ల కాలంలో కనీసం పట్టించుకున్న పాపాన పోలేదన్న ఆవేదన వారిలో వ్యక్తమవుతోంది. ఇది చంద్రబాబుకు నిజంగా ఇబ్బంది కలిగించే విషయమే. గతంలో ఎమ్మెల్యేలకు, సీనియర్ నేతలను కాదని నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయలేకపోయారు. మధ్యలో పార్టీలో చేరిన నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి వంటి వారికి పదవులు ఇచ్చిన చంద్రబాబు పార్టీని నమ్ముకున్న నేతలకు మాత్రం అన్యాయం చేశారు.
ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో….
జగన్ నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయడంతో చంద్రబాబు నాయకత్వంపై కూడా క్యాడర్ లో నమ్మకం సన్నగిల్లింది. చంద్రబాబు మూడు దఫాలు ముఖ్యమంత్రిగా చేసినా నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయంలో ఎప్పుడూ శ్రద్థ పెట్టలేదు. చంద్రబాబుకు అనేక కారణాలుండవచ్చు. కానీ క్యాడర్ ఎలాంటి పదవులు లేకుండా పనిచేయడం ఎల్లకాలం సాధ్యం కాదు. కొన్ని వర్గాలకే జగన్ నామినేటెడ్ పోస్టుల భర్తీ చేశారని టీడీపీ సీనియర్ నేతలు విమర్శలు చేస్తున్నా వాటిని క్యాడర్ పెద్దగా పట్టించుకోక పోవడం విశేషం.