వాళ్లకు వేరే ఆప్షన్ లేదు… అందుకే మళ్లీ…?
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కు ఇప్పుడిప్పుడే ఆశలు చిగురిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకూ పార్టీ నేతల నుంచి క్యాడర్ వరకూ కొంత నిస్తేజంలో ఉంది. కార్యక్రమాల్లో [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కు ఇప్పుడిప్పుడే ఆశలు చిగురిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకూ పార్టీ నేతల నుంచి క్యాడర్ వరకూ కొంత నిస్తేజంలో ఉంది. కార్యక్రమాల్లో [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కు ఇప్పుడిప్పుడే ఆశలు చిగురిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకూ పార్టీ నేతల నుంచి క్యాడర్ వరకూ కొంత నిస్తేజంలో ఉంది. కార్యక్రమాల్లో కూడా పాల్గొనకుండా కుంటిసాకులు చెప్పే పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడిప్పుడే మెల్లగా పరిస్థితులు మారుతున్నాయి. నేతలందరూ వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు. వారికి వేరే ఆప్షన్ లేకుండా చేయడంతోనే ఇప్పుడు వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయని పరిస్థితి ఉంది.
టీడీపీలో ఉంటేనే….
టీడీపీలో ఉన్న నేతలకు వేరే ఆప్షన్ లేదు. చంద్రబాబును నమ్మి ఉండాల్సిందే. వైసీపీలోకి వెళ్లినా వారికి పెద్దగా ప్రయోజనం ఉండదని తెలుసు. అందుకే టీడీపీనే నమ్ముకుని ఉంటే ఎమ్మెల్యేగా గెలిస్తే చాలన్న భావన చాలా మందిలో ఇటీవల కాలంలో కనిపిస్తుంది. అందుకే గత రెండేళ్ల నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న కొండ్రు మురళి, ముత్తముల అశోక్ రెడ్డి, పితాని సత్యనారాయణ వంటి నేతలు జెండాలు పట్టక తప్పనిసరి పరిస్థితి ఉంది.
బాబుకే కాదు వారికీ….
వచ్చే ఎన్నికలు కేవలం చంద్రబాబుకు మాత్రమే కాదు తమకు కూడా పరీక్ష అని టీడీపీ నేతలకు తెలియంది కాదు. తాము రాజకీయంగా నిలదొక్కుకోవాలంటే నియోజకవర్గాల్లో పట్టు కోల్పోకూడదు. అందుకే వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలన్న తాపత్రంయ ప్రస్తుతం టీడీపీ నేతల్లో కన్పిస్తుంది. అధికార పార్టీపై విమర్శలు చేస్తూ చికాకు పెడుతూ చంద్రబాబు కొంత మేర సక్సెస్ అయ్యారనే నేతలు భావిస్తున్నారు.
మార్పు వచ్చిందని…
క్షేత్రస్థాయిలో ప్రజల్లో కూడా కొంత మార్పు వచ్చిందని టీడీపీ నేతలు గ్రహించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఉపాధి అవకాశాలు లేకపోవడం వంటి వాటిపై ప్రజలు తిరిగి చంద్రబాబు నాయకత్వాన్ని కోరుకుంటున్నారని సీనియర్ టీడీపీ నేత ఒకరు వ్యాఖ్యానించారు. దీని ఫలితం సార్వత్రిక ఎన్నికల్లో ఉంటుందని ఆయన విశ్లేషించారు. అందుకే ఇటీవల కాలంలో పార్టీ నేతలు సయితం కార్యక్రమల్లో పాల్గొంటూ పార్టీకి దన్ను గా నిలుస్తున్నారు. చంద్రబాబు ఈ పరిణామాలు చూసిన తర్వాత ఖుషీగా ఉన్నారు.