ఉత్తరాంధ్ర నుంచి చంద్రబాబు… ?
వచ్చే ఎన్నికల్లో గెలుపు టీడీపీకి అత్యవసరం. అంతే కాదు. చంద్రబాబు లాంటి రాజకీయ నాయకునికి బహుశా అవే చివరి ఎన్నికలు కూడా. వరసపెట్టి వైసీపీ మరోసారి గెలిచింది [more]
వచ్చే ఎన్నికల్లో గెలుపు టీడీపీకి అత్యవసరం. అంతే కాదు. చంద్రబాబు లాంటి రాజకీయ నాయకునికి బహుశా అవే చివరి ఎన్నికలు కూడా. వరసపెట్టి వైసీపీ మరోసారి గెలిచింది [more]
వచ్చే ఎన్నికల్లో గెలుపు టీడీపీకి అత్యవసరం. అంతే కాదు. చంద్రబాబు లాంటి రాజకీయ నాయకునికి బహుశా అవే చివరి ఎన్నికలు కూడా. వరసపెట్టి వైసీపీ మరోసారి గెలిచింది అంటే ఇక టీడీపీ దుకాణాన్ని బంద్ చేసుకోవాల్సిందే. ఈ నేపధ్యంలో చంద్రబాబు అనేక రకాలుగా ఆలోచనలు చేస్తున్నారుట. ప్రాంతాలు, కులాలు, మతాలు, పొత్తులు, ఎత్తులు ఇలా ఎన్నో విషయాల్లో చంద్రబాబు మదింపు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారని టాక్. టీడీపీకి ఉత్తరాంధ్రా జిల్లాలు పెట్టని కోటలు. అక్కడ మళ్ళీ విజయఢంకా మోగించకపోతే మాత్రం అధికారంలోకి రావడం కల్లగానే మిగిలిపోతుంది.
ఆ ముద్ర పోతుందా ?
అమరావతి అంటూ చంద్రబాబు కలవరిస్తున్నారు. ఇది వైసీపీ చేస్తూ వస్తున్న ప్రచారం. చంద్రబాబు కూడా మన రాజధాని అమరావతి అనే అంటూ వస్తున్నారు. దీంతో విశాఖ పాలనారాజధానికి ఆయన వ్యతిరేకం అని వైసీపీ ఇప్పటికే ప్రచారం చేసింది. ఆ నినాదంతోనే జీవీఎంసీ ఎన్నికలలో వైసీపీ ఎక్కువ సీట్లు గెలుచుకుని మేయర్ పీఠాన్ని పట్టేసింది. రానున్న రోజుల్లో జగన్ విశాఖకు మకాం మార్చితే ఆ ఇంపాక్ట్ ఇంకా ఎక్కువగా ఉంటుంది. దాంతో విశాఖకు టీడీపీ వ్యతిరేకం అన్న ముద్రను పోగొట్టుకోవాలని చంద్రబాబు గట్టిగా భావిస్తున్నారుట.
కొడుకు కాదట…
వచ్చే ఎన్నికల్లో విశాఖ జిల్లా నుంచి లోకేష్ పోటీ చేస్తారు అన్న ప్రచారం ఇప్పటిదాకా వినిపించింది. అయితే చంద్రబాబే ఇక్కడ పోటీ చేస్తారు అన్నది తాజా ఖబర్. ఈ మధ్య భీమిలీ ఇంచార్జి కోరాడ రాజబాబు అమరావతిలో చంద్రబాబుని కలసినపుడు ఆయన భీమిలీని ఎట్టి పరిస్థితుల్లో టీడీపీని కంచుకోటగా మార్చాలని సూచించారుట. అంతే కాదు విశాఖ మీద ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నాట్లుగా తెలిపారుట. దాంతో చంద్రబాబు భీమిలీ నుంచి పోటీ చేస్తారు అన్న చర్చ అయితే ఉందిపుడు. చంద్రబాబు భీమిలీ నుంచి పోటీ చేస్తే టీడీపీ కధే వేరుగా ఉంటుంది అంటున్నారు.
మామ తరువాత అల్లుడే…
టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీయార్ 1994 ఎన్నికల వేళ భీమిలీ నుంచి పోటీ చేస్తారని వెల్లువలా ప్రచారం సాగింది. చివరి నిముషంలో అన్న గారు తన నిర్ణయం మార్చుకుని శ్రీకాకుళం జిల్లా టెక్కలి నుంచి పోటీ చేశారు. నాడు ఎన్టీయార్ ఉత్తరాంధ్రా జిల్లాలలో టీడీపీకి దన్నుగా ఉంటూ పోటీ చేసి భారీ సక్సెస్ సొంతం చేసుకున్నారు. ఇపుడు అదే ఫార్ములాను చంద్రబాబు కూడా అమలు చేయబోతున్నారు అంటున్నారు. అంటే మూడు దశాబ్దాల తరువాత అల్లుడు కూడా ఉత్తరాంధ్రానే ఎంచుకుంటారు అంటున్నారు. చంద్రబాబు భీమిలీ నుంచి పోటీ చేస్తే ఆ ప్రభావం కచ్చితంగా మూడు జిల్లాల మీద ఉంటుందని, అదే విధంగా తాము విశాఖ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్న సంకేతాన్ని కూడా బలంగా ఇస్తుందని అంటున్నారు. ఇక వైసీపీ రాజకీయ దూకుడుకు కూడా అలా అడ్డుకట్ట వేస్తూ అత్యధిక సీట్లు గెలుచుకోవచ్చు అని కూడా ఆలోచిస్తున్నారుట. మరి చూడాలి ఈ ప్రచారం కనుక నిజం అయితే మాత్రం విశాఖ కేంద్రంగానే ఏపీ రాజకీయం హోరెత్తడం ఖాయం.