బాబుకు రాం రాం అంటున్న అమరావతి… ?
చంద్రబాబు గత అయిదేళ్ళ పాలనలో అమరావతి పేరుని ఎన్ని వేల లక్షల సార్లు వల్లించారో ఎవరూ లెక్కలు కట్టి చెప్పలేరు. తన బ్రైన్ చైల్డ్ గా అమరావతి [more]
చంద్రబాబు గత అయిదేళ్ళ పాలనలో అమరావతి పేరుని ఎన్ని వేల లక్షల సార్లు వల్లించారో ఎవరూ లెక్కలు కట్టి చెప్పలేరు. తన బ్రైన్ చైల్డ్ గా అమరావతి [more]
చంద్రబాబు గత అయిదేళ్ళ పాలనలో అమరావతి పేరుని ఎన్ని వేల లక్షల సార్లు వల్లించారో ఎవరూ లెక్కలు కట్టి చెప్పలేరు. తన బ్రైన్ చైల్డ్ గా అమరావతి రాజధానిని చంద్రబాబు భావించారు. ప్రపంచ నగరంగా అమరావతి ఉంటుందని కూడా అయన గొప్పలు చెప్పారు. అమరావతి రాజధాని కోసం ల్యాండ్ పూలింగ్ చేపట్టామని తన మీద నమ్మకంతో రైతులు వేలాది ఎకరాల భూములు ఇచ్చారని చంద్రబాబు చెప్పుకున్నారు. ఆయన వందిమాగధులు కూడా అదే నిజమని ప్రచారం చేశారు. కానీ అంత నమ్మకం ఉంచిన రైతులకు చంద్రబాబు ఏం చేయగలిగారు అన్నదే ఇక్కడ ప్రశ్న. తమ భూముల కోసం గత ఏడాదిన్నరగా అమరావతి రైతులు రోడ్డున పడి ఉద్యమాలు చేస్తూంటే టీడీపీ వారిని గాలికి వదిలేసింది అన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
జగన్ ట్రాప్ లో పడి….
చంద్రబాబు కూడా జగన్ ట్రాప్ లో చిక్కుకున్నారని అంటున్నారు. మూడు రాజధానులు అంటూ తెలివిగా జగన్ వేసిన పాచిక పారింది. అందుకే చంద్రబాబు గట్టిగా అమరావతి అని అనలేకపోతున్నారు. దీంతోనే రైతాంగం గుర్రుమంటోంది. అమరావతి రాజధాని అంటూ చంద్రబాబు నినదిస్తే మిగిలిన ప్రాంతాలు ఆయనకు దూరం అవడం ఖాయం. అది ఉత్తరాంధ్రా అయినా, రాయలసీమ అయినా కూడా చంద్రబాబుకు చుక్కలు చూపిస్తాయి. ఇప్పటికే ఈ ప్రాంతాలు వైసీపీ కొమ్ము కాశాయి. మళ్ళీ ఇదే సీన్ రిపీట్ అయితే 2024లో కూడా టీడీపీ ఓడిపోతుంది. దాంతోనే చంద్రబాబు తన రాజకీయం తాను చూసుకుంటున్నారు అన్న మాట అమరావతి ఉద్యమకారుల నుంచి వినవస్తోంది.
గట్టిగా నిలబడటానికి కూడా..?
చంద్రబాబు గట్టిగా నిలబడి అమరావతి రైతుల పక్షాన పోరాటం చేయకపోవడం మీద వారు గుస్సా అవుతున్నారు. యేడాది క్రితం కాస్తో కూస్తో బాబు, టీడీపీ వాళ్లు అమరావతి అంటూ గొంతెత్తారు. అయితే ఇప్పుడు ఆ పేరే మరచపోయిన పరిస్థితి ఉంది. తాము చంద్రబాబునే నమ్మి భూములు ఇచ్చామని, ఇపుడున్న ప్రభుత్వం రాజధానిని ముక్కలు చేస్తూంటే నాడు బాధ్యుడుగా ఉన్న చంద్రబాబు ముందుగా రోడ్డు మీదకు రావాలని, కానీ అలా జరగలేదని వారు అంటున్నారు. ఇక తాము ఎవరినీ నమ్మమని కూడా వారు తెగేసి చెబుతున్నారు. తాము న్యాయ స్థానాలను, దేవుళ్ళను మాత్రమే నమ్ముకుంటామని కూడా వారు గట్టిగానే చెబుతున్నారు.
ఇక్కడ కూడా చెడ్డయి….
మొత్తానికి జగన్ మూడు రాజధానుల ఉచ్చులో చిక్కుకున్న చంద్రబాబుకు ఉత్తరాంధ్రా, రాయలసీమలలో పొలిటికల్ గా ఎంత కలసి వస్తుందో తెలియదు కానీ అమరావతికి బాగానే చెడ్డ అయ్యారన్న విశ్లేషణలు ఉన్నాయి. రేపటి రోజున అమరావతిలో టీడీపీకి కూడా రాజకీయంగా ఇబ్బందులు తప్పవా ? అన్నదే టీడీపీలో వినిపిస్తున్న మాట. మొత్తానికి చంద్రబాబు మాట మీద నిలబడరు అనడానికి అమరావతి ఉద్యమ కధ ఒక ఉదాహరణ అంటున్నారు