గ్రీష్మకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ?
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈసారి కరెక్ట్ రూట్ లోనే వెళ్తున్నాట్లుగా కనిపిస్తోంది. పార్టీకి భారంగా మారిన వారిని వృద్ధ జంబూకాలను వదిలించుకోవడంతో పాటు నూతన జవసత్వాలు [more]
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈసారి కరెక్ట్ రూట్ లోనే వెళ్తున్నాట్లుగా కనిపిస్తోంది. పార్టీకి భారంగా మారిన వారిని వృద్ధ జంబూకాలను వదిలించుకోవడంతో పాటు నూతన జవసత్వాలు [more]
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈసారి కరెక్ట్ రూట్ లోనే వెళ్తున్నాట్లుగా కనిపిస్తోంది. పార్టీకి భారంగా మారిన వారిని వృద్ధ జంబూకాలను వదిలించుకోవడంతో పాటు నూతన జవసత్వాలు అందించేలా యువతకు ప్రోత్సహించాలని భావిస్తున్నారు. చంద్రబాబు ఆలోచనలు మారడంతో చాలా మంది నవతరం నాయకులకు ఈసారి టికెట్లు దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లా నుంచి చూసుకుంటే మంత్రిగా, స్పీకర్ గా పనిచేయడమే కాదు, సుదీర్ఘకాలం పాటు ఎమ్మెల్యేగా ఉంటూ వచ్చిన కావలి ప్రతిభాభారతి ఫ్యామిలీకి ఇన్నాళ్ళకు న్యాయం జరిగేలా పరిస్థితి ఉంది. ఆమె ఏకైక కుమార్తె, రాజకీయ వారసురాలు గ్రీష్మకు ఈసారి టీడీపీ టికెట్ దక్కడం ఖాయమే అంటున్నారు.
ఫస్ట్ టైమ్ షాక్ …?
ప్రతిభాభారతి ఎచ్చెర్ల నుంచి 1983తో మొదలుపెట్టి టోటల్ గా అయిదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆమె 2004లో తొలిసారి ఓటమి పాలు అయ్యారు. ఆ తరువాత అసెంబ్లీ నియోజకవర్గాల పునర్ విభజనలో ఆమె రాజాం కి మారిపోయారు. 2009, 2014 ఎన్నికల్లో చంద్రబాబు టికెట్ ఇచ్చినా ఆమె ఓడిపోయారు. ఇక 2019 ఎన్నికల వేళ కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన కోండ్రు మురళీ మోహనరావుకి చంద్రబాబు టికెట్ ఇవ్వడంతో తొలిసారిగా ప్రతిభా భారతి కి షాక్ తగిలింది. దాంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురి అయ్యారు. తనకు ఎన్నికల మీద ఆసక్తి లేదని, వారసురాలికి టికెట్ ఇస్తే చాలు అని ఆమె చంద్రబాబుకు మొర పెట్టుకున్నా నాడు ఫలితం లేకుండా పోయింది. తీరా కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి తెచ్చిన కోండ్రు మురళీ మోహన్ కూడా ఓడారు. ఇపుడు మళ్ళీ అక్కడ ప్రతిభ పట్టు సాధించారు అని చెప్పాలి.
పచ్చ జెండా ఊపేశారా …?
ఇక చంద్రబాబు కూడా ఈ మధ్య సీనియర్ల విషయంలో ఆలోచనలు మార్చుకుంటున్నారు. వారు వారసులను ముందుకు తేవడం ద్వారా వారిని నొప్పించకుండానే పార్టీకి యువ రక్తాన్ని ఎక్కించాలనుకుంటున్నారు. అందులో భాగంగా ప్రతిభ కుమార్తె గ్రీష్మకు చంద్రబాబు పచ్చ జెండా ఊపేశారు అంటున్నారు. ఈ మధ్య ఆమె పుట్టిన రోజు వేళ చంద్రబాబు నేరుగా ఫోన్ చేసి అభినందనలు తెలియచేడమే కాకుండా పార్టీ కోసం జాగ్రత్తగా పనిచేసుకోమంటూ చెప్పడంతో ప్రతిభ కుటుంబం ఆనందానికి అవధులు లేకుండా పోయాయట. మరో వైపు చూస్తే కోండ్రుకు ఈసారి టీడీపీ టికెట్ అనుమానమే అంటున్నారు.
దూకుడు మీదున్నారే…?
ఇక రాజాంలో ఇప్పటికి రెండు సార్లు వైసీపీ జెండా ఎగరేసింది. కంబాల జోగులు వరసగా గెలుస్తూ వస్తున్నారు. ఆయన మీద కోండ్రు మురళీ, ప్రతిభాభారతి కూడా గతంలో ఓడారు. అయితే యువతరం మద్దతుని సమీకరిస్తున్న గ్రీష్మ ఈ తడవ గెలిచి సత్తా చాటుతుంది అని టీడీపీ అధినేత చంద్రబాబు విశ్వాసంతో ఉన్నారు. ఇప్పటికే గ్రీష్మ జనంలో ఉంటూ టీడీపీని ముందుకు తీసుకెళ్ళేందుకు గట్టిగానే కృషి చేస్తున్నారు. మరి ప్రతిభాభారతి తండ్రి పున్నయ్య, తాత నారాయణ కూడా ఎమ్మెల్యేలుగా పనిచేశారు. ఇపుడు నాలుగవ తరంలో గ్రీష్మ ఎంట్రీ ఇస్తోంది. ఆమె కూడా చట్ట సభలో అడుగుపెడితే కావలి కుటుంబానికి అదొక రికార్డుగా ఉంటుంది అంటున్నారు.