చంద్రబాబుకు అదే కలిసి వస్తోందా..?
టీడీపీ అధినేత, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆ సిద్ధాంతమే బాగా కలిసి వస్తోందని అంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం రాష్ట్రం కొన్ని [more]
టీడీపీ అధినేత, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆ సిద్ధాంతమే బాగా కలిసి వస్తోందని అంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం రాష్ట్రం కొన్ని [more]
టీడీపీ అధినేత, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆ సిద్ధాంతమే బాగా కలిసి వస్తోందని అంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం రాష్ట్రం కొన్ని కీలక విషయాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఇవి రాష్ట్ర భవిష్యత్తుకే కాకుండా పలు పార్టీలకు కూడా ముడిపడిన వ్యవహారాలు. అయినప్పటికీ చంద్రబాబు ఆయా విషయాలపై నోరు విప్పడం లేదు. తన బదులు తన వారిని అన్నట్టుగా కొందరు నేతలను రంగంలోకి దింపుతున్నారు. దీంతో వారే ఆయా విషయాలపై మాట్లాడుతున్నారు.
వ్యూహాత్మకంగానే?
అయితే.. ఇదంతా చంద్రబాబు వ్యూహాత్మకంగా చేస్తున్న పనని అంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం కొన్ని విషయాల్లో చంద్రబాబు మౌన సిద్ధాంతాన్ని ఎంచుకున్నారని.. మౌనంగా ఉంటేనే తనకు మంచిదని భావిస్తున్నారని.. వారు చెబుతున్నారు. ఉదాహరణకు పోలవరం ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు నోరు విప్పడం లేదు. కేవలం అంచనాల విషయానికి వస్తే మాత్రమే .. మాజీ మంత్రి దేవినేని ఉమను రంగంలోకి దింపుతున్నారు. కానీ, పునరావాసం, ఇక్కడి గిరిజనుల విషయం వస్తే .. టాపిక్ డైవర్ట్ చేస్తున్నారు. అదే సమయంలో వెలిగొండ ప్రాజెక్టు విషయంలోనూ అనూహ్యమైన మౌనంగా ఉన్నారు.
ఉత్తరాంధ్ర పేరుతో….
ఇక, ఉత్తరాంధ్ర వేదిక పేరుతో టీడీపీ నాయకులు హల్ చల్ చేస్తుంటే.. చంద్రబాబు మాత్రం పూర్తిగా సైలెంట్ అయ్యారు. ఆయన ఒక్కమాట కూడా మాట్లాడలేదు. రాయలసీమ అభివృద్ధి పై కూడా ఆ ప్రాంత నేతలకే చంద్రబాబు విమర్శలను అప్పజెప్పారు. దీనికి కారణం.. ఏంటి ? ఎందుకు ఇంత వ్యూహాత్మకంగా మౌన సిద్ధాంతాన్ని ఎంచుకున్నారు ? అంటే.. గతంలోనే ఆయా ప్రాజెక్టులు తన పాలనలో అమలు జరిగి ఉండాల్సినవి. కానీ, చంద్రబాబు వాటిని పెద్దగా లక్ష్యంలోకి తీసుకోలేదు.
పోలవరం విషయంలో…
ఇలా కీలకంగా భావించిన పోలవరం విషయంలో తప్పటడుగులు వేసి పూర్తిచేయలేకపోయారు. ఇక రాజధాని విషయంలో చంద్రబాబు పెద్ద మాయాలోకాన్నే క్రియేట్ చేశారు. రాజధాని మాత్రం సగం కూడా పూర్తవ్వలేదు. దీంతో ఇప్పుడు ఆయా అంశాలపై నోరు విప్పితే.. అడ్డంగా బుక్కయి..ప్రజల్లో పలుచన అవడం ఎందుకనే ధోరణితోనే చంద్రబాబు సైలెంట్ అయ్యారని.. ఆయన మౌన సిద్ధాంతం పాటిస్తున్నారని అంటున్నారు. మరి ఇది ఏమేరకు ఆయనకు మేలు చేస్తుందో చూడాలి.