బాబు వ్యూహం.. ఎటు నుంచి నరుక్కొస్తున్నారంటే?
ఏపీ ప్రధాన ప్రతిపక్షం.. తెలుగుదేశం పార్టీ విషయంలో ఇటీవల కాలంలో కొన్ని అంచనాలు వస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో అధికార పగ్గాలు చేపట్టాలంటే.. ఏదో ఒక యాత్ర చేసి [more]
ఏపీ ప్రధాన ప్రతిపక్షం.. తెలుగుదేశం పార్టీ విషయంలో ఇటీవల కాలంలో కొన్ని అంచనాలు వస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో అధికార పగ్గాలు చేపట్టాలంటే.. ఏదో ఒక యాత్ర చేసి [more]
ఏపీ ప్రధాన ప్రతిపక్షం.. తెలుగుదేశం పార్టీ విషయంలో ఇటీవల కాలంలో కొన్ని అంచనాలు వస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో అధికార పగ్గాలు చేపట్టాలంటే.. ఏదో ఒక యాత్ర చేసి తీరాల్సిందేనని పార్టీ అధినేత చంద్రబాబు భావిస్తున్నారు. అయితే.. దీనిని ఎలా ముందుకు తీసుకువెళ్లాలి ? అనేవిషయంలో సందేహాలు వచ్చాయి. ఎందుకంటే నిన్నటి వరకు.. అధికారంలో ఉన్న పార్టీ ఇప్పుడు పాదయాత్ర చేసి.. ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ప్రయత్నించడం అంత బాగోదని… కొందరు చంద్రబాబుకు సలహా ఇచ్చారు.
తాను చేయాలనుకున్నది….
అయితే.. పార్టీని గాడిలో పెట్టాలంటే.. ఖచ్చితంగా ఇప్పుడున్న లెవెల్ నుంచి పార్టీని బయటకు తీసుకురావాలి. దీనికి పాదయాత్ర, బస్సు యాత్ర, సైకిల్ యాత్ర వంటివి చేపట్టాల్సిన అవసరం ఉందని.. చంద్రబాబు భావిస్తున్నారు. అయితే.. మరోవైపు.. కొందరు చేస్తున్న సూచనలు.. అంతో ఇంతో .. అడ్డుపడుతున్న అహం.. వంటివి చంద్రబాబును మరో రూపంలో నడిపిస్తున్నాయి. తాను చేయాలని అనుకున్న పనులను తన తమ్ముళ్ల ద్వారా.. పార్టీ కీలక నేతల ద్వారా చేయించాలని నిర్ణయించారు. అంటే.. ఇప్పుడు తను ఏదైనా చేయాలంటే అనివార్య కారణాలతో చేయలేకపోతే తన పార్టీ నేతలను రంగంలోకి దింపుతున్నారు.
ప్రాంతాల వారీగా…
ఈ క్రమంలోనే పార్టీ కీలక నేతలను రంగంలోకి దింపి.. వచ్చే ఎన్నికలకు సంబంధించి పార్టీని బలోపేతం చేసుకునే కార్యక్రమం దిశగా చంద్రబాబు అడుగులు వేస్తున్నారని అంటున్నారు మేధావులు. తాజాగా ఉత్తరాంధ్ర చర్చావేదిక పేరిట.. మూడు జిల్లాల నేతలు.. విశాఖలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఒక ప్లాన్ను తెరమీదికి వతెచ్చారు. అదేంటంటే.. త్వరలోనే బస్సు యాత్ర చేపట్టాలని. ఉత్తరాంధ్రలో టీడీపీ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులతోపాటు.. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ హయాంలో తీసుకున్న నిర్ణయాల తాలూకు ప్రాజెక్టులు ఇప్పుడు ఏదశలో ఉన్నాయో.. తెలుసుకునేందుకు ప్రయత్నిస్తారు.
ప్రజలను కలిసేందుకు….
పనిలో పనిగా.. ప్రజలతోనూ కలుస్తారు. ఇదీ.. తీసుకున్న నిర్ణయం.. అయితే.. ఈ యాత్ర వెనుక ప్రాజెక్టులను కలవాలనేది ప్రధాన ఉద్దేశం కానేకాదు.. ఏదో ఒక యాత్ర చేయాలి.. కనుక. బస్సు యాత్రను ఈ రూపంలో చేపట్టనున్నారని.. అంటున్నారు పరిశీలకులు. మరి ఈ యాత్ర ఏమవుతుందో ? చూడాలి.