tdp : జెండాలు ఎగురుతున్నాయ్… బాబు ఫుల్లు హ్యాపీ
గత రెండున్నరేళ్లుగా ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. రెండేళ్ల నుంచి పార్టీ నేతల నుంచి క్యాడర్ వరకూ నిరాశా నిస్పృహలో ఉంది. ఏ [more]
గత రెండున్నరేళ్లుగా ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. రెండేళ్ల నుంచి పార్టీ నేతల నుంచి క్యాడర్ వరకూ నిరాశా నిస్పృహలో ఉంది. ఏ [more]
గత రెండున్నరేళ్లుగా ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. రెండేళ్ల నుంచి పార్టీ నేతల నుంచి క్యాడర్ వరకూ నిరాశా నిస్పృహలో ఉంది. ఏ కార్యక్రమానికి పిలుపు ఇచ్చినా పెద్దగా స్పందన ఉండటం లేదు. అయితే గత కొన్ని నెలల నుంచి నేతల్లో మార్పు స్పష్టంగా కన్పిస్తుంది. కసి పెరిగింది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎలాగైనా గెలిపించాలన్న తపన క్యాడర్ లో మొదలయింది.
ఇటీవల కాలంలో….
చంద్రబాబు ఇటీవల కాలంలో ఇచ్చిన పార్టీ కార్యక్రమాలకు మంచి స్పందన లభిస్తుంది. తాజాగా ఈరోజు టీడీపీ చేపట్టిన నిరసన కార్యక్రమాలు ప్రతి నియోజకవర్గంలో జరిగాయి. కేంద్ర పార్టీ కార్యాలయానికి వచ్చిన నివేదికల ప్రకారం ప్రతి నియోజకవర్గంలో నేతల పార్టిసిపేషన్ ఉంది. మండల స్థాయిలో జెండాలు ఎగిరాయి. స్వయంగా ఈ నిరసన కార్యక్రమంపై జిల్లాల నుంచి నివేదికలు తెప్పించుకున్న చంద్రబాబు ఖుషీ అయ్యారంటున్నారు.
నేతలను సెట్ చేయడంలో….
చంద్రబాబు జగన్ ను ఓడించడం సంగతి పక్కన పెడితే ముందుగా నేతలను, క్యాడర్ ను మోటివేట్ చేయడంలో సక్సెస్ అయ్యారనే చెప్పాలి. నిజానికి గతంలో ఎన్నడూ లేని విధంగా మొన్నటి ఎన్నికల్లో ఓటమి తర్వాత చంద్రబాబు నేతలను కంట్రోల్ చేయడంలో విఫలమయ్యారు. ఒక దశలో నాయకత్వంపై కూడా అనుమానాలు తలెత్తాయి. కానీ చంద్రబాబు మాత్రం నేతలను మోటివేట్ చేయడానికి నిత్యం ప్రయత్నించేవారు.
ఈరోజు క్యాడర్ మొత్తం….
గత రెండేళ్లుగా సాధ్యం కాని పని రెండు నెలల నుంచి గాడిలో పడింది. నేతలు వీధుల్లోకి వస్తున్నారు. జెండాలు చేత పట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా కదం తొక్కుతున్నారు. ఈ ఒక్కరోజే 175 నియోజకవర్గాల్లో క్యాడర్ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చింది. పోలీసులు అరెస్ట్ చేసినా అనేక చోట్ల నేతలు నిరసన కార్యక్రమం చేపట్టారు. జిల్లాల నుంచి నివేదికలు తెప్పించుకున్న చంద్రబాబు ఈరోజు హ్యాపీ మూడ్ లోకి వెళ్లిపోయారు.