chandrababu : జగన్ కు ఇక ఏ ఛాన్స్ ఇవ్వకూడదట
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తన ఆలోచనను మార్చుకున్నారు. ఇప్పట్లో ఎన్నికలు రాకూడదని ఆయన కోరుకుంటున్నారు. నిన్న మొన్నటి వరకూ జమిలి ఎన్నికలు వస్తాయని చంద్రబాబు పదే [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తన ఆలోచనను మార్చుకున్నారు. ఇప్పట్లో ఎన్నికలు రాకూడదని ఆయన కోరుకుంటున్నారు. నిన్న మొన్నటి వరకూ జమిలి ఎన్నికలు వస్తాయని చంద్రబాబు పదే [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తన ఆలోచనను మార్చుకున్నారు. ఇప్పట్లో ఎన్నికలు రాకూడదని ఆయన కోరుకుంటున్నారు. నిన్న మొన్నటి వరకూ జమిలి ఎన్నికలు వస్తాయని చంద్రబాబు పదే పదే చెప్పేవారు. ఒక ఏడాది ముందుగా 2023 లో జమిలి ఎన్నికలు వస్తాయని పార్టీ నేతలు సిద్ధంగా ఉండాలని చెప్పేవారు. కానీ చంద్రబాబు ఇప్పడిప్పుడే ఎన్నికలు వద్దని భావిస్తున్నారు. ఇటు పార్టీ బలంగా లేకపోవడం, అటు వైసీపీ తీవ్ర వ్యతిరేకత కనపడకపోవడమే ఇందుకు కారణం.
జమిలి ఎన్నికలు వస్తాయంటూ…
చంద్రబాబు జగన్ ముఖ్యమంత్రి అయిన తొలి రోజు నుంచి జమిలి ఎన్నికల ప్రస్తావనను తీసుకు వస్తున్నారు. ఎన్నికల ఫలితాలు రాగానే ఈవీఎంల మీద రుద్దబోయారు. అదే సమయంలో బీజేపీతో చెలిమి కోసం ప్రయత్నించారు. దీనికి ప్రధాన కారణం జగన్ ను వీలయినంత త్వరగా జైలుకైనా పంపాలి. లేదా గద్దెనయినా దించాలి. ఇందుకు కేంద్ర ప్రభుత్వం సహకారం అవసరం. కానీ కేంద్రం నుంచి సానుకూలత రాకపోవడంతో చంద్రబాబు ఇప్పుడు ముందస్తు ఎన్నికల గురించి ప్రస్తావించడం మానేశారు.
ఇప్పుడిప్పుడే వ్యతిరేకత…
ఇప్పుడిప్పుడే వైసీపీ ప్రభుత్వం పై వ్యతిరేకత వస్తుందని చంద్రబాబు అంచనా వేస్తున్నారు. కానీ అది ఏ స్థాయిలో ఉందనేది మాత్రం తెలియదు. కొన్ని వర్గాల్లో అసంతృప్తి మొదలయింది. ప్రధానంగా ఉద్యోగ, వ్యాపార, మథ్యతరగతి ప్రజల్లో వ్యతిరేకత మొదలయింది. మరికొంత కాలం ఉంటే ఇది తీవ్రస్థాయికి చేరుకుంటుంది. ఈ లోగా పార్టీని బలోపేతం చేసుకునేందుకు తనకు అవకాశం లభిస్తుందన్నది చంద్రబాబు ఆలోచన.
మరికొంత సమయంలో…
ప్రస్తుతం తాము రాజకీయంగా బలహీనంగా ఉన్నామని చంద్రబాబుకు తెలియంది కాదు. కోలుకునేందుకు కొంత సమయం పడుతుంది. ఇప్పుడిప్పుడే నేతలు వీధిలోకి వస్తున్నారు. క్యాడర్ లోనూ జోష్ పెరిగింది. మరో రెండేళ్ల సమయం తీసుకుంటే వైసీపీ పూర్తి స్థాయిలో బద్నాం అవుతుందని, జగన్ కు మరోసారి ఛాన్స్ ఏపీ ప్రజలు ఇవ్వరని చంద్రబాబు భావిస్తున్నారు. ఇది తన కుమారుడుకు కూడా లాభించేదని, అందుకే 2024లోనే ఎన్నికలు వస్తే బాగుంటుదన్నది చంద్రబాబు భావన. మొత్తం మీద ఎన్నికల విషయంలో చంద్రబాబు ఆలోచన మారిందనే అంటున్నారు.