Chandrababu : ఆరోజు ఆ నిర్ణయం తీసుకోకపోయి ఉంటే?
రాజకీయాల్లో సమర్థనలు ఎప్పుడూ చెల్లవు. తాము తీసుకున్న నిర్ణయాలు ఒక్కోసారి ఇబ్బందులను తెచ్చిపెడతాయి. ఎంపీీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరిగే సమయంలో చంద్రబాబు ఎన్నికల బహిష్కరణకు పిలుపు నిచ్చారు. [more]
రాజకీయాల్లో సమర్థనలు ఎప్పుడూ చెల్లవు. తాము తీసుకున్న నిర్ణయాలు ఒక్కోసారి ఇబ్బందులను తెచ్చిపెడతాయి. ఎంపీీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరిగే సమయంలో చంద్రబాబు ఎన్నికల బహిష్కరణకు పిలుపు నిచ్చారు. [more]
రాజకీయాల్లో సమర్థనలు ఎప్పుడూ చెల్లవు. తాము తీసుకున్న నిర్ణయాలు ఒక్కోసారి ఇబ్బందులను తెచ్చిపెడతాయి. ఎంపీీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరిగే సమయంలో చంద్రబాబు ఎన్నికల బహిష్కరణకు పిలుపు నిచ్చారు. ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉన్నంత వరకూ పోటీకి దిగిన చంద్రబాబు ఆయన పదవీ కాలం పూర్తి కావడంతో ఎన్నికలను బహిష్కరించారు. ఏకగ్రీవాలను సాకుగా చూపి, బెదిరింపులకు దిగారని చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారంటారు.
నిధులు ఇవ్వాల్సినందున…
అయితే అనేక చోట్ల పోటీకి ఎవరూ దొరకకపోవడంతోనే బహిష్కరణకు పిలుపునిచ్చారన్న విమర్శలున్నాయి. టీడీపీ నేతలు అనేక చోట్ల ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనడం కారణంగా పోటీకి సుముఖత వ్యక్తం చేయలేదన్నది కూడా వాస్తవమే. దీనికి తోడు పార్టీ నిధులు ఇవ్వాలన్న వత్తిడి కూడా చంద్రబాబు బహిష్కరణకు కారణమని అనే వారు కూడా లేకపోలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆర్థికంగా ఇబ్బందులు తలెత్తడంతో ఈ ఎన్నికల్లో పార్టీ నుంచి నిధుల విడుదల చేయలేక చేతులెత్తేశారని చెబుతారు.
నీరసంగా క్యాడర్….
ఇప్పుడు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు వస్తున్నాయి. దీంతో టీడీపీ శ్రేణుల్లో నీరసం కన్పిస్తుంది. ఎక్కడా టీడీపీ నేతలు ఇళ్లు వదలి బయటకు రాలేదు. కౌంటింగ్ లో తాము పోటీ చేయకపోవడంతో వాళ్లు ఇళ్లకే పరిమితమయ్యారు. పార్టీ తీసుకున్న నిర్ణయానికి బలి కావాల్సి వచ్చిందని మదన పడుతున్నారు. నిజానికి కొందరు బలమైన నేతలే ఉన్నారు. వారిని కొంత ఆర్థికంగా ఎన్నికల్లో ఆదుకుంటే సానుకూల ఫలితాలు వచ్చేవి.
మరో ఐదేళ్లు….
కాని చంద్రబాబు మాత్రం నిధుల వ్యయానికి భయపడే ఈ ఎన్నికలను బహిష్కరించారన్నది పార్టీలో బలంగా వినిపిస్తుంది. మరో ఐదేళ్ల పాటు తమకు రాజకీయ అవకాశాలు లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫలితాలు విలువలేవని టీడీపీ అగ్రనేతలు కొట్టిపారేస్తున్నా ఈ ఫలితాలు వస్తుండటంతో పార్టీ కింది స్థాయి నేతల్లో నైరాశ్యం అలుముకుందని సీనియర్ నేతలే అంగీకరిస్తున్నారు. మొత్తం మీద చంద్రబాబు తీసుకున్న నిర్ణయం కొందరి రాజకీయ జీవితాన్ని ఐదేళ్లు వెనక్కు నెట్టిందన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి.