Chandrababu : నారా తన కొమ్మను తానే నరుక్కుంటున్నారేమో
ఒక్కటి మాత్రం నిజం. చంద్రబాబు వ్యూహాత్మక తప్పిదం చేశారు. స్థానిక ఎన్నికలను బహిష్కరించి తన కొమ్మను తానే నరుక్కున్నారు. చంద్రబాబుకు ఎప్పుడూ ఎన్నికలంటే భయం. ఆయన అధికారంలో [more]
ఒక్కటి మాత్రం నిజం. చంద్రబాబు వ్యూహాత్మక తప్పిదం చేశారు. స్థానిక ఎన్నికలను బహిష్కరించి తన కొమ్మను తానే నరుక్కున్నారు. చంద్రబాబుకు ఎప్పుడూ ఎన్నికలంటే భయం. ఆయన అధికారంలో [more]
ఒక్కటి మాత్రం నిజం. చంద్రబాబు వ్యూహాత్మక తప్పిదం చేశారు. స్థానిక ఎన్నికలను బహిష్కరించి తన కొమ్మను తానే నరుక్కున్నారు. చంద్రబాబుకు ఎప్పుడూ ఎన్నికలంటే భయం. ఆయన అధికారంలో ఉండగా స్థానిక సంస్థల ఎన్నికలు జరపడానికి ఎన్నడూ ప్రయత్నించలేదు. రిజల్ట్ తేడా కొడితే తన నాయకత్వంపై నమ్మకం పోతుందనే భయంతో చంద్రబాబు లోకల్ ఎన్నికలు దూరంగా ఉంటూనే వచ్చారు.
ఎప్పుడు ఎన్నికలన్నా….
2013 లో లోకల్ బాడీ ఎన్నికలు జరిగాయి. అప్పటి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఈ ఎన్నికలు జరిపించారు. అప్పడు తెలంగాణ ఉద్యమంతో పాటు కాంగ్రెస్ బలహీనం కావడం కూడా చంద్రబాబుకు కలసి వచ్చింది. అయితే నాడు వైసీపీ పోటీ చేయకుండా ఉండలేదు. వైసీపీ బరిలోకి దిగింది. అత్యధిక స్థానాలను టీడీపీయే దక్కించుకున్నా, ఇంత దారుణమైన ఓటమిని నాడు వైసీపీ చూడలేదు. అందుకే వైసీపీ నేతలు, క్యాడర్ నేటికీ బలంగా అంటిపెట్టుకుని ఉంది. 2018 లో తాను అధికారంలో ఉండి జరిపించే అవకాశం ఉన్నా వెనక్కు తగ్గారు.
వాస్తవాన్ని గుర్తించక…
కానీ చంద్రబాబు క్షేత్రస్థాయిలో వాస్తవాన్ని నేటికీ గుర్తించలేదు. అస్త్ర సన్యాసం చేసి ఏం చేయాలి? బహిష్కరించినంత మాత్రాన ఓటర్లు గుర్తిస్తారా? పోలింగ్ కేంద్రాలకు అంత మంది జనం ఎందుకు పోటెత్తారు? అనే ప్రశ్నలకు చంద్రబాబు వద్ద బహుశ సమాధానం ఉండకపోవచ్చు. తాను ఎన్నికలను బహిష్కరించినా అనేక చోట్ల పోటీలో పార్టీ నేతలు ఉండటం మరచిపోయారా? బహిష్కరణ ప్రకటన చేసిన రోజునే సీనియర్ నేత జ్యోతుల నెహ్రూ వ్యతిరేకించారు. అభ్యంతరం తెలిపారు. తమ పదవికి రాజీనామా చేశారు.
70 లక్షల సభ్యత్వం ఉన్న….
జ్యోతుల నెహ్రూ ఎందుకు రాజీనామా చేశారంటే తన వర్గానికి చెందిన నేతలను పోటీలోకి దింపాలని మాత్రమే. ఎన్నికల్లో కాడి కింద పడేస్తే ఎవరికి నష్టం? పోరాటం చేయాల్సిన సమయంలో చేతులెత్తేయడం నాయకత్వ లక్షణం కాదు. ఎన్నాళ్లిలా తమను వైసీపీ వేధిస్తుందని, ఆర్థిక మూలాలు దెబ్బతీస్తుందని చెప్పుకుంటూ పోతారు. తాను రాజధానిగా మలచిన అమరావతిలోనే వైసీపీ జెండా ఎగిరింది. ఈ ఉదాహరణ చాలదా? జనం నాడి తెలియడానికి. దాదాపు 70 లక్షల సభ్యత్వం ఉన్న పార్టీ అధినేతగా చేయాల్సిన పని ఇదేనా చంద్రబాబూ? ఆత్మ విమర్శ చేసుకుని తప్పు సరిదిద్దుకుంటావో? నలభై ఏళ్ల ఎక్స్ పీరియన్స్ అంటూ నీలుగుతూ నష్టపోతావో నీ ఇష్టం.