Tdp : వీరు కూడా మాట వినడం లేదా?
తెలుగుదేశం పార్టీకి రాజ్యసభ సభ్యులు అచ్చిరారన్న ఒక సెంటిమెంట్ ఉంది. రాజ్యసభ పదవి ఇచ్చినా అనేక మంది నేతలు పార్టీని విడిచి వెళ్లారు. సరే వారి సంగతి [more]
తెలుగుదేశం పార్టీకి రాజ్యసభ సభ్యులు అచ్చిరారన్న ఒక సెంటిమెంట్ ఉంది. రాజ్యసభ పదవి ఇచ్చినా అనేక మంది నేతలు పార్టీని విడిచి వెళ్లారు. సరే వారి సంగతి [more]
తెలుగుదేశం పార్టీకి రాజ్యసభ సభ్యులు అచ్చిరారన్న ఒక సెంటిమెంట్ ఉంది. రాజ్యసభ పదవి ఇచ్చినా అనేక మంది నేతలు పార్టీని విడిచి వెళ్లారు. సరే వారి సంగతి పక్కన పెడితే ఇప్పుడు పార్లమెంటు సభ్యుల పరిస్థిితి కూడా అలాగే తయారయిందనుకోవాల్సి ఉంటుంది. మొన్నటి ఎన్నికల్లో టీడీపీ తరుపున ముగ్గురు ఎంపీలు గెలిచారు. గుంటూరు, విజయవాడ, శ్రీకాకుళం ఎంపీలు మొన్నటి ఎన్నికల్లో గెలిచారు. వీరిలో ఒక్కరే పార్టీలో యాక్టివ్ గా ఉండటం విశేషం.
కేశినేని నాని ఇప్పటికే….
విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని నాని ఇప్పటికే తాను మరోసారి పోటీ చేయబోనని చంద్రబాబుకు స్పష్టం చేశారు. ఆయన పార్టీలో యాక్టివ్ గా లేరు. ఈ మూడేళ్లు ఎంపీగా తాను నియోజకవర్గం పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతానని, ఎప్పటికీ గుర్తుండి పోయేలా కార్యక్రమాలను చేపట్టాలన్నది తన ఉద్దేశ్యమని కేశినేని నాని తనను కలసి టీడీపీ నేతలతో చెప్పినట్లు తెలిసింది. ఆయన పార్టీ నిర్వహించే కార్యక్రమాలకు పూర్తిగా దూరంగా ఉంటున్నారు.
గల్లా చాలా రోజుల నుంచి…
పార్టీ అధినాయకత్వంపై నెలకొన్న అసంతృప్తి ఆయన దూరంగా ఉంటున్నారు. ఇక గుంటూరు పార్లమెంటు సభ్యుడు గల్లా జయదేవ్ సయితం గత కొన్ని నెలలుగా పార్టీకి అందుబాటులో లేరు. ఆయన ముఖ్యమైన కార్యక్రమాలకు కూడా గైర్హాజరవుతున్నారు. కొంతకాలం విదేశాలకు వెళ్లి వచ్చినా, అంతకు ముందు కూడా ఆయన ఇన్ యాక్టివ్ గానే ఉన్నారు. గుంటూరు పార్టీ నేతలు గల్లా జయదేవ్ పై పార్టీ అధినేతకు కూడా ఫిర్యాదు చేశారు.
నెలలు గడుస్తున్నా….
అయినా గల్లా జయదేవ్ తీరు మారలేదంటున్నారు. ఆయన గుంటూరు పార్లమెంటు పరిధిలో పర్యటించి నెలలు గడుస్తుందంటున్నారు. పార్లమెంటు సమావేశాలకు తప్ప ఎక్కడా గల్లా జయదేవ్ కన్పించకపోవడం చర్చనీయాంశమైంది. కేశినేని పార్టీపై అసంతృప్తి, గల్లా జయదేవ్ అధికార పార్టీ తో ఇబ్బందులు తెచ్చుకోవడం ఎందుకన్న కారణంగానే పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఇక శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు మాత్రమే పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. పార్టీ కార్యక్రమాల్లో ఎంపీ స్థాయి నేతలే పాల్గొనక పోతే క్యాడర్ కు ఎలాంటి సంకేతాలు పంపుతున్నామని కొందరు ప్రశ్నిస్తున్నారు. కానీ చంద్రబాబు మాత్రం వీరిని ఏమీ అనలేక, చేయలేక చూసీ చూడనట్లు నటిస్తున్నారు.