Badvel : బద్వేలు చికాకు వదిలిపెట్టడం లేదుగా?
అప్పట్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. నంద్యాల ఉప ఎన్నిక వచ్చింది. మంత్రులను మండలాల వారీగా ఇన్ ఛార్జులుగా పెట్టింది. చంద్రబాబు విస్తృత ప్రచారం నిర్వహించారు. ఉప [more]
అప్పట్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. నంద్యాల ఉప ఎన్నిక వచ్చింది. మంత్రులను మండలాల వారీగా ఇన్ ఛార్జులుగా పెట్టింది. చంద్రబాబు విస్తృత ప్రచారం నిర్వహించారు. ఉప [more]
అప్పట్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. నంద్యాల ఉప ఎన్నిక వచ్చింది. మంత్రులను మండలాల వారీగా ఇన్ ఛార్జులుగా పెట్టింది. చంద్రబాబు విస్తృత ప్రచారం నిర్వహించారు. ఉప ఎన్నిక కావడంతో గ్రామాల వారీగా నేతలను సమన్వయం చేసుకుంటూ అప్పడు మంత్రులు పనిచేశారు. ఫలితంగా నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించింది. ఇక వెంటనే జరిగిన కాకినాడ కార్పొరేషన్ లోనూ అదే ఫార్ములాను ప్రయోగించి సక్సెస్ అయింది.
నంద్యాల ఫార్ములా అంటూ…
ఆ తర్వాత చంద్రబాబు అంతర్గత సమావేశాల్లో పదే పదే నంద్యాల ఫార్ములా గురించి ప్రస్తావించేవారు. నంద్యాల తరహాలో విజయం సాధించాలని నేతలకు చెప్పేవారు. కానీ అది సాధ్యం కాదని తెలుసు. జనరల్ ఎన్నికల్లో ఎవరి నియోజకవర్గంలో వారుంటారు. ఆర్థిక వనరులు పరిమితంగానే ఉంటాయి. కానీ చంద్రబాబు మాత్రం రెండేళ్ల పాటు నంద్యాల ఫార్ములా అంటూ నేతలను భయపెట్టేశారు. టీడీపీ అనుకూల మీడియా కూడా నంద్యాల ఫార్ములాకు ఎనలేని ప్రచారం ఇచ్చింది.
మళ్లీ అమలు చేయాలని….
కట్ చేస్తే నంద్యాల ఫార్ములా ఎటు పోయిందో తెలియదు. ఇప్పుడు బద్వేలు ఉప ఎన్నిక సందర్భంగా నంద్యాల ఫార్ములా మరోసారి తెరపైకి వచ్చింది. అధికారంలో ఉన్నప్పుడు అయితే ఏ ఫార్ములా అమలు చేసినా సక్సెస్ అవుతుంది. అదే విపక్షంలో ఉన్నప్పుడు ఎన్ని ఫీట్లు చేసినా అది రివర్సే కొడుతుంది. ఈ విషయం తెలిసిన నేతలు నంద్యాల ఫార్ములాను బద్వేలులో ఎలా అమలు చేయాలని ఎద్దేవా చేస్తున్నారు. ఇప్పుడు బద్వేలు ఉప ఎన్నిక నుంచి టీడీపీ పూర్తిగా పక్కకు తప్పుకుంది.
అభ్యర్థిని ప్రకటించింది ఎందుకో?
నంద్యాల ఫార్ములా అంటూ పార్టీ నేతలను ఊదరగొట్టి, అభ్యర్థిని ప్రకటించి జనసేన ప్రకటన తర్వాత ఎందుకు పోటీ నుంచి తప్పుకున్నారన్న ప్రశ్న తలెత్తుతుంది. ఇక్కడ నంద్యాల ఫార్ములాను అమలు పర్చాలని నిర్ణయించింది నిజం కాదా? అని ప్రశ్నిస్తున్నారు. కేవలం జనసేన నిర్ణయాన్ని సమర్థించడానికే పోటీ నుంచి తప్పుకున్నారని, భయంతో పారిపోయారని నియోజకవర్గంలో ఎద్దేవా చేస్తున్నారని పార్టీ నేతలు వాపోతున్నారు. మొత్తం మీద నంద్యాల ఫార్ములా అంటూ పార్టీనేతలకు చెప్పి, అభ్యర్థిని ప్రకటించిన తర్వత తప్పుకున్న చంద్రబాబుకు బద్వేలు చికాకులు ఇంకా తప్పడం లేదు.