Tdp : ఆ నిర్ణయం ఎందుకు తీసుకోలేకపోతున్నారో?
తెలుగుదేశం పార్టీకి కొన్ని చోట్ల అభ్యర్థులు కరువైతే.. మరికొన్ని చోట్ల పోటీ చేస్తామనే వారు ఎక్కువయ్యారు. అయితే ఎన్నికలు దగ్గరపడుతున్నా అనేక నియోజకవర్గాల్లో చంద్రబాబు ఇన్ ఛార్జులను [more]
తెలుగుదేశం పార్టీకి కొన్ని చోట్ల అభ్యర్థులు కరువైతే.. మరికొన్ని చోట్ల పోటీ చేస్తామనే వారు ఎక్కువయ్యారు. అయితే ఎన్నికలు దగ్గరపడుతున్నా అనేక నియోజకవర్గాల్లో చంద్రబాబు ఇన్ ఛార్జులను [more]
తెలుగుదేశం పార్టీకి కొన్ని చోట్ల అభ్యర్థులు కరువైతే.. మరికొన్ని చోట్ల పోటీ చేస్తామనే వారు ఎక్కువయ్యారు. అయితే ఎన్నికలు దగ్గరపడుతున్నా అనేక నియోజకవర్గాల్లో చంద్రబాబు ఇన్ ఛార్జులను నియమించలేదు. కొన్ని కీలక నియోజకవర్గాల్లో పార్టీకి ఇన్ ఛార్జి లేకుండానే లాగించేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం అక్కడ తీవ్రమైన పోటీ ఉండటం, మరోవైపు ఏ నేతను ఎంపిక చేయాలన్న దానిపై చంద్రబాబు నిర్ణయం తీసుకోకపోవడమే.
30కి పైగా నియోజకవర్గాల్లో…..
దాదాపు ముప్ఫయికి పైగా నియోజకవర్గాల్లో టీడీపీకి ఇన్ ఛార్జులు లేరు. అక్కడ ఎవరో ఒకరు పార్టీని నడిపిస్తున్నారు. రిజర్వ్ డ్ నియోజకవర్గాల్లో మాత్రం చంద్రబాబు ఇటీవల కొందరిని నియమించారు. ఇక్కడ ఎలాంటి వివాదం లేకపోవడంతో ఆ నియామకాలు జరిగాయి. మరి కీలక నియోజకవర్గాలను చంద్రబాబు ఎందుకు వదిలేశారన్న చర్చ పార్టీలో జరుగుతుంది. దీనికి ప్రధాన కారణం అక్కడి నేతల వైఖరి కూడా ఒక కారణమని అంటున్నారు.
కోడెల శివరామ్ కు….
ఉదాహరణకు సత్తెనపల్లి నియోజకవర్గం తీసుకుంటే అక్కడ పోటీ పడే వారు ఎక్కువ మంది ఉన్నారు. ఇక్కడ కోడెల శివప్రసాద్ మరణం తర్వాత ఇన్ ఛార్జి లేకుండా పోయారు. కోడెల శివరామ్ కు ఇవ్వాలని చంద్రబాబుకు గట్టిగా ఉంది. అయితే శివరామ్ పై తీవ్రమైన వ్యతిరేకత సొంత పార్టీ నేతల నుంచే వస్తుంది. దీంతో చంద్రబాబు వెనక్కు తగ్గారు. మరోవైపు రాయపాటి రంగారావు తీవ్రంగానే ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇక్కడ కష్టమే….
ఇప్పటికే రాయపాటి సాంబశివరావు తన కుమారుడికి సత్తెనపల్లి టిక్కెట్ ఇవ్వాల్సిందేనని అల్టిమేటం ఇచ్చి వెళ్లారు. ఇక్కడ మరో ఇద్దరు, ముగ్గురు కమ్మ సామాజికవర్గం నేతలు టిక్కెట్ కోసం పోటీపడుతుండటంతో చంద్రబాబు ఎవరినీ ఇన్ ఛార్జి గా నియమించకుండా నానుస్తూ వస్తున్నారు. పార్టీ కార్యక్రమాలను ఎవరికి వారు చేసుకుంటున్నారు. మొత్తం మీద సత్తెనపల్లి ఇన్ ఛార్జి నియామకం చంద్రబాబుకు అంత సులువు కాదంటున్నారు.