Chandrababu : మరోసారి వ్యూహాత్మక తప్పిదమా?
బద్వేల్ ఉప ఎన్నిక బరి నుంచి తప్పుకుని చంద్రబాబు మరోసారి వ్యూహాత్మక తప్పిందం చేశారు. సంప్రదాయాలను గౌరవిస్తున్నామని చెప్పి తప్పుకోవడాన్ని పార్టీ నేతలే తప్పుపడుతున్నారు. జగన్ ను [more]
బద్వేల్ ఉప ఎన్నిక బరి నుంచి తప్పుకుని చంద్రబాబు మరోసారి వ్యూహాత్మక తప్పిందం చేశారు. సంప్రదాయాలను గౌరవిస్తున్నామని చెప్పి తప్పుకోవడాన్ని పార్టీ నేతలే తప్పుపడుతున్నారు. జగన్ ను [more]
బద్వేల్ ఉప ఎన్నిక బరి నుంచి తప్పుకుని చంద్రబాబు మరోసారి వ్యూహాత్మక తప్పిందం చేశారు. సంప్రదాయాలను గౌరవిస్తున్నామని చెప్పి తప్పుకోవడాన్ని పార్టీ నేతలే తప్పుపడుతున్నారు. జగన్ ను ఇప్పటి వరకూ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న టీడీపీ ఒక్కసారిగా టర్న్ తీసుకోవడాన్ని టీడీపీ శ్రేణులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. చంద్రబాబు ఇటీవల తీసుకుంటున్న నిర్ణయాలు సరైన దిశగా లేవన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.
పరిషత్ ఎన్నికలను బహిష్కరించి….
ఇప్పటికే పరిషత్ ఎన్నికలను బహిష్కరించి తెలుగుదేశం పార్టీ తప్పు చేసింది. ఆ ఎన్నికలను బహిష్కరించడంతో అనేక మంది టీడీపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. సొంతంగా నిధులు ఖర్చు చేసుకునే వారు మాత్రమే పోట ీచేయాలని అంతర్గత ఆదేశాలు ఇవ్వడంతో ఎక్కువ మంది పోటీలో ఉండలేకపోయారు. ఫలితంగా పరిషత్ ఎన్నికల్లో వైసీపీ ఏకపక్ష విజయం సాధించింది. ఐదేళ్ల పాటు వారు పదవులకు దూరంగా ఉండాల్సి వచ్చింది.
విజయమ్మపై అప్పట్లో….
2009లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీ తరుపున విజయమ్మ పులివెందుల నుంచి పోటీ చేశారు. అప్పడు పోటీకి టీడీపీ దింపలేదు. అయితే మరి కొద్ది నెలల్లోనే వచ్చిన ఉప ఎన్నికల్లో విజయమ్మపై పోటీకి దింపింది. అప్పుడు జగన్ అప్పుడు వైసీపీ పార్టీ పెట్టడంతో విజయమ్మ రాజీనామా చేశారు. 2011లో జరిగిన ఉపఎన్నికల్లో వైసీపీ గుర్తు మీద పోటీ చేస్తున్న విజయమ్మపై చంద్రబాబు అభ్యర్థిని బరిలోకి దింపారు. అప్పటికి రాజశేఖర్ రెడ్డి మరణించి నెలలు కూడా గడవ లేదు.
జగన్ ను ముఖ్యమంత్రిగా…..
వైఎస్ మరణం తర్వాత కాంగ్రెస్ లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా జగన్ పేరు బయటకు వచ్చింది. కానీ దీనిని అప్పట్లో టీడీపీ వ్యతిరేకించింది. జగన్ ముఖ్యమంత్రిగా రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత టీడీపీ ఎందుకు ఒప్పుకోలేదు. తన తండ్రి మరణం తర్వా ముఖ్యమంత్రి పదవి జగన్ కు ఇవ్వాలన్న కొందరి నేతల వాదన కరెక్టే కదా? అప్పట్లో టీడీపీ ఎందుకు వ్యతిరేకించింది. ఇవి ఇప్పుడు చంద్రబాబుకు ప్రశ్నలు ఎదురవుతున్నాయి. కేవలం జనసేనాని వాదనను సమర్థించేందుకే చంద్రబాబు బద్వేలు బరి నుంచి తప్పుకున్నారన్న వాదనలు విన్పిస్తున్నాయి.