Tdp : దుబ్బాక చూసైనా బద్వేల్ గుర్తుకు రాలేదా?
రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు. ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా అధికార పార్టీ గెలుస్తుందన్న నమ్మకం అయితే లేదు. అయినా టీడీపీ బద్వేల్ ఉప ఎన్నికల్లో వెనక్కు తగ్గడాన్ని తప్పుపడుతున్నారు. [more]
రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు. ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా అధికార పార్టీ గెలుస్తుందన్న నమ్మకం అయితే లేదు. అయినా టీడీపీ బద్వేల్ ఉప ఎన్నికల్లో వెనక్కు తగ్గడాన్ని తప్పుపడుతున్నారు. [more]
రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు. ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా అధికార పార్టీ గెలుస్తుందన్న నమ్మకం అయితే లేదు. అయినా టీడీపీ బద్వేల్ ఉప ఎన్నికల్లో వెనక్కు తగ్గడాన్ని తప్పుపడుతున్నారు. ఎన్నికలంటే గెలుపోటములు ఒక్కటే లెక్క కాదు. ఒక్కోసారి ఓడినా పార్టీలు పైచేయి సాధించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. చంద్రబాబుకు సలహాలు ఇస్తున్న వారిపై కొందరు టీడీపీ నేతలు మండి పడుతున్నారు. ఆయనను కావాలని తప్పుదోవ పట్టిస్తున్నారంటున్నారు.
ఇతరులపై ఆధారపడ్డారా?
చంద్రబాబు సీనియర్ రాజకీయ వేత్త. నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూశారు. ఆయన ఒకరి సలహాలు విని నిర్ణయం తీసుకునే వ్యక్తి కాదు. కానీ అది గతం. ఇప్పుడు చంద్రబాబు పూర్తిగా ఇతరులపై ఆధారపడి ఉంటున్నారన్నారు. తిరుపతి ఉప ఎన్నికల్లో పోరాడిన చంద్రబాబు బద్వేల్ పై ఎందుకు వెనక్కు తగ్గారన్న కామెంట్స్ పార్టీ నుంచి వినపడుతున్నాయి. తిరుపతి ఉప ఎన్నికల సందర్భంగా పార్టీ గెలవకపోయినా అచ్చెన్నాయుడు వంటి వారు చేసిన వ్యాఖ్యలు పార్టీని డ్యామేజీ చేశాయి.
చికాకులు ఎదుర్కొనలేకనే….
అందుకే చంద్రబాబు సాధారణ ఎన్నికల సమయంలో ఇటువంటి చికాకులు ఎదుర్కొనేందుకు సిద్దంగా లేరు. ఆ కారణంగానే చంద్రబాబు బద్వేల్ ఉప ఎన్నిక బరి నుంచి తప్పుకున్నా రంటున్నారు. పొరుగున ఉన్న తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఫలితాలను చూసైనా చంద్రబాబు బద్వేల్ లో పోటీకి దింపాల్సిందన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. దుబ్బాక ఉప ఎన్నికలలో అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే మరణించడంతో ఆయన సతీమణికే కేసీఆర్ టిక్కెట్ ఇచ్చారు. అయినా అక్కడ ప్రజలు అధికార పార్టీని తిరస్కరించారు.
దుబ్బాకలో రివర్స్ అయిందిగా?
దీన్ని బట్టి సానుభూతి కంటే ప్రభుత్వంపై వ్యతిరేకతతోనే అక్కడ బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు. తెలుగుదేశం పార్టీ కూడా బద్వేల్ ఎన్నికల్లో పోటీ చేయాల్సి ఉంది. అప్పుడే ఆయనకు ప్రభుత్వంపై వ్యతిరేకత ఎంత ఉందో తెలిసి వచ్చేది. లేకుంటే తన నాయకత్వంపై నమ్మకంపైనా ఒక ఫీడ్ బ్యాక్ వచ్చేది. కానీ చంద్రబాబు భయంతో వెనక్కు తగ్గారని, కనీస సాహసం చేయలేకపోయారని పార్టీ నేతలే పెదవి విరుస్తుండటం విశేషం.