Chandrababu : ఈసారి టిక్కెట్ లు ఇచ్చేది వారికేనట
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గతంలో మాదిరి లేరు. 2019 ఎన్నికల అనంతరం చంద్రబాబుకు రెండేళ్లలో పార్టీ పరిస్థిితి అర్థమయింది. ఎవరు తన వారో? ఎవరు కాదో? [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గతంలో మాదిరి లేరు. 2019 ఎన్నికల అనంతరం చంద్రబాబుకు రెండేళ్లలో పార్టీ పరిస్థిితి అర్థమయింది. ఎవరు తన వారో? ఎవరు కాదో? [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గతంలో మాదిరి లేరు. 2019 ఎన్నికల అనంతరం చంద్రబాబుకు రెండేళ్లలో పార్టీ పరిస్థిితి అర్థమయింది. ఎవరు తన వారో? ఎవరు కాదో? అన్న దానిపై స్పష్టత వచ్చింది. ముందుగానే అభ్యర్థులను ఖరారు చేసి వారిని రెండేళ్ల ముందునుంచే నియోజకవర్గాల్లో పరిచయం చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. అధికారికంగా ప్రకటించకపోయినా ఇప్పుడు కష్టపడి పనిచేస్తూ గుర్తింపు పొందిన వారికే వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ అని సంకేతాలు పంపారు.
ఫార్ములా ప్రకారం….
చంద్రబాబు ఇందుకోసం ఒక ఫార్ములాను రూపొందించారు. కేంద్ర పార్టీ కార్యాలయంలో నియోజకవర్గాల నుంచి పార్టీ నేతల పనితీరుపై ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్నారు. పార్టీకోసం పనిచేసే వారికే వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ దక్కుతుంది. నియోజకవర్గాల ఇన్ ఛార్జులమని, తమకే టిక్కెట్ వస్తుందని అనుకుంటే పొరపాటేనని అంటున్నారు. ఇందుకోసం వారు చేసిన కార్యక్రమాలు, ప్రజల్లో గడిపే సమయాన్ని కూడా లెక్కలు వేస్తున్నారట చంద్రబాబు.
పనితీరు ఆధారంగానే….
అందుకే పనితీరు ఆధారంగా నియోజకవర్గాల ఇన్ ఛార్జులను నియమిస్తూ పోతున్నారు. అయితే వారికి కొంత గడువు ఇచ్చారు. ఆరు నెలల్లోపు వారు పనితీరు సరిగా ఉంటే ఓకే. లేకుంటే ఇన్ ఛార్జి పదవి నుంచి తప్పించడానికి వెనకాడబోమని చంద్రబాబు హెచ్చరికలు జారీ చేశారు. గతంలో చంద్రబాబు చివరి నిమిషంలో అభ్యర్థులను ఖరారు చేసేవారు. అనేక చోట్ల పోటీ ఉండటంతో నేతలు అసంతృప్తి చెందకుండా అందరితో మాట్లాడి ఫైనల్ చేసేవారు.
నో.. స్క్రీనింగ్ కమిటీ….
కానీ ఈసారి అభ్యర్థుల ఎంపిక అందుకు భిన్నంగా జరుగుతుంది. నేతల అభిప్రాయాలతో పనిలేదు. పనితీరు ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక ఉంటుందని చెబుతున్నారు. చివరి నిమిషంలో మార్పులు చేసే సంప్రదాయానికి చెక్ పెట్టినట్లు చంద్రబాబు స్పష్టం చేశారు. అలా అయితే పార్టీకి భారంగా మారతారన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అందుకే పనితీరు ఆధారంగానే చంద్రబాబు స్వయంగా ఈసారి అభ్యర్థుల ఎంపికను చేయాలని నిర్ణయించారట. గతంలో మాదిరి స్క్రీనింగ్ కమిటీలు వంటి ఉండవని చంద్రబాబు విస్పష్టం చేశారు. సో… ఇక నియోజకవర్గాల్లో ఎవరు పరుగులు పెడితే వారికే టిక్కెట్.