Chandrababu : బాబు ఎంత గింజుకున్నా…. వారు మాత్రం?
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పార్టీని బలోపేతం చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈసారి జనం తనను ఆదరిస్తారని, అభివృద్ధి లేని ఆంధ్రప్రదేశ్ కు తానే దిక్కవుతానని [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పార్టీని బలోపేతం చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈసారి జనం తనను ఆదరిస్తారని, అభివృద్ధి లేని ఆంధ్రప్రదేశ్ కు తానే దిక్కవుతానని [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పార్టీని బలోపేతం చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈసారి జనం తనను ఆదరిస్తారని, అభివృద్ధి లేని ఆంధ్రప్రదేశ్ కు తానే దిక్కవుతానని నమ్ముతున్నారు. ప్రజల్లో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత కన్పిస్తుందని, దానిని క్యాష్ చేసుకునేందుకు ప్రతి అంశాన్ని ఉపయోగించుకోవాలని చంద్రబాబు పార్టీ నేతలకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తూనే ఉన్నారు. కానీ మరో మూడేళ్లు కార్యక్రమాలను నిర్వహించడానికి ఆర్థిక భారంగా భావిస్తున్న నేతలు కేంద్ర కార్యాలయానికి తప్పుడు నివేదికలు పంపుతున్నారు.
వారికోసమే….
చంద్రబాబు అధికారంలోకి రావడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. గత రెండున్నరేళ్లుగా పార్టీ స్తబ్దుగా ఉండిపోయింది. కరోనా కారణం ఒకటయితే, వైసీపీ ప్రభుత్వం టీడీపీ నేతలపై అక్రమ కేసులు బనాయించడం కూడా ఒక కారణం. అందుకే చంద్రబాబు ఇష్టం లేకున్నా నేతలపై ఆర్థిక భారం మోయలేక పరిషత్ ఎన్నికలను సయితం బహిష్కరించారు. పంచాయతీ ఎన్నికలను కూడా సీరియస్ గా తీసుకోలేదు. అనేక మంది నేతలు తాము ఇప్పటికే నష్టపోయామని, కోలుకోవడానికి కొంత సమయం కావాలని కోరడంతో ఎన్నికలను చంద్రబాబు బహిష్కరించారని పార్టీ వర్గాలు కూడా అంగీకరిస్తున్నాయి.
నిత్యం ప్రజల్లో ఉండేలా…
అయితే ఎంతకాలం ఇలా జనంలోకి రాకుండా నేతలు ఉండిపోతారన్నది ప్రశ్నగానే మిగిలింది. ఇక ఎన్నికలకు మూడేళ్లు మాత్రమే సమయం ఉండటంతో ప్రజల్లోనే నిత్యం ఉండాలని చంద్రబాబు ఆదేశిస్తున్నారు. ఎప్పటికప్పుడు కార్యక్రమాలతో నేతలను, క్యాడర్ లో ఉత్తేజం నింపేందుకు ప్రయత్నిస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో ఒక సంప్రదాయం ఉంది. పార్టీ కార్యక్రమాలను ఎప్పటికప్పుడు ఆ నియోజకవర్గం నేతలు ఫొటోలు, వీడియోలు కేంద్ర కార్యాలయానికి పంపాల్సి ఉంటుంది. నేతల ప్రసంగాలు, హాజరైన క్యాడర్ తో సహా వివరంగా పంపాలి.
ఫొటోలతో బిల్డప్….
కానీ అనేక నియోజకవర్గాల్లో నేతలు కేవలం పదిమందితోనే కార్యక్రమాలను ముగించివేస్తున్నట్లు చంద్రబాబు గుర్తించారు. ఇటీవల టీడీపీ దశలవారీగా చేసిన రైతు కోసం కార్యక్రమంలో కూడా నియోజకవర్గానికి పది మంది నేతలు మినహా ఎవరూ పాల్గొనలేదని తెలిసింది. దీనిపై చంద్రబాబు సీరియస్ అయినట్లు తెలిసింది. దాదాపు 80 నుంచి 90 నియోజకవర్గాలలో ఇదే పరిస్థితి. పది మందితో ఫొటోలు దిగి పంపించడాన్ని చంద్రబాబు తప్పుపట్టినట్లు తెలిసింది. ఇకపై పూర్తి స్థాయి వీడియోలు, ఫొటోలను పంపాలని అన్ని నియోజకవర్గ ఇన్ ఛార్జులకు చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.