Chandrababu : ఖాళీ అవుతున్న పార్టీ ఖజానా… క్యా కరూ?
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు ముందుంది గడ్డుకాలమే. ఆయన ఇటు పార్టీని బలోపేతం చేయాలి. మరోవైపు ఎన్నికల ఖర్చు కోసం నిధులను సమీకరించాలి. కానీ అధికారంలో లేని [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు ముందుంది గడ్డుకాలమే. ఆయన ఇటు పార్టీని బలోపేతం చేయాలి. మరోవైపు ఎన్నికల ఖర్చు కోసం నిధులను సమీకరించాలి. కానీ అధికారంలో లేని [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు ముందుంది గడ్డుకాలమే. ఆయన ఇటు పార్టీని బలోపేతం చేయాలి. మరోవైపు ఎన్నికల ఖర్చు కోసం నిధులను సమీకరించాలి. కానీ అధికారంలో లేని టీడీపీకి విరాళాలు ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. గత రెండేళ్లుగా నిధుల సమస్యతో తెలుగుదేశం పార్టీ సతమతమవుతుంది. అందుకే తెలంగాణలో పార్టీ కార్యక్రమాలను చంద్రబాబు తగ్గించాల్సి వచ్చిందంటున్నారు.
అనుకూల పారిశ్రామిక వేత్తలు…
తెలుగుదేశం పార్టీకి భారీగా విరాళాలు వస్తాయి. 2004, 2009లో అధికారం కోల్పోయినప్పుడు కూడా టీడీపీకి భారీగానే విరాళాలందాయి. వీటిని చంద్రబాబు మీకోసం పాదయాత్ర తో పాటు ఎన్నికల ఖర్చుకు వినియోగించారు. ప్రధానంగా ఒక సామాజికవర్గానికి చెందిన పారిశ్రామికవేత్తలు, సినిమా పరిశ్రమ నుంచి టీడీపీకి భారీగా విరాళాలు అందుతుంటాయి. చంద్రబాబు చేత సాయం పొందిన వాళ్లు ఈ విరాళాలు ఇస్తుంటారు.
రెండేళ్లుగా…
కానీ గత రెండేళ్లుగా టీడీపీ ఖజానా బోసిపోయింది. ఎవరూ విరాళాలిచ్చేందుకు ముందుకు రావడం లేదు. దీనికి ప్రధాన కారణం కరోనా వైరస్ అని చెప్పాలి. గత ఏడాదిన్నరగా కరోనాతో వ్యాపారాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. రాష్ట్ర విభజన తర్వాత అమరావతిలో భూముల అమ్మకాలు నిలిచిపోయాయి. దీంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా దెబ్బతినింది. ఈ కారణాలతో టీడీపీ అనుకూల పారిశ్రామికవేత్తలు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు విరాళాలు ఇచ్చేందుకు ముందుకు రావడం లేదు. చంద్రబాబు కూడా తన టూర్లను తగ్గించుకోవాల్సి వచ్చింది. పార్టీ నేతలు కూడా ఆర్థికంగా దెబ్బతినడంతో ఖర్చు చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు.
ఆర్థిక మూలాలను….
మరోవైపు వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టీడీపీకి అనుకూలంగా ఉన్న వారి వ్యాపారాలు బాగా దెబ్బతిన్నాయి. చిత్ర పరిశ్రమ నుంచి కూడా పెద్దలు మొహం చాటేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం టీడీపీ అనుకూల పారిశ్రామికవేత్తల ఆర్థిక మూలాలను దెబ్బతీయడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. మరో మూడేళ్లలో ఎన్నికలున్నాయి. అప్పటి వరకూ కూడా విరాళాలు టీడీపీకి వచ్చేది అనుమానమేనంటున్నారు. దీంతో చంద్రబాబును నిధుల సమస్య తీవ్రంగా వేధిస్తుంది.