Tdp : “మళ్లీ నువ్వే రావాలి”… స్లోగన్ మార్చిన బాబు
రానున్న ఎన్నికలు చంద్రబాబుకు చాలా పరీక్షలు పెట్టబోతున్నాయి. అసలు జనం చంద్రబాబును నమ్ముతారా? లేదా? అన్నదే ప్రశ్న. దాదాపు 14 ఏళ్లకు పైగానే ముఖ్యమంత్రిగా చేసిన అనుభవం [more]
రానున్న ఎన్నికలు చంద్రబాబుకు చాలా పరీక్షలు పెట్టబోతున్నాయి. అసలు జనం చంద్రబాబును నమ్ముతారా? లేదా? అన్నదే ప్రశ్న. దాదాపు 14 ఏళ్లకు పైగానే ముఖ్యమంత్రిగా చేసిన అనుభవం [more]
రానున్న ఎన్నికలు చంద్రబాబుకు చాలా పరీక్షలు పెట్టబోతున్నాయి. అసలు జనం చంద్రబాబును నమ్ముతారా? లేదా? అన్నదే ప్రశ్న. దాదాపు 14 ఏళ్లకు పైగానే ముఖ్యమంత్రిగా చేసిన అనుభవం ఉన్న చంద్రబాబును ఇప్పటి వరకూ అనుకూల మీడియా ఆయన లేకుంటే రాష్ట్రం లేనట్లు చిత్రీకరించింది. చంద్రబాబు వేసే ప్రతి అడుగును సమర్థించింది. అయినా 2019 ఎన్నికల్లో జగన్ అధికారంలోకి రాకుండా బాబు అనుకూల ప్రధాన మీడియా అడ్డుకోలేకపోయింది. దీనికి కారణం సోషల్ మీడియానే.
సోషల్ మీడియాలో….
ఇప్పుడు టీడీపీ నాయకత్వం సోషల్ మీడియాపై దృష్టి పెట్టింది. 2014 ఎన్నికల్లో బాబు వస్తే జాబు గ్యారంటీ అంటూ సోషల్ మీడియాలో వచ్చిన స్లోగన్ సత్ఫలితాలనిచ్చింది. మోదీ, పవన్ కలిస్తేనే గెలిచారన్న విశ్లేషణలు ఉన్నప్పటికీ ఆ ఎన్నికల్లో మాత్రం చంద్రబాబు సమర్థతను నమ్మే జనం ఓట్లు వేశారు. అయితే ఐదేళ్ల కాలంలో చంద్రబాబు ఇచ్చిన మాటలను నిలబెట్టుకోలేకపోయారు. అలాగే అమరావతిని కూడా అనుకున్న టైంలో అభివృద్ధి చేయలేకపోయారు.
స్లోగన్ మార్చి….
దీంతో ఈసారి చంద్రబాబు స్లోగన్ మార్చారు. “మళ్లీ నువ్వే రావాలి” అనే నినాదంతో సోషల్ మీడయాలో ఇప్పటికే టీడీపీ విస్తృతంగా ప్రచారం ప్రారంభించింది. జగన్ వచ్చిన తర్వాత అన్ని వ్యవస్థలను నాశనం చేశారని ప్రధానంగా యువతలోకి తీసుకెళ్లే ప్రయత్నాలను తెలుగుదేశం పార్టీ ప్రారంభించింది. సోషల్ మీడియా టీడీపీ వింగ్ నుకూడా చంద్రబాబు ఇటీవల కాలంలో బలోపేతం చేశారు. ఓటమి తర్వాత కొంత కాలం పట్టించుకోని చంద్రబాబు తిరిగి సోషల్ మీడియా వింగ్ తో ఇటీవల సమావేశం నిర్వహించారు.
ప్రభుత్వ వైఫల్యాలపై…..
రేషన్ కార్డుల సంఖ్యను తగ్గించడం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్ ల ద్వారా ఇచ్చే రుణాలను నిలిపివేసి, ఆ నిధులను వేరే పథకాలకు మళ్లిస్తున్నారని, లక్షల కోట్లు అప్పులు చేస్తూ ప్రజలపై పన్నుల భారం మోపుతున్నారని టీడీపీ ప్రజల ముందు ఉంచుతుంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బాటలో పయనించాలంటే చంద్రబాబు తప్ప మరో మార్గం లేదని టీడీపీ సోషల్ మీడియా వింగ్ వివిధ స్లోగన్ లతో యువతను, ఉద్యోగులను, మధ్య తరగతి ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం ఎంతవరకూ సఫలమవుతుందో చూడాలి.