Chandrababu : స్కీమ్స్.. అండ్ స్డడీ.. విన్స్ ద రేస్
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారు. ఏ మార్గాన్ని వదిలిపెట్టడం లేదు. అధికారంలోకి వచ్చిన కొన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారు. ఏ మార్గాన్ని వదిలిపెట్టడం లేదు. అధికారంలోకి వచ్చిన కొన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారు. ఏ మార్గాన్ని వదిలిపెట్టడం లేదు. అధికారంలోకి వచ్చిన కొన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల్లో ఏం చేశారన్న దానిపై చంద్రబాబు అథ్యయనం చేయాలని నిర్ణయించారు. ప్రధానంగా ఢిల్లీ, పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో అక్కడి ప్రాంతీయ పార్టీలు ఇచ్చిన వాగ్దానాలు, హామీలు, అధికారంలో ఉండి వారు అమలు చేసిన సక్సెస్ అయిన స్కీంలపై అధ్యయనం చేయనున్నారు.
ఇతర రాష్ట్రాల్లో….
అన్ని రాష్ట్రాల్లో సక్సెస్ అయిన స్కీమ్ లతో పాటు ప్రజలను ఆకట్టుకునే హామీలను కూడా చంద్రబాబు వచ్చే ఎన్నికల మ్యానిఫేస్టోలో పెట్టాలని నిర్ణయించారు. ప్రధానంగా తమిళనాడులో డీఎంకే ఏకపక్ష విజయం సాధించింది. పదేళ్లు అధికారానికి దూరంగా ఉన్న స్టాలిన్ పార్టీని సమర్థవంతంగా నడిపి ఎన్నికల్లో దాదాపు 250 హామీలు ఇచ్చారు. వాటిని అధ్యయనం చేయడానికి పార్టీ తరుపున బృందాన్ని చెన్నైకి పంపాలని చంద్రబాబు నిర్ణయించారు.
స్కీమ్ లపై అధ్యయనానికి…
ఇక ఢిల్లీలో కూడా అరవింద్ కేజ్రీవాల్ అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఆయన పథకాలే విజయాన్ని మూడోసారి దక్కేలా చేశాయి. కేజ్రీవాల్ అమలు చేసిన స్కీంలపై కూడా చంద్రబాబు నివేదిక తెప్పించుకుంటున్నారు. అయితే అక్కడ ఎక్కువమంది అక్షరాస్యులు ఉండటాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఇక పశ్చిమ బెంగాల్ లో మమత బెనర్జీ కూడా మూడోసారి ముఖ్యమంత్రి అయ్యారు. అయితే ఆమె స్కీమ్ లకన్నా సెంటిమెంట్ తోనే గెలవడం పై కూడా టీడీపీలో పెద్దయెత్తున చర్చ జరుగుతుంది.
దళితబంధులాంటిదే…
తెలంగాణలో కేసీఆర్ ఇటీవల ప్రకటించిన దళితబంధు పథకంపై కూడా చంద్రబాబు అధ్యయనం చేయడానికి సిద్ధమయ్యారు. దళిత ఓట్లు ఎక్కువగా జగన్ వైపు ఉండటంతో వారిని ఆకట్టుకోవాలంటే ఈ పథకాన్ని వేరే రూపంలో ప్రవేశపెడితే ఎలా ఉంటుంది? సాధ్యాసాధ్యాలపై చంద్రబాబు స్డడీ చేస్తున్నారు. దళితబంధు అని నేరుగా కాకపోయినా అదే రూపంలో మరో పథకం వచ్చే అవకాశం ఉంది. చంద్రబాబు ప్రస్తుతం పథకాలను స్టడీ చేసే పనిలో ఉన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.