Chandrababu : ఆయన సైన్యమే ఒక ఆయుధం
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు ఒక విషయంలో మాత్రం దిగులు లేదు. ఆ పార్టీ క్యాడర్ బలాన్ని ఆయన నమ్ముకున్నారు. తెలుగుదేశం పార్టీకి తొలి నుంచి కార్యకర్తల [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు ఒక విషయంలో మాత్రం దిగులు లేదు. ఆ పార్టీ క్యాడర్ బలాన్ని ఆయన నమ్ముకున్నారు. తెలుగుదేశం పార్టీకి తొలి నుంచి కార్యకర్తల [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు ఒక విషయంలో మాత్రం దిగులు లేదు. ఆ పార్టీ క్యాడర్ బలాన్ని ఆయన నమ్ముకున్నారు. తెలుగుదేశం పార్టీకి తొలి నుంచి కార్యకర్తల బలం ఎక్కువ. ప్రతి గ్రామంలోనూ పటిష్టమైన కార్యకర్తలు ఆ పార్టీకి ఉన్నారు. ఏపీలో ఉన్న మిగిలిన పార్టీలతో పోలిస్తే తెలుగుదేశం పార్టీకే కరడు కట్టిన కార్యకర్తల అండదండలు ఉన్నాయి. విపక్షంలో ఉన్నా వారు తమ పని తామ చేస్తుంటారు. పార్టీ అంటే అంత పిచ్చి అభిమానం.
పటిష్టమైన క్యాడర్….
మిగిలిన పార్టీలకు లేనిది, తెలుగుదేశం పార్టీకి ఉన్నది ఒక్కటే. చంద్రబాబుకు తెలియకుండా పార్టీ కోసం పదిలక్షలు అవలీలగా ఖర్చు చేయగలిగిన కార్యకర్తలు దాదాపు ప్రతి జిల్లాలో ఉన్నారు. ఇప్పుడు చంద్రబాబు నమ్మకం కూడా అదే. నేతలు కొంత ఆర్థికంగా పార్టీ కార్యక్రమాల కోసం ఖర్చు చేయకపోయినా అనేక మంది కార్యకర్తలు తమ జేబులకు చిల్లులు పెట్టుకుంటున్నారు. ఇటీవల చంద్రబాబు జరిపిన సమీక్షలో అనేక చోట్ల ముఖ్య కార్యకర్తలే పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు గుర్తించారు.
అధికారంలో ఉన్నప్పుడు….
నిజానికి చంద్రబాబు కార్యకర్తలకు చేసిందేమీ లేదు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు వారిని పట్టించుకోరు. కేవలం విపక్షంలో ఉన్నప్పుడే కార్యకర్తలు గుర్తుకు వస్తారు. అధికారంలో ఉండగా వారికి ఎలాంటి పదవులు ఇవ్వలేదు. కాకపోతే గ్రామాల్లో ఉపాధి హామీ పథకం కింద మంజూరైన పనులను మాత్రం కార్యకర్తలకు ఇచ్చారు. కోర్టు తీర్పుతో ఇప్పుడిప్పుడే ఆ బిల్లులు కూడా ప్రభుత్వం చెల్లించే పరిస్థితికి వచ్చింది.
రేపటి ఆశకూడా….
గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలిస్తే తాము గెలిచినట్లేనని భావించి అనేక మంది కార్యకర్తలు డబ్బులు ఖర్చు చేసుకున్నారు. కానీ అధికారంలోకి రాలేదు. అయినా ఆ పార్టీ క్యాడర్ మాత్రం చంద్రబాబుకు ఆస్తి అనే చెప్పాలి. గత రెండున్నరేళ్లుగా పార్టీ తరుపున జరుగుతున్న కార్యక్రమాలన్నీ దాదాపు ముఖ్య కార్యకర్తలు చేస్తున్నవే. అందుకే చంద్రబాబు ఈసారి అధికారంలోకి వస్తే కార్యకర్తలను నెత్తిన పెట్టుకుంటానని ప్రతి సమావేశంలో చెబుతున్నారు. ఎన్టీఆర్ సంపాదించిన క్యాడర్ ఇంకా కొనసాగుతుండటం చంద్రబాబు అదృష్టంగానే చెప్పుకోవాలి.