Chandrababu : నాలుగు రోజులు ఇక్కడే… నా సామిరంగా?
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబులో కుప్పం కలవరం మొదలయింది. కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల్లో ఎలాగైనా పైచేయి సాధించాలన్నది ఆయన ఉద్దేశ్యంగా కనిపిస్తుంది. కుప్పం నియోజకవర్గంలో వరసగా జరుగుతున్న [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబులో కుప్పం కలవరం మొదలయింది. కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల్లో ఎలాగైనా పైచేయి సాధించాలన్నది ఆయన ఉద్దేశ్యంగా కనిపిస్తుంది. కుప్పం నియోజకవర్గంలో వరసగా జరుగుతున్న [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబులో కుప్పం కలవరం మొదలయింది. కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల్లో ఎలాగైనా పైచేయి సాధించాలన్నది ఆయన ఉద్దేశ్యంగా కనిపిస్తుంది. కుప్పం నియోజకవర్గంలో వరసగా జరుగుతున్న ఎన్నికల్లో ఓటమి చెందుతుండటంతో చంద్రబాబులో ఆందోళన మొదలయింది. కంచుకోటగా ఉన్న కుప్పం గురించి మూడు దశబ్దాలుగా అసలు ఆలోచించలేదు. అధికారంలో ఉన్నా లేకున్నా కుప్పం తన మాటే వింటుందన్న నమ్మకమే ఆయనను నడిపించింది.
ఏ ఎన్నిక జరిగినా…?
చంద్రబాబుకు ఉన్న నమ్మకం వృధా కాలేదు. కుప్పం ప్రజలు చంద్రబాబు ను వదులుకోదలచుకోలేదు. ఏ ఎన్నికలు జరిగినా చంద్రబాబు చెప్పినా, చెప్పకపోయినా సైకిల్ గుర్తుపైనే జనం ఓట్లేస్తూ వచ్చారు. ఇక్కడ విపక్షాలు కూడా వీక్ కావడంతో చంద్రబాబు పెద్దగా పట్టించుకోలేదు. అయితే గత ఎన్నికల నుంచి కుప్పంలో ట్రెండ్ మారుతూ కన్పిస్తోంది. వైసీపీ కుప్పం నియోజకవర్గాన్ని టార్గెట్ చేస్తూ పని మొదలు పెట్టడంతో చంద్రబాబుకు కుప్పానికి పరుగెత్తాల్సిన పరిస్థితి.
నాలుగు రోజుల పర్యటన….
ఈనెల 26వ తేదీ నుంచి 29వ తేదీ వరకూ కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటించనున్నారు. కుప్పం మున్సిపాలిటీకీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో చంద్రబాబు పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన నాలుగు రోజులు కుప్పం నియోజకవర్గంలోనే ఉండనున్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలతో ఆయన సమావేశం కానున్నారు. కుప్పం నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిపై సమీక్షించనున్నారు.
జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావనపై….?
ఇక చంద్రబాబు ముందుగానే నేతలకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. ఎక్కడా జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు కనపడకూడదని ఆయన నేతలకు సూచించినట్లు సమాచారం. గతంలోనూ ఇదే మాదిరి చికాకులు పెట్టారని, వారిని గుర్తించి ముందుగానే తగిన చర్యలు తీసుకోవాలని స్థానిక నేతలకు చంద్రబాబు గట్టిగా చెప్పినట్లు సమాచారం. కేవలం పార్టీ కార్యకర్తలు, నేతలతో సమావేశాలు కావడంతో చంద్రబాబు ఎలాంటి చికాకులు లేకుండా చూడాలని నేతలను కోరినట్లు తెలిసింది.