Chandrababu : సంఘర్షణ ద్వారానే పార్టీ బలపడుతుందా?
ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వాన్ని అస్థిరపర్చాలన్న ప్రయత్నం జరుగుతోంది. రోజూ ఏదో ఒక రచ్చ విపక్షం చేస్తుండటం రాజకీయంగా చర్చనీయాంశమైంది. టీడీపీ బలహీనంగా ఉండటంతో పార్టీని బలోపేతం చేసుకోవడం [more]
ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వాన్ని అస్థిరపర్చాలన్న ప్రయత్నం జరుగుతోంది. రోజూ ఏదో ఒక రచ్చ విపక్షం చేస్తుండటం రాజకీయంగా చర్చనీయాంశమైంది. టీడీపీ బలహీనంగా ఉండటంతో పార్టీని బలోపేతం చేసుకోవడం [more]
ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వాన్ని అస్థిరపర్చాలన్న ప్రయత్నం జరుగుతోంది. రోజూ ఏదో ఒక రచ్చ విపక్షం చేస్తుండటం రాజకీయంగా చర్చనీయాంశమైంది. టీడీపీ బలహీనంగా ఉండటంతో పార్టీని బలోపేతం చేసుకోవడం కోసం నిత్యం ఏదో ఒక రగడ సృష్టిస్తున్నారు. అసలే ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న ప్రభుత్వాన్ని మరింత ఇరకాటంలోకి నెట్టాలన్నది విపక్ష టీడీపీ ఆలోచనగా ఉంది. అందుకే రెచ్చగొట్టే వ్యాఖ్యలను చేస్తూ శాంతిభద్రతల సమస్య తలెత్తే పరిస్థితికి తెచ్చేందుకు శతవిధాలా టీడీపీ ప్రయత్నిస్తుంది.
ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనే….
తెలుగుదేశం పార్టీని తప్పు పట్టడం కాదు కాని గత రెండున్నరేళ్లుగా ఏదో ఒకరూపంలో జగన్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనే చూస్తుంది. అది రాజకీయమే అయినా శాంతి భద్రతల సమస్యను సృష్టించి ప్రభుత్వంపై విఫల ముద్ర వేయాలని చూస్తుంది. ఇందులో ఒకరకంగా చంద్రబాబు సక్సెస్ అయ్యారనే అనుకోవాలి. ముందుగా పార్టీ నేతలు క్షేత్రస్థాయిలో నిర్వేదంలో ఉండటం, వరస ఎన్నికల్లో ఓటములు చంద్రబాబు ఫ్రస్టేషన్ కు గల కారణాలుగా చెప్పుకోవాలి.
తాడేపల్లికి.. తాలిబన్లకు….
డ్రగ్స్ వ్యవహారంలో తాడేపల్లికి తాలిబన్లకు లింకు పెట్టారు. పోలీసులే డ్రగ్స్ సరఫరా చేస్తున్నారన్నారు. ఇలా ఆరోపణలు చేసి రెచ్చగొట్టి వైసీపీయే చేజేతులా శాంతిభద్రతల సమస్యను కొని తెచ్చుకున్నట్లు చేయగలిగారు. ఇలా అన్ని విధాలుగా పార్టీని బలోపేతం చేసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. విపక్షంలో ఉండి విమర్శలు చేయడం సహజం. సంఘర్షణ ద్వారానే లబ్ది పొందాలనుకోవడం వల్లనే రాష్ట్రంలో ఈ పరిస్థితికి కారణమయ్యాయి.
రానున్న కాలంలో….
చంద్రబాబులో అసహనం కట్టలు తెంచుకుని ముందు ముందు మరింత బయటపడే అవకాశముంది. అయితే వైసీపీ నేతలు జాగ్రత్తగా వ్యవహరించకపోతే పార్టీకి నష్టం జరుగుతుంది. తాను అధికారంలో ఉండగా రాష్ట్ర ప్రతిష్టను జగన్ దెబ్బతీస్తున్నారని ఆరోపించిన చంద్రబాబు ఇప్పుడు అదే పరిస్థితికి కారణమవుతున్నారు. మొత్తం మీద టీడీపీ నేతల్లో అసహనం రానున్న కాలంలో మరింత బయటపడి రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యకు దారితీసే అవకాశాలున్నాయి.