Chandrababu : బాబు వద్ద ఆన్సర్ ఏదీ?
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ, టీడీపీ ల మధ్య ఘర్షణ వాతావరణం 2019 ఎన్నికల ఫలితాల తర్వాత నుంచే మరింత ఎక్కువయింది. అప్పటి నుంచే తమ కార్యకర్తలపై దాడులు [more]
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ, టీడీపీ ల మధ్య ఘర్షణ వాతావరణం 2019 ఎన్నికల ఫలితాల తర్వాత నుంచే మరింత ఎక్కువయింది. అప్పటి నుంచే తమ కార్యకర్తలపై దాడులు [more]
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ, టీడీపీ ల మధ్య ఘర్షణ వాతావరణం 2019 ఎన్నికల ఫలితాల తర్వాత నుంచే మరింత ఎక్కువయింది. అప్పటి నుంచే తమ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారంటూ చంద్రబాబు అనేకసార్లు దీక్షకు కూడా దిగారు. గుంటూరు జిల్లాలో తమ పార్టీ కార్యకర్తలపై పోలీసులు అక్రమ కేసులు బనాయించారని, ఊరి నుంచి తరిమేశారని గుంటూరు పునరావాస కేంద్రాన్ని కూడా చంద్రబాబు ఏర్పాటు చేశారు.
వైసీపీని ఓడించమని ….
అలాంటి ఘర్షణ వాతావరణం ఉన్న సమయంలో బద్వేలు ఉప ఎన్నిక నుంచి పక్కకు తప్పుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పోటీ నుంచి తప్పుకున్నాక చంద్రబాబు బద్వేలులో వైసీపీని ఓడించమని పార్టీ శ్రేణులకు ఎందుకు పిలుపునివ్వలేదు? తన ప్రత్యర్థి పార్టీని ఓడించమని పిలువు ఇవ్వాలంటే తాను పోటీ చేయాల్సి ఉంటుంది. ఆ పని చంద్రబాబు చేయలేదు. సంప్రదయాన్ని అనుసరించి పక్కకు తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.
రాష్ట్రపతి పాలన కోసం…
దీంతో పార్టీ క్యాడర్ లో కూడా నిరాశ అలుముకుంది. తొలి నుంచి చంద్రబాబు జగన్ ను ముఖ్యమంత్రిగా గుర్తించడం లేదు. అలాగే చంద్రబాబును జగన్ కూడా ప్రతిపక్ష నేతగా గుర్తించలేదు. ఈ సమయంలో బద్వేలు ఉప ఎన్నిక బరిలో ఉంటే కొంత ప్రయోజనకరంగా ఉండేది. ఇప్పుడు రాష్ట్రపతి పాలన కోసం చంద్రబాబు డిమాండ్ చేస్తున్నారు. ఆర్టికల్ 356ను తొలి నుంచి తెలుగుదేశం ప్రభుత్వం వ్యతిరేకించేది. పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ రాష్ట్ర ప్రభుత్వాలను అస్థిరపర్చే ఈ ఆర్టికల్ ను రద్దు చేయాలని డిమాండ్ చేసేవారు.
బీజేపీ పాలనను ఆశిస్తున్నారా?
చంద్రబాబు అధికారంలో ఉండగా తిరుపతిలో అమిత్ షా కాన్వాయ్ పై రాళ్ల దాడి జరిగింది. మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చంద్రబాబు ధర్మపోరాట దీక్షలు చేశారు. ఇప్పుడు చంద్రబాబు రాష్ట్ర పతి పాలన కావాలని కోరుతున్నారు. అంటే అమిత్ షా చేతికి పాలన రావాలని కోరుకుంటున్నారా? అన్న ప్రశ్న తలెత్తుతుంది. అంటే గవర్నర్ పాలన అంటే బీజేపీ పాలనలోకి వెళ్లినట్లే. చంద్రబాబు పరోక్షంగా బీజేపీ పాలన కోరుకుంటున్నారా? దీనికి చంద్రబాబు వద్ద ఆన్సర్ లేదు. బీజేపీకి దగ్గరయ్యేందుకు చేసే ప్రయత్నాలే రాష్ట్ర పతి పాలన డిమాండ్ అన్న కామెంట్స్ వినపడుతున్నాయి.