Ke Krishnamurthy : కేఈకి షాక్ మామూలుగా ఇవ్వలేదుగా?
కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తెలుగుదేశం పార్టీకి వరసగా 2014, 2019 ఎన్నికల్లో కర్నూలు జిల్లా షాకిచ్చింది. గత ఎన్నికలలో వైసీపీ [more]
కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తెలుగుదేశం పార్టీకి వరసగా 2014, 2019 ఎన్నికల్లో కర్నూలు జిల్లా షాకిచ్చింది. గత ఎన్నికలలో వైసీపీ [more]
కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తెలుగుదేశం పార్టీకి వరసగా 2014, 2019 ఎన్నికల్లో కర్నూలు జిల్లా షాకిచ్చింది. గత ఎన్నికలలో వైసీపీ ఇక్కడ క్లీన్ స్వీప్ చేసింది. దీంతో చంద్రబాబు నష్ట నివారణ చర్యలు చేపట్టినట్లు తెలిసింది. ఇందులో భాగంగానే తెలుగుదేశం పార్టీ డోన్ ఇన్ ఛార్జిగా మన్నె సుబ్బారెడ్డిని నియమించి కేఈ కృష్ణమూర్తి కుటుంబానికి చంద్రబాబు షాక్ ఇచ్చారు.
ఇక్కడ బలమైన వర్గం…..
డోన్ నియోజకవర్గంలో కేఈ కృష్ణమూర్తికి బలమైన వర్గముంది. అలాగే కోట్ల వర్గానికికి కూడా ఇక్కడ వర్గముంది. గత ఎన్నికలలో కోట్ల, కేఈ వర్గాలు కలిసినా ఇక్కడ మాత్రం టీడీపీకి విజయం దక్కలేదు. వరసగా రెండుసార్లు ఇక్కడి నుంచి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి గెలుస్తూ వస్తున్నారు. కేఈ కుటుంబం ఇక్కడ ఆరుసార్లు గెలిచింది. అలాగే కోట్ల విజయభాస్కర్ రెడ్డి నుంచి సుజాతమ్మ వరకూ ఇక్కడ ప్రాతినిధ్యం వహించారకు.
ప్రభాకర్ ను నియమించినా….
వరసగా రెండు ఎన్నికల నుంచి కేఈ కృష్ణమూర్తి సోదరుడు కేఈ ప్రతాప్ పోటీ చేసి ఓటమి పాలవుతున్నారు. ఈసారి మార్చాలని ఇటీవలే కేఈ ప్రభాకర్ కు ఈ నియోజకవర్గం బాధ్యతలను అప్పగించారు. కేఈ ప్రభాకర్ మాత్రం ఆలూరు నియోజకవర్గంపై దృష్టిపెట్టారు. దీంతో కోట్ల సుజాతమ్మను డోన్ కు పంపించాలని చంద్రబాబు భావించారు. దీనిపై రెండు కుటుంబాలతో కూడా చర్చలు జరిపినట్లు తెలిసింది.
ఇద్దరినీ కాదని….
అయితే ఇద్దరికీ కాదని చంద్రబాబు డోన్ నియోజకవర్గ ఇన్ చార్జిగా మన్నె సుబ్బారెడ్డిని నియమించడం చర్చనీయాంశమైంది. డోన్ లో కేఈ, కోట్ల వర్గాలు బలంగా ఉన్న ప్పటికీ మధ్యే మార్గంగా చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారా? అన్న చర్చ జరుగుతోంది. ఇద్దరూ కలిస్తే ఇక్కడ టీడీపీని గెలిపించవచ్చన్న కారణంగా డోన్ నుంచి కేఈ కుటుంబాన్ని తప్పించినట్లు తెలిసింది. మరి కేఈ కుటుంబం రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.