Chandrababu : ఇక వెనకడుగు వేయరట
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియదు. ఓటమి తర్వాత ఆయన నిర్ణయాలు పార్టీని మరింత నిస్తేజంలోకి నెట్టేశాయి. అనేక మంది పదవులకు [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియదు. ఓటమి తర్వాత ఆయన నిర్ణయాలు పార్టీని మరింత నిస్తేజంలోకి నెట్టేశాయి. అనేక మంది పదవులకు [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియదు. ఓటమి తర్వాత ఆయన నిర్ణయాలు పార్టీని మరింత నిస్తేజంలోకి నెట్టేశాయి. అనేక మంది పదవులకు దూరమయ్యారు. గెలుపోటములు పక్కన పెట్టి రాజకీయ పార్టీ అన్న తర్వాత పోటీ చేసి తీరాల్సిందే. కానీ చంద్రబాబు మాత్రం తిరుపతి ఉప ఎన్నిక తర్వాత వరసగా ఎన్నికల బహిష్కరణ నినాదాన్ని అందుకున్నారు. ఇది తెలుగుదేశం పార్టీని మరింత నష్టపర్చేదేనని అంటున్నారు.
తిరుపతి ఉప ఎన్నిక తర్వాత…
తిరుపతి ఉప ఎన్నిక తర్వాత చంద్రబాబు పరిషత్ ఎన్నికలను బహిష్కరించారు. ప్రభుత్వ బెదిరింపుల వల్ల తాము పోటీకి దిగడం లేదని ఆయన చేసిన ప్రకటనతో పార్టీ స్థానిక నేతలు డీలా పడ్డారు. ఎన్నికలలో పోటీ చేయాలని అప్పటి వరకూ ఉత్సాహంగా ఉన్న నేతల ఆశలపై చంద్రబాబు నీళ్లు చల్లేశారు. దీనికి కారణం పార్టీ నుంచి నిధులు ఇవ్వలేకపోవడమే. అలాగే బద్వేలు ఉప ఎన్నికను కూడా చంద్రబాబు బహిష్కరించారు.
అన్ని ఎన్నికల్లో….
బద్వేలుకు తొలుత అభ్యర్థిని ప్రకటించి ఆ తర్వాత వెనక్కు తగ్గారు. సెంటిమెంట్ ను గౌరవించి తాము పోటీ నుంచి తప్పుకుంటున్నామని చంద్రబాబు చెప్పినా అందుకు నమ్మేవారు ఎవరూ లేరిక్కడ. ఇక్కడ కూడా నిధులు అనవసరంగా ఖర్చు చేయడం ఎందుకన్న ఆలోచనతోనే చంద్రబాబు వెనక్కు తగ్గారు. త్వరలో శ్రీకాకుళం, రాజమండ్రి, నెల్లూరు కార్పొరేషన్ లకు ఎన్నికలకు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న దానిపై చర్చ జరుగుతుంది.
బలంగా ఉండటంతో…
అయితే ఈ మూడు చోట్ల తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది. ఇప్పటికే అన్ని కార్పొరేషన్లను, మున్సిపాలిటీలను వైసీపీ కైవసం చేసుకుంది. పరిషత్ ఎన్నికల్లో పోటీ చేయకపోవడంతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వైసీపీ పట్టు పెంచుకుంటున్న తరుణంలో చంద్రబాబు ఇక్కడ పోటీ చేస్తారా? చెయ్యరా? అన్నది కూడా సస్పెన్స్ గానే ఉంది. అయితే పార్టీ వర్గాల సమాచారం ప్రకారం మూడు చోట్ల టీడీపీ బరిలోకి దిగుతుందని, సిద్ధంగా ఉండాలని స్థానిక నేతలకు సమాచారం అందినట్లు తెలిసింది.