Chandrababu : టర్నయిన ఓటు బ్యాంకు తిరిగి వస్తుందా?
అరవై వేలు ఓట్లు దొంగవి అని ఒకరంటే… అరవై శాతం దొంగ ఓట్లు పోలయ్యాయని మరొకరు అంటారు. ఎన్నికల తర్వాత ఇలాంటి విమర్శలు అసలు పట్టించుకోవాల్సిన అవసరం [more]
అరవై వేలు ఓట్లు దొంగవి అని ఒకరంటే… అరవై శాతం దొంగ ఓట్లు పోలయ్యాయని మరొకరు అంటారు. ఎన్నికల తర్వాత ఇలాంటి విమర్శలు అసలు పట్టించుకోవాల్సిన అవసరం [more]
అరవై వేలు ఓట్లు దొంగవి అని ఒకరంటే… అరవై శాతం దొంగ ఓట్లు పోలయ్యాయని మరొకరు అంటారు. ఎన్నికల తర్వాత ఇలాంటి విమర్శలు అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. బద్వేలు ఉప ఎన్నికలో విపక్షాలు సాధించిందేమిటి? బీజేపీ, కాంగ్రెస్ లకు డిపాజిట్లు కూడా గల్లంతయ్యాయి. ఈ ఎన్నిక ఏకగ్రీవం చేసినట్లయితే హుందాగా ఉండేది. లేదంటే పోరులో తలపడి ఉంటే బాగుండేది. కానీ ఇంత భారీ మెజారిటీని విపక్షాలే తెచ్చిపెట్టాయంటున్నారు. టీడీపీకి ఈ ఎన్నిక భవిష్యత్ లో తలనొప్పిగా మారనుంది.
బరి నుంచి తప్పుకుని….
బద్వేలు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సొంత జిల్లా అయిన కడపలో ఉంది. ఆ సంగతి తెలుసు. ఇక్కడ ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీకి కూడా చెత్త రికార్డే ఉంది. అయినా వైసీపీని నిలువరించేది కొద్దోగొప్పో టీడీపీనే. ఆ పార్టీ ముందుగానే చేతులెత్తేసింది. ముందుగా అభ్యర్థిని ప్రకటించినా జనసేన నిర్ణయంతో పునరాలోచించుకుని తాను కూడా బరి నుంచి తప్పుకున్నట్లు ప్రకటించింది. ఇప్పుడు బీజేపీకి పడిన ఓట్లు చూసి టీడీపీ నేతలు కంగు తింటున్నారు.
90 శాతం ఓట్లు…
పూర్తిగా టీడీపీీ ఓట్లలో 90 శాతం వైసీపీకి పోలయ్యాయి. ఎన్నికల ఫలితాలను బట్టి చూస్తే ఇదే అర్థమవుతుంది. టీడీపీకి నిన్న మొన్నటి వరకూ అనుకూలంగా ఉన్న ఓటర్లు కూడా సంక్షేమ పథకాలను చూసి తమ వైపునకు వచ్చారని అధికార వైసీపీ నేతలు చెబుతున్నారు. దాదాపు ముప్పయి నుంచి నలభై వేల టీడీపీ అనుకూల ఓట్లు వైసీపీకి తరలి వెళ్లాయి. టీడీపీకి సంప్రదాయంగా వస్తున్న ఓట్లు కూడా వైసీపీకి మళ్లడంపై ఆ పార్టీలోనే చర్చ జరుగుతుంది.
మళ్లీ దక్కించుకునేందుకు….
పార్టీ అధినేత చంద్రబాబు తప్పుడు నిర్ణయం వల్లనే టీడీపీ ఓట్లు వైసీపీకి మళ్లాయని, పోటీ చేసి ఉంటే గతంలో కంటే మెజారిటీ వైసీపీకి తగ్గి ఉండేదని బద్వేలు టీడీపీ నేతలు చెబుతున్నారు. టీడీపీ నేతలు బీజేపీ అభ్యర్థి తరుపున ఏజెంట్లుగా కూర్చున్నా ఫలితం లేకుండా పోయింది. టీడీపీ అనుకూల ఓటర్లు కూడా బీజేపీ వైపు చూడలేదు. దీంతోనే బీజేపీకి బద్వేలులో 20 వేల ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇక టీడీపీ తాను తీసిన గోతిలో తానే పడినట్లయింది. దీంతో పోయిన ఓటు బ్యాంకును తిరిగి పొందేందుకు బద్వేలులో ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలను ప్రారంభించాలని ఆ పార్టీ నేతలు నిర్ణయించారు.