Chandrababu : అసహనం.. హద్దులను దాటించేస్తుందా?
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు నలభై ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది. అయితే ఆయన ఇటీవల కాలంలో కొంత అసహనానికి గురవుతూ అదుపుతుప్పుతున్నారు. దీపావళి రోజు మీడియా [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు నలభై ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది. అయితే ఆయన ఇటీవల కాలంలో కొంత అసహనానికి గురవుతూ అదుపుతుప్పుతున్నారు. దీపావళి రోజు మీడియా [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు నలభై ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది. అయితే ఆయన ఇటీవల కాలంలో కొంత అసహనానికి గురవుతూ అదుపుతుప్పుతున్నారు. దీపావళి రోజు మీడియా సమావేశంలో ఆయన చేసిన కామెంట్లే ఇందుకు నిదర్శనం. దీపావళి పండుగకు, హిందువుల మనోభావాలకు, స్థానిక సంస్థల ఎన్నికలకు ముడిపెడుతూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
క్రిస్మస్ పై….
ముఖ్యమంత్రి జగన్ హిందూ ద్రోహి అని అందుకే నామినేషన్లను దీపావళి రోజునే ఉంచేలా ఎన్నికల కమిషన్ కు సూచనలు చేశారని చంద్రబాబు ఆరోపించారు. ఇంతవరకూ బాగానే ఉన్నా, అదే క్రిస్మస్ పండగకు ఇలాంటి ధైర్యం చేస్తారా? అని చంద్రబాబు ప్రశ్నించడం చర్చనీయాంశమైంది. అంటే క్రిస్టియన్లకు మాత్రమే జగన్ అండగా ఉంటున్నారని, హిందువులకు అన్యాయం చేస్తున్నారన్నది చంద్రబాబు అభిప్రాయంగా ఉంది.
గతంలోనూ ఇంతే….
గతంలో నూ దళితులపైన చంద్రబాబు ఇలాంటి కామెంట్లు చేసి వివాదంగా మారారు. ఆంధ్రప్రదేశ్ లో దళితులు గంపగుత్తగా వైసీపీకి ఓట్లు వేస్తారన్న దుగ్దతో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేసి ఉండవచ్చు. అయితే దళితుల్లోనూ తెలుగుదేశం పార్టీని అభిమానించే వారున్నారని చంద్రబాబు గుర్తించలేదు. తన పార్టీలో ముఖ్యమైన పదవుల్లోనూ ఆయన దళితులను నియమించారు. అయితే ఆయన చేసిన వ్యాఖ్యలతో రాజకీయంగా ఇబ్బంది అని, దళితులు టీడీపీకి మరింత దూరమవుతారని పార్టీ వర్గాలే అభిప్రాయపడుతున్నాయి.
టెన్షన్ తోనేనా?
చంద్రబాబు పూర్తిగా అసహనంలో ఉన్నట్లు కన్పిస్తుంది. ఈ ప్రభుత్వం దిగిపోవాలని ఆయన బలంగా కోరుకుంటున్నారు. వరసగా ఎన్నికలు పెడుతూ ఇబ్బంది పెడుతున్నారని ఫీల్ అవుతున్నారు. మూడేళ్ల సమయం ఉందన్న విషయాన్ని మర్చి పోతున్నారు. పార్టీని మూడేళ్లు కాపాడుకోవడమెలా? అన్న దానిపై ఆయన పడుతున్న టెన్షన్ తో అదుపు తప్పుతున్నారని భావిస్తున్నారు. లేకుంటే రాజకీయంగా ఒక బలమైన సామాజికవర్గాన్ని విమర్శించే ముందు నలబై ఏళ్ల రాజకీయ అనుభవమున్న నేత ఆలోచించరా? అన్న ప్రశ్న తలెత్తుతుంది.