ఆ విషయం ఎవరూ మాట్లాడొద్దు.. నేతలకు బాబు వార్నింగ్
త్వరలో బద్వేలు ఉప ఎన్నిక జరగనుంది. ఆరు నెలల్లో బద్వేలు నియోజకవర్గం ఉప ఎన్నికను ఎన్నికల కమిషన్ నిర్వహించాల్సి ఉంది. కరోనా కారణంగా మరో నాలుగు నెలలు [more]
త్వరలో బద్వేలు ఉప ఎన్నిక జరగనుంది. ఆరు నెలల్లో బద్వేలు నియోజకవర్గం ఉప ఎన్నికను ఎన్నికల కమిషన్ నిర్వహించాల్సి ఉంది. కరోనా కారణంగా మరో నాలుగు నెలలు [more]
త్వరలో బద్వేలు ఉప ఎన్నిక జరగనుంది. ఆరు నెలల్లో బద్వేలు నియోజకవర్గం ఉప ఎన్నికను ఎన్నికల కమిషన్ నిర్వహించాల్సి ఉంది. కరోనా కారణంగా మరో నాలుగు నెలలు సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు. అయితే బద్వేలు ఉప ఎన్నిక అనివార్యం. కడప జిల్లాలో ఉండటం 2009 నుంచి బద్వేలు నియోజకవర్గం అచ్చి రాకపోవడంతో చంద్రబాబు ఈ ఉప ఎన్నికపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేక పోతున్నారు.
ముందుగానే అభ్యర్థిని…
తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికకు నాలుగు నెలల ముందే అభ్యర్థిని చంద్రబాబు ప్రకటించారు. పనబాక లక్ష్మి తమ అభ్యర్థి అని ఆయన ప్రకటించడంతో పార్టీ శ్రేణుల్లో కూడా ఉత్సాహం ఏర్పడింది. తిరుపతి ఉప ఎన్నికల్లో ఓటమి పాలయినా పరువు పోకుండా ఓట్లు రావడం చంద్రబాబుకు ఊరటనిచ్చే అంశమే. అయితే బద్వేలు నియోజజకవర్గం ఉప ఎన్నికలో అలా జిరిగే అవకాశం లేదని చంద్రబాబు తనకున్న నివేదికల ద్వారా తెలిసినట్లు చెబుతున్నారు.
దారుణ ఓటమి….?
బద్వేలు నియోజకవర్గం ఉప ఎన్నికల్లో తిరుపతి ఉప ఎన్నిక ఫలితమే రిపీట్ అవుతుందని, అక్కడ కనీస ఓట్లను కూడా సాధించే అవకాశం లేదని ఆయన తనకున్న వ్యవస్థల ద్వారా సమాచారం తెప్పించుకున్నారు. దీంతో చంద్రబాబు బద్వేలు నియోజకవర్గం ఉప ఎన్నికల్లో పోటీ చేయాలా? వద్దా? అన్న దానిపై డైలమాలో ఉన్నారు. పోటీ చేయకపోతే భయపడి వెనక్కు తగ్గినట్లు అవుతుందన్న ఆలోచన కూడా లేకపోతేదు.
మాట్లాడవద్దంటూ….?
ఇప్పటికే జడ్పీటీసీ ఎన్నికలను చంద్రబాబు బహిష్కరించారు. బద్వేలు ఉప ఎన్నికను కూడా బహిష్కరిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనను చంద్రబాబు చేస్తున్నట్లు తెలిసింది. అందుకే బద్వేలు ఉప ఎన్నిక గురించి ఎవరూ మాట్లాడవద్దని నేతలకు గట్టి వార్నింగ్ చంద్రబాబు ఇచ్చినట్లు తెలిసింది. ఇటీవల మహానాడులో కూడా ఆ ఉప ఎన్నిక గురించి ప్రస్తావన రాకుండా చంద్రబాబు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారంటున్నారు. మొత్తం మీద తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో ఉన్న ఉత్సాహం బద్వేలు ఉప ఎన్నికలో మాత్రం లేదన్నది స్పష్టంగా తెలుస్తోంది.