అనంత టీడీపీలో కలకలం.. బాబు స్పందించకపోతే.. ప్రమాదమే?
పార్టీ నుంచి నాయకులను బెదిరించో.. ప్రలోభ పెట్టో.. వైసీపీ అధినేత, సీఎం జగన్ తన నేతలను లాగేసుకుంటున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు తాజాగా విమర్శలు చేశారు. అయితే, [more]
పార్టీ నుంచి నాయకులను బెదిరించో.. ప్రలోభ పెట్టో.. వైసీపీ అధినేత, సీఎం జగన్ తన నేతలను లాగేసుకుంటున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు తాజాగా విమర్శలు చేశారు. అయితే, [more]
పార్టీ నుంచి నాయకులను బెదిరించో.. ప్రలోభ పెట్టో.. వైసీపీ అధినేత, సీఎం జగన్ తన నేతలను లాగేసుకుంటున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు తాజాగా విమర్శలు చేశారు. అయితే, అసలు తప్పు ఆయనే వద్దే ఉందంటూ.. తాజా పరిణామాలపై మీడియాతో మాట్లాడిన అనంతపురం టీడీపీలో కీలక నేత ఒకరు వ్యాఖ్యానించారు. అంతేకాదు.. మా పిల్లలు కూడా పక్క చూపులు చూస్తున్నారంటూ.. ఆయన బాంబు పేల్చారు. దీంతో ఒక్కసారిగా అనంతపురం టీడీపీలో ఏం జరుగుతోందనే చర్చ తెరమీదికి వచ్చింది. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో అనంతపురం నుంచి ముగ్గురు కీలక నేతల వారసులు రంగంలోకి దిగారు. వారంతా కూడా ఓడిపోయారు.
అంతర్గత విభేదాలతో….
అయితే, వీరంతా యువకులు కావడం, వ్యాపారాలు కూడా ఉండడంతో వీరికి వైసీపీ వల విసురుతోందనే వాదన కొన్నాళ్లుగా వినిపిస్తోంది. వీరిలో ఒకరు బీజేపీ వైపు చూస్తున్నారనే వాదన కూడా ఉంది. అయితే, మిగిలిన ఇద్దరూ మాత్రం రేపో మాపో.. వైసీపీ వైపు అడుగులు వేయడం ఖాయమనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇదిలావుంటే, అర్బన్ సహా ధర్మవరం నియోజకవర్గంలోనూ టీడీపీ నేతల మధ్య అంతర్గత విభేదాలు కనిపిస్తున్నాయి. దీంతో వీటిని సర్ది చెప్పే విషయంలో చంద్రబాబు మౌనంగా ఉన్నారు. తాము కేసుల్లో చిక్కుకుంటున్నామని, ప్రభుత్వం తమను వేధిస్తోందని తమ తరఫున వాయిస్ వినిపించాలని వారు చంద్రబాబుకు సమాచారం పంపించినా.. ఇప్పటి వరకు స్పందించలేదని అంటున్నారు.
విసిగిపోయిన నేతలు….
దీంతో సదరు నాయకులు విసిగి వేసారి పోతున్నారని స్థానికంగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇలాంటివారు పార్టీలో ఉండి మేం సాధించేది ఏంటి ? మరో నాలుగేళ్లు ఈ బాధలు పడడం ఎందుకు? ఆయన హైదరాబాద్‌లో కూర్చుంటాడు. మేం ఇక్కడ బాధలు పడుతున్నాం. ఆయన సమస్యలే తప్ప మేం ఆయనకు కనిపించడం లేదు. ఆయనకు మా బాధలు పట్టడం లేదు. ఏం చేస్తాం.. మా ఖర్మ.- అంటూ అనంతపురానికి చెందిన సీనియర్ నాయకుడు చేసిన వ్యాఖ్యలు జిల్లా టీడీపీలో ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి.
బలమైన ఫ్యామిలీ సయితం….
ఇక జిల్లా టీడీపీకి ఎప్పటి నుంచో కవచంలా ఉన్న ఓ బలమైన ఫ్యామిలీ సైతం పార్టీలో ఉండాలా ? బయటకు వెళ్లాలా ? అని తీవ్ర స్థాయిలో తర్జన భర్జనలు పడుతోన్న పరిస్థితి ఉందట. చంద్రబాబు తాము కష్టాల్లో ఉన్నప్పుడు ఏ మాత్రం పట్టించుకోకపోవడమే ఇందుకు కారణమని పలువురు చర్చించుకుంటున్నారు. మరి ఇప్పటికైనా చంద్రబాబు ఆయా సమస్యలపై గళం వినిపిస్తారా ? కష్టాల్లో ఉన్న నేతలను పట్టించుకుంటారో ? లేదో చూడాలి. నిజానికి వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇలా మేం వేధించలేదు.. అని చంద్రబాబు ముక్తాయిస్తున్నారే తప్పా తమ నాయకులను, కేడర్‌ను కాపాడుకోవడం మాత్రం దృష్టి పెట్టడం లేదు. చంద్రబాబు ఇదే ఉదాసీనతతో ఉంటే ఒక్క అనంతపురమే కాదు టీడీపీలో మరిన్ని కీలక వికెట్లు రాలడం ఖాయం.