బై బై బాబు.. నిజమవుతోందా ?
వైసీపీకి రాజకీయ వ్యూహకర్తగా ఉన్న ప్రశాంత్ కిషొర్ ఎన్నికల వేళ ఓ అద్భుతమైన నినాదాన్ని కనుగొన్నారు. అది ఒట్టి నినాదం మాత్రమే కాదు. స్వాతంత్ర్యం కోసం నాటి [more]
వైసీపీకి రాజకీయ వ్యూహకర్తగా ఉన్న ప్రశాంత్ కిషొర్ ఎన్నికల వేళ ఓ అద్భుతమైన నినాదాన్ని కనుగొన్నారు. అది ఒట్టి నినాదం మాత్రమే కాదు. స్వాతంత్ర్యం కోసం నాటి [more]
వైసీపీకి రాజకీయ వ్యూహకర్తగా ఉన్న ప్రశాంత్ కిషొర్ ఎన్నికల వేళ ఓ అద్భుతమైన నినాదాన్ని కనుగొన్నారు. అది ఒట్టి నినాదం మాత్రమే కాదు. స్వాతంత్ర్యం కోసం నాటి జాతీయ నాయకుడు చేసిన క్విట్ ఇండియా ఉద్యమం అంతటి బలమైనది అయిపోయింది. తెల్లదొరలు మాకొద్దు అంటూ నాడు నినదిస్తే చంద్రబాబు నాయుడు మాకు వద్దు అంటూ వైసీపీ ఎన్నికల వేల రణనినాదమే చేసింది. అది డైరెక్ట్ గా వెళ్ళి జనం గుండెల్లో తాకింది. దాంతో బంపర్ మెజారిటీతో వైసీపీ విజయపతాకం ఎగురవేయగా, చంద్రబాబు నాయుడు సారధ్యంలోని టీడీపీ ఎన్నడూ లేని విధంగా 23 సీట్లకే పరిమితమైపోయింది. ఎన్నికల ఫలితాలు వచ్చి దాదాపుగా నెల అవుతోంది. ఈ కాలమంతా చంద్రబాబుకు పెద్దగా పని లేకుండా పోయింది. ఓ విధంగా చెప్పాలంటే ఆయన ఒక్కసారిగా ఖాళీ అయిపోయారు.
విమర్శలకు చాన్స్ లేదు :
జగన్ నాయకత్వంలో కొత్త సర్కార్ వచ్చింది. ప్రజలు కోటి ఆశలతో ఓట్లేసి మరీ గెలిపించారు. జగన్ సైతం తాను ఇచ్చిన హామీలను ఒక్కోటిగా నెరవేరుస్తూ ముందుకు సాగుతున్నారు. మంత్రివర్గ కూర్పును నేర్పుగా చేసి అందరి చేతా శభాష్ అనిపించుకున్నారు. ఇక గవర్నర్ ప్రసంగంలో తమ ప్రభుత్వ ప్రాధాన్యతలు గుదిగుచ్చి మరీ ప్రశంసలు పొందారు. ఇలా ఎక్కడ చూసినా దూకుడుగా సాగుతున్న జగన్ పాలనలో ఇప్పటికిపుడు తప్పు వెతికి పట్టుకుందామన్నా దొరకడం లేదు. దాంతో ఎంతో అనుభవం ఉందని చెబుతున్న చంద్రబాబు నాయుడు సైతం మౌనం వహించాల్సివస్తోంది. ఓ విధంగా బాబుకు రాజకీయంగా పని దొరకడంలేదు, రోజు గడవడంలేదు.
విరామంలో విహారం :
చంద్రబాబు నాయుడు తన జీవిత కాలంలో ఎన్నడూ ఇంత విరామంగా లేరు. ఆయన గెలిచినా ఓడినా కూడా పూర్తిగా బిజీ అయిపోయేవారు. ఇపుడున్న పరిస్థితి ఓ విధంగా చంద్రబాబు నాయుడు కు సైతం అనుభవంలో లేనిదే. బాబు ఇంత ఖాళీగా ఉండడంతో తోచడంలేదు . మీడియా సైతం అధికారం వెంట పరుగులు తీయడంతో చంద్రబాబు నాయుడు తాను మాత్రం దేశంలో ఉండి ఏం లాభమని విదేశీ పర్యటనకు ఒకే అనేశారు. బాబుకు స్వాంతన కలిగించే ట్రిప్ ఇది అంటున్నారు. ఉన్న వూళ్ళోనె వుంటూ జగన్ అధికార వైభోగాన్ని, అదే సమయంలో తన అధికార వియోగాన్ని తలచుకుని కుమిలిపోయే కన్నా విదేశాటనం మేలు అంటున్నారు తెలుగుదేశం పార్టీ నెతలు కూడా. ఇక బై బై బాబు అన్న మాటకు అసలైన అర్ధం ఇదేనని చంద్రబాబు నాయుడు విదేశీ టూర్లపై వైసీపీ నాయకులు సెటైర్లు వేస్తున్నారు. విమానం ఎక్కే వారికీ ఎటూ బై బై చెబుతారు. కొన్నాళ్ళ పాటు అక్కడే ఉండి హెల్తీగా గడపాలని కూడా వైసీపీ నేతలు కోరుకోవడం విశేషం.