వ్యూహం బెడిసి కొట్టనుందా?
చంద్రబాబు చేసిన వ్యూహం పార్టీని దెబ్బతీస్తుందా? శాసనమండలి రద్దయితే ఎక్కువగా నష్టపోయేది తెలుగుదేశం మాత్రమే. శాసనమండలిలో 58 మంది సభ్యులుంటే 34 మంది టీడీపీ సభ్యులే. శాసనమండలి [more]
చంద్రబాబు చేసిన వ్యూహం పార్టీని దెబ్బతీస్తుందా? శాసనమండలి రద్దయితే ఎక్కువగా నష్టపోయేది తెలుగుదేశం మాత్రమే. శాసనమండలిలో 58 మంది సభ్యులుంటే 34 మంది టీడీపీ సభ్యులే. శాసనమండలి [more]
చంద్రబాబు చేసిన వ్యూహం పార్టీని దెబ్బతీస్తుందా? శాసనమండలి రద్దయితే ఎక్కువగా నష్టపోయేది తెలుగుదేశం మాత్రమే. శాసనమండలిలో 58 మంది సభ్యులుంటే 34 మంది టీడీపీ సభ్యులే. శాసనమండలి రద్దయితే తెలుగుదేశం పార్టీలోని కీలక నేతలలు పదవులను కోల్పోతారు. అది పార్టీకి నష్టమని చెప్పక తప్పదంటున్నారు. రాజధాని అమరావతి కోసం తాము త్యాగం చేశామని చెప్పుకోవడానికి కూడా ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో వీలుకాదు.
నిర్ణయానికి వచ్చినట్లే…..
జగన్ దాదాపుగా శాసనమండలిని రద్దు చేయాలని నిర్ణయానికి వచ్చేశారు. శాసనమండలిలో సీనియర్ నేతలు యనమల రామకృష్ణుడు ఉన్నారు. నారా లోకేష్ కు కూడా మరో నాలుగేళ్ల పదవీకాలం ఉంది. యనమల మాత్రం ఎన్నికలకు ముందే శాసనమండలికి ఎన్నికయ్యారు. కేవలం రాజధాని విషయంలో చంద్రబాబు ఇంత రిస్క్ తీసుకున్నారా? అన్న చర్చ పార్టీలో జరుగుతుంది.
ముందే తెలిసి….
అయితే శాసనమండలిని రద్దు అంత తేలిక కాదని తెలుగుదేశం పార్టీ నేతలు చెబుతున్నారు. బిల్లును తిరస్కరించి పంపి ఉంటే బాగుండేదని కొందరు టీడీపీ నేతలు అంతర్గతంగా అభిప్రాయపడుతున్నారు. జగన్ నుంచి సంకేతాలు అందినందుకే కొందరు టీడీపీ ఎమ్మెల్సీలు పార్టీకి వ్యతిరేకంగా ఓటేశారంటున్నారు. అందుకే డొక్కా మాణిక్యవరప్రసాద్ రాజీనామా చేశారని కూడా తెలుస్తోంది. పోతుల సునీతకు కూడా జగన్ నుంచి హామీ లభించడంతోనే ఆమె వ్యతిరేకంగా ఓటేశారంటున్నారు.
భరోసా ఇస్తున్న సీనియర్లు…..
ఆర్టికల్ 169 కింద శాసనమండలిని రద్దు చేస్తూ తీర్మానం చేసేంత వరకూ మాత్రమే ప్రభుత్వానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఆ తీర్మానాన్ని పార్లమెంటుకు పంపి ఆమోదం పొందాలి. తర్వాత రాష్ట్రపతి మండలిని రద్దుచేస్తున్నట్లు నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడే శాసనమండలి రద్దు అయినట్లు అని టీడీపీ నేతలు లోపల ధీమాగా ఉన్నారు. ఇందుకు కనీసం ఏళ్లు సమయం పడుతుందన్నారు. ఇలా తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్సీల్లో కలకలం బయలుదేరింది.