బాబు స్టయిల్ మార్చేస్తున్నారు..ఇక వైసీపీకి సినిమాయే?
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు వైఖరిలో చాలా మార్పు వచ్చింది. ఎన్నికలు ఎప్పుడైనా జరగొచ్చు. జమిలి ఎన్నికలు వచ్చినా ఆశ్చర్యం లేదు. ఈ అవకాశాన్ని జార విడుచుకోకూడదు. [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు వైఖరిలో చాలా మార్పు వచ్చింది. ఎన్నికలు ఎప్పుడైనా జరగొచ్చు. జమిలి ఎన్నికలు వచ్చినా ఆశ్చర్యం లేదు. ఈ అవకాశాన్ని జార విడుచుకోకూడదు. [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు వైఖరిలో చాలా మార్పు వచ్చింది. ఎన్నికలు ఎప్పుడైనా జరగొచ్చు. జమిలి ఎన్నికలు వచ్చినా ఆశ్చర్యం లేదు. ఈ అవకాశాన్ని జార విడుచుకోకూడదు. అందుకే చంద్రబాబు ఇప్పటి నుంచే ఎన్నికలకు నేతలను ప్రిపేర్ చేస్తున్నారు. అంతేకాదు నేతలకు కొందరికి ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్ధమవ్వాలని చెబుతున్నారు కూడా. గతానికి భిన్నంగా చంద్రబాబు వ్యవహరిస్తుండటం పార్టీలో చర్చనీయాంశంగా మారింది.
చివరి నిమిషం వరకూ….
ఎన్నికలంటే చంద్రబాబు చాలా డిఫరెంట్ గా వెళతారు. అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రకటన వరకూ చంద్రబాబు స్టయిల్ వేరుగా ఉంటుంది. ఒక పట్టాన అభ్యర్థులను ప్రకటించరు. చివరి నిమిషం వరకూ టెన్షన్ పెట్టి అభ్యర్థులను ప్రకటించిన సందర్భాల్లో ఎన్నో ఉన్నాయి. అయితే ఈసారి ఎన్నికలకు అభ్యర్థులను ముందుగానే ప్రకటించేందుకు చంద్రబాబు రెడీ అవుతున్నట్లు తెలిసింది. ముందుగానే అభ్యర్థులను ప్రకటించి ఎన్నికలకు వెళ్లాలన్నది చంద్రబాబు యోచనగా ఉంది.
ఎన్నికల వ్యూహకర్తను…..
అయితే ఇందుకు ముందుగా చంద్రబాబు ఎన్నికల వ్యూహకర్తను నియమించుకునేందుకు రెడీ అయ్యారు. వచ్చే ఏడాది ఎన్నికల వ్యూహకర్తను రంగంలోకి దించనున్నారు. ప్రశాంత్ కిషోర్ టీంలో ఉండి విడిపోయిన రాబిన్ శర్మను ఎన్నికల వ్యూహకర్తగా నియమించనున్నారు. ఆయన టీం వచ్చే ఏడాది నుంచే రంగంలోకి దిగనుంది. ఆ టీం ఇచ్చిన నివేదికల ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక కూడా ఆధారపడి ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ముందుగానే ప్రకటించి……
దీంతో పాటు కొన్ని కీలక నియోజకవర్గాల్లో అభ్యర్ధులను ముందుగానే ప్రకటిస్తే ఎలా ఉంటుందన్న దానిపై కూడా చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. అడ్వాంటేజీగా ఉంటుందన్న సూచనలు చంద్రబాబుకు అందడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని సూత్రప్రాయంగా నేతలకు తెలియజేయడంతో వారు కూడా ఇప్పటి నుంచే యాక్టివ్ అవుతారని చంద్రబాబుభావిస్తున్నారు. జమిలి ఎన్నికలు 2022 లో ఉండే అవకాశం ఉండటంతో వచ్చే ఏడాది నుంచే చంద్రబాబు నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గతానికి భిన్నంగా తీసుకునే ఈ నిర్ణయాలు ఏ మేరకు ఫలితాలనిస్తాయనేది చూడాలి.