పచ్చ జెండా ఊపితే..పసుపు శిబిరం?
అమరావతి నుంచి రాజధాని ఎత్తేస్తున్నారన్న ఆందోళనతో చంద్రబాబుకు అన్ని విధాలా దెబ్బ కొట్టేశారు ముఖ్యమంత్రి జగన్. తన డ్రీమ్ ప్రాజెక్ట్ తో బాటు పరువు, ప్రతిష్ట, ఆర్ధిక, [more]
అమరావతి నుంచి రాజధాని ఎత్తేస్తున్నారన్న ఆందోళనతో చంద్రబాబుకు అన్ని విధాలా దెబ్బ కొట్టేశారు ముఖ్యమంత్రి జగన్. తన డ్రీమ్ ప్రాజెక్ట్ తో బాటు పరువు, ప్రతిష్ట, ఆర్ధిక, [more]
అమరావతి నుంచి రాజధాని ఎత్తేస్తున్నారన్న ఆందోళనతో చంద్రబాబుకు అన్ని విధాలా దెబ్బ కొట్టేశారు ముఖ్యమంత్రి జగన్. తన డ్రీమ్ ప్రాజెక్ట్ తో బాటు పరువు, ప్రతిష్ట, ఆర్ధిక, సామాజిక సమస్యల్లోకి నెట్టేలా తన ప్రత్యర్థి తీసుకున్న నిర్ణయంతో ఇప్పటికే జనవరి ఫస్ట్ కి టిడిపి అధినేత దూరమయ్యారు. ఆయనతో పాటు తెలుగుదేశం లో అమరావతిపై ఆశలు పెట్టుకున్న వారంతా ఫస్ట్ ఫెస్టివల్ వదిలి ఉద్యమ బాటలోనే నిలబడాలిసి వచ్చింది. ఈ పోరాటం టిడిపికి ఎంత వరకు లాభం చేకురుస్తుందో తెలియదు కానీ పెద్ద పండగ సంక్రాంతి కూడా వారు చేసుకోలేని పరిస్థితినే వైసిపి తెచ్చిపెట్టబోతుందన్నది తేలిపోతుంది. ఈనెల 8 న రాజధాని అంశంపై క్యాబినెట్ జరుపనున్న భేటీ మరోసారి టిడిపి కి నిద్రలేని రాత్రులే తీసుకువస్తుందని రాజకీయ విశ్లేషకుల అంచనా.
బోస్టన్ కమిటీ నివేదికపై …
క్యాబినెట్ ఇంతకుముందు జి ఎన్ రావు నివేదికపై చర్చ జరిపింది. ఆ నివేదికలోని అంశాలను జి ఎన్ రావు బృందం మీడియా ముందు పెట్టి ప్రజల్లో చర్చకు తెరతీసింది. ఆ తరువాత ప్రభుత్వం ఇంతకు ముందు నియమించిన బోస్టన్ కమిటీ నివేదిక ఈనెల తొలివారం లో ప్రభుత్వానికి అందనుంది. ఇది కూడా చర్చించిన తరువాత జగన్ సర్కార్ అఖిలపక్షాన్ని ఆహ్వానిస్తుందా? లేక నేరుగా అసెంబ్లీలో విస్తృతంగా చర్చ జరిపి మూడు రాజధానులకు పచ్చజండా ఊపేస్తుందా అన్నది త్వరలో తేలనుంది. ఈలోగా పండగ ముందు జరిగే క్యాబినెట్ సమావేశం లో మరికొన్ని బాంబులను వైసిపి సర్కార్ పేల్చడం ఖాయమంటున్నారు ఆ పార్టీ వర్గాలు. అదే జరిగితే పండగ మొత్తం టిడిపి శ్రేణులు రాజధాని రైతులతో రోడ్డుపైనే పడటం తప్పదు.
సంబరాలకు బాబు దూరం …?
ప్రతి సంక్రాంతి పండగ కు చంద్రబాబు తన కుటుంబం, వియ్యంకుడు బాలకృష్ణ కుటుంబం తో కలిసి నారావారిపల్లె వెళ్ళి సందడి చేసేవారు. మనవడితో ఆటపాటల్లో అన్ని మరిచిపోయేవారు. ఇక తమ ఊర్లో బంధు మిత్రులతో విందు వినోదాలతో రాజకీయాలకు దూరంగా చంద్రబాబు మంచి ఎంజాయ్ చేసి వచ్చేవారు. ఇప్పుడు మాత్రం పండగకు ఆయన అక్కడకు వెళ్ళే వాతావరణం లేకుండా పోయింది. రాజధాని రైతులు కుటుంబాలతో సహా రోడ్లు ఎక్కి ఎండ కొండా లేకుండా వీధినపడితే అమరావతి రూపకర్తగా ఆయన ఉద్యమాన్ని వదిలి ఎక్కడికి పోలేని స్థితిని జగన్ కల్పించారు. గత ఏడాది ఎన్నికల పరాజయంతో డీలా పడితే ఈ కొత్త ఏడాది కూడా మరింత దారుణమైన స్థితిని ఎదుర్కొవాలిసి వస్తుందని టిడిపి ఊహించి ఉండదు.