బాబు వద్ద ఇక వారు కన్పించరట
చుట్టూ వున్న రక్షక భటుల సంఖ్యను బట్టి దేశంలో వీఐపీ ల రేంజ్ ను లెక్కేస్తారు. అధికారంలో ఉన్నా లేకపోయినా ఏపీ విపక్ష నేత చంద్రబాబు నాయుడు [more]
చుట్టూ వున్న రక్షక భటుల సంఖ్యను బట్టి దేశంలో వీఐపీ ల రేంజ్ ను లెక్కేస్తారు. అధికారంలో ఉన్నా లేకపోయినా ఏపీ విపక్ష నేత చంద్రబాబు నాయుడు [more]
చుట్టూ వున్న రక్షక భటుల సంఖ్యను బట్టి దేశంలో వీఐపీ ల రేంజ్ ను లెక్కేస్తారు. అధికారంలో ఉన్నా లేకపోయినా ఏపీ విపక్ష నేత చంద్రబాబు నాయుడు కు బ్లాక్ క్యాట్ కమాండో రక్షణ కొనసాగుతూ వస్తుంది. మావోయిస్టు ల నుంచి చంద్రబాబు కి ఉన్న ముప్పు నేపథ్యంలో ఆయన జెడ్ ప్లస్ క్యాటగిరీలోనే కొనసాగుతూ వస్తున్నారు. జగన్ సర్కార్ అధికారంలోకి రాగానే చంద్రబాబు భద్రతపై సమీక్ష చేయడం, విపక్ష నేతగా ఉన్నందున భద్రత తగ్గించాలని భావించింది. అయితే దీనిపై హై కోర్టు కి వెళ్ళి పోరాటం చేసి తన రక్షక దళాన్ని ఆయన కాపాడుకున్నారు. గతంలో అలిపిరి లో చంద్రబాబు పై జరిగిన బాంబు బ్లాస్ట్ నేపథ్యంలో కోర్టు సైతం ఆయన వాదనకే మొగ్గు చూపింది.
వారందరికి తొలగించనున్నారు …
నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ కి ప్రస్తుతం దేశంలో చాలా కొరత వుంది. రెండు దశాబ్దాల క్రితం తీవ్రవాద నిరోధానికి, హైజాక్ లు వంటివి నిరోధానికి ఎన్ ఎస్ జి ఏర్పాటు అయ్యింది. అయితే వీరిని రాజకీయ నేతల భద్రతకు కేటాయించడంతో ఆ విభాగంలో లోటు ఏర్పడింది. ఈ అంశాన్ని సమీక్షించిన కేంద్రం రాజనాధ్ సింగ్, ములాయం సింగ్ యాదవ్, చంద్రబాబు , మాయావతి, అస్సాం సీఎం శర్వానంద సోనేవల్, ఫరూక్ అబ్దుల్లా, ఎల్ కె అద్వానీ, ప్రకాష్ సింగ్ బాదల్, తదితర 13 మందికి ఈ బ్లాక్ క్యాట్ కమాండోస్ ను తొలగించి వారి స్థానంలో సీఆర్పీఎఫ్ భద్రత వ్యవస్థను కొనసాగించనున్నారు.
వారి సేవలను….
జెడ్ ప్లస్ క్యాటగిరి లో వున్న సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక వంటివారికి ఇప్పటికే సీఆర్ పిఎఫ్ భద్రత కిందకు కేంద్రం తీసుకువచ్చింది. తాజాగా కేంద్రం తీసుకునే ఈ నిర్ణయం వల్ల 450 మంది బ్లాక్ క్యాట్ కమాండోస్ ఉగ్రవాద నిరోధక కార్యక్రమాలకు తమ సేవలు వినియోగించే అవకాశం దక్కనుంది. చంద్రబాబుకు ఇప్పటి వరకూ ఉన్న బ్లాక్ క్యాట్ కమాండోలు ఇకపై కన్పించరు.