ఆ యవ్వారం నిజమేనటగా
చంద్రబాబు నాయుడు అంటే వారు. వారి పేరు చెబితే అధినేత తో సమాన గౌరవ మర్యాదలు వారికి దక్కేవి. టిడిపి లో ఆ ముగ్గురికి వుండే ప్రయారిటీ [more]
చంద్రబాబు నాయుడు అంటే వారు. వారి పేరు చెబితే అధినేత తో సమాన గౌరవ మర్యాదలు వారికి దక్కేవి. టిడిపి లో ఆ ముగ్గురికి వుండే ప్రయారిటీ [more]
చంద్రబాబు నాయుడు అంటే వారు. వారి పేరు చెబితే అధినేత తో సమాన గౌరవ మర్యాదలు వారికి దక్కేవి. టిడిపి లో ఆ ముగ్గురికి వుండే ప్రయారిటీ మాములుగా ఉండేది కాదు. పార్టీ వ్యవహారాలన్నీ గల్లీ నుంచి ఢిల్లీ వరకు నడిపించేది వారే. ఇక కాంట్రాక్ట్ ల నుంచి అన్ని వ్యవహారాల్లో ఆ ముగ్గురిలో ఎవరో ఒకరి ప్రమేయం లేకుండా పూర్తి అయ్యిందనే మాటే లేదు. ఇక ఎన్నికల ముందు టికెట్ల కు టిక్ పెట్టేది ఆ త్రిమూర్తులే. అలాంటి టిడిపి వివిఐపి లు ఎన్నికల్లో టిడిపి ఘోర పరాజయం తరువాత మటుమాయం అయిపోయి కాషాయం కప్పేసుకున్నారు. వారే సుజనా చౌదరి, సిఎం రమేష్, గరికపాటి రామ్మోహన రావు లు వీరితో పాటు బిజెపి లో చేరిన మరో రాజ్యసభ సభ్యుడు టిజి వెంకటేష్ తాను టెక్నీకల్ గానే జతకట్టాలిసి వచ్చిందని చెప్పేశారు. టిజి వెంకటేష్ గతంలో కాంగ్రెస్ లోకి వెళ్ళివచ్చినవారు కావడంతో ఆయనపై శ్రేణుల్లో పెద్దగా చర్చ లేదు. కానీ ఈ ముగ్గురు జండా పీకేస్తారని వారు భావించలేదు.
అంతా స్కెచ్ ప్రకారం …
బిజెపి తో పోయిన సంబంధాలు మెరుగు పరుచుకోవడం ప్రస్తుతం చంద్రబాబు అత్యవసర టార్గెట్. దాంతో బాటు ఆర్ధికంగా పార్టీకి వెన్నెముకగా వున్న వారిని కాపాడుకోవాలన్న కేంద్రంలో అధికారంలో వున్న వారి చెంత ఉండటమే తనకు తనను రక్షించేవారికి శ్రీరామ రక్ష. ఒక పక్క రాష్ట్రంలోని వైసిపి సర్కార్ ను మరోపక్క కేంద్రంలోని బిజెపిని ఒకేసారి ఎదుర్కోవడం అంత సులభం కాదని రాజకీయ చాణుక్యుడు చంద్రబాబు కు తెలియంది కాదు. అయితే ఇక్కడే చంద్రబాబు తప్పులో కాలేశారు. ఈరోజు నిత్యం అధికారపార్టీ వైపు నాయకులు క్యాడర్ చేరిపోవడానికి పరోక్ష కారణం గా నిలిచిందని విశ్లేషకుల అంచనా.
ఆయనే దగ్గరుండి సాగనంపారు ….
తాజాగా రామచంద్రపురం మాజీ ఎమ్యెల్యే తోట త్రిమూర్తులు హాట్ కామెంట్స్ ఇవే సూచిస్తున్నాయి. టిడిపి తో దశాబ్దంన్నర ప్రయాణం చేసిన త్రిమూర్తులు పార్టీ మారడం ఖాయమని తెలిసిన చంద్రబాబు ఆయనపై నిప్పులు చెరిగారు. అధికారంలో వున్నప్పుడు కొందరు పార్టీలో వుంటూ తమ అవసరాలకు వ్యక్తిగత పనులకు ఉపయోగించుకుని మరో పార్టీ అధికారంలోకి రాగానే వెళ్ళిపోతారనే రీతిలో వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో టిడిపి కి రాజీనామా చేస్తూ కార్యకర్తల సమావేశంలో మరింత ఘాటు వ్యాఖ్యలను త్రిమూర్తులు చేస్తూ అంతర్గత టాక్ బట్టబయలు చేసేశారు.
దగ్గరుండి పంపారంటూ…..
టిడిపికి అన్ని తామై వ్యవహరించిన సుజనా, సిఎం రమేష్, గరికపాటి లను టిడిపి అధినేత చంద్రబాబు పంపింది నిజమా? కాదా? దీనిపై పార్టీలో జరుగుతున్న అంతర్గత ప్రచారం సంగతి ఏమిటి అంటూ కడిగేశారు తోట త్రిమూర్తులు. ఇలా అడిగిన త్రిమూర్తుల వ్యాఖ్యలకు తెలుగుదేశం నుంచి స్ట్రాంగ్ కౌంటర్ లేకపోవడంతో తోట చెప్పింది మరోసారి చర్చకు తెరలేపడంతో బాటు మరికొందరు పసుపు పార్టీకి గుడ్ బై చెప్పేందుకు వెనుకాడని పరిస్థితి కల్పించింది. దాంతో పార్టీలో మిగిలిన వారిని చంద్రబాబు ఎలా కాపాడుకుంటారో చూడాలి.