వీళ్లు మారరు..రచ్చ చేస్తుంటేనే వీరికి రక్ష అట
ఊరంతా ఒకదారైతే ఉలిపిరి కట్టేది ఒకదారి అన్నట్లు ఉంది ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ వాతావరణం. ప్రపంచం కరోనా వైరస్ ధాటికి చిగురుటాకులా ఒక పక్క వణుకుతుంది. ఇది [more]
ఊరంతా ఒకదారైతే ఉలిపిరి కట్టేది ఒకదారి అన్నట్లు ఉంది ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ వాతావరణం. ప్రపంచం కరోనా వైరస్ ధాటికి చిగురుటాకులా ఒక పక్క వణుకుతుంది. ఇది [more]
ఊరంతా ఒకదారైతే ఉలిపిరి కట్టేది ఒకదారి అన్నట్లు ఉంది ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ వాతావరణం. ప్రపంచం కరోనా వైరస్ ధాటికి చిగురుటాకులా ఒక పక్క వణుకుతుంది. ఇది సోకకుండా ప్రజల్లో చైతన్యం మరింత పెంచాలిసిన బాధ్యతాయుత రాజకీయ పక్షాలు ఇంకా స్థానిక ఎన్నికల వాయిదా అంశంపైనే రాజకీయ యుద్ధం సాగించడం అందరిని విస్మయానికి గురిచేస్తుంది. అధికార విపక్షాలు తమ రాజకీయ ఆధిపత్యం కోసం ఏ మాత్రం తగ్గకపోవడం చర్చనీయాంశం అవుతుంది.
అంతా రాజకీయమే…?
వైసిపి రాష్ట్రానికి ఎన్నికల వాయిదా ఐదువేలకోట్ల రూపాయలు నష్టం తెచ్చేది అని సుప్రీం కోర్టు వరకు వెళ్లడం ఒక ఎత్తయితే టిడిపి ఎన్నికల కమిషనర్ చుట్టూ నే అధినేత చంద్రబాబు నేతృత్వంలో రాజకీయం స్పీడ్ పెంచేసింది. స్థానిక సంస్థల ఎన్నికలలో అన్యాయం జరిగిందంటూ, నామినేషన్లు వేయలేదంటూ టీడీపీ గవర్నర్ ను కలిసింది. దీంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను తిరిగి ప్రారంభించాలని కోరుతోంది.
వైఖరి మారదా ?
చంద్రబాబు నలభై ఏళ్ళ రాజకీయ అనుభవజ్ఞుడు. తుఫాన్ లు వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కోవడం లో చంద్రబాబు తీసుకునే చర్యలు అందరి ప్రశంసలు అందుకునేవి. అలాంటి చంద్రబాబు రాజకీయమే తన శ్వాస అన్నట్లు వ్యవహరిస్తున్నారు. కరోనా వైరస్ వంటి ప్రాణ ప్రధాన జబ్బులపై తన అనుభవాన్ని సూచనల రూపంలో ఇటు ప్రభుత్వానికి అటు ప్రజలకు ఇవ్వలిసిన తరుణం ఇది. ఎపి లో సర్కార్ తీసుకునే చర్యలను ముమ్మరం చేసేలా వత్తిడి తేవడంతో బాటు తమ పార్టీ శ్రేణులను ప్రజల్లో చైతన్యం తీసుకునేలా కృషి చేయాలి అంటున్నారు విశ్లేషకులు. ఇది ఆయన ఇమేజ్ ను మరింత పెంచుతుందని ప్రధాన విపక్ష నేతగా ఇలాంటి పరిస్థితుల్లో తన బాధ్యతను నిర్వర్తించాలని పాలిటిక్స్ కి ఇప్పుడు బ్రేక్ వేయాలని కోరుతున్నారు. మరి చంద్రబాబు తన పంథాలోనే ముందుకు వెళతారా లేక కరోనాపై యుద్ధానికి ముందుకు వస్తారో చూడాలి.