ఆయనది నిత్య పూజ… వీళ్లది రోజూ చాకిరేవు
దేశంలో 21 రోజుల లాక్ డౌన్ ప్రజల కోసమే అనుకోవాలి. రాజకీయ పార్టీలకు ఈ నిబంధనలు ఏమి లేవు. దాంతో ఒక పార్టీపై మరో పార్టీ బురద [more]
దేశంలో 21 రోజుల లాక్ డౌన్ ప్రజల కోసమే అనుకోవాలి. రాజకీయ పార్టీలకు ఈ నిబంధనలు ఏమి లేవు. దాంతో ఒక పార్టీపై మరో పార్టీ బురద [more]
దేశంలో 21 రోజుల లాక్ డౌన్ ప్రజల కోసమే అనుకోవాలి. రాజకీయ పార్టీలకు ఈ నిబంధనలు ఏమి లేవు. దాంతో ఒక పార్టీపై మరో పార్టీ బురద జల్లుకునే కార్యక్రమం మొదలైపోయింది. ముఖ్యంగా ఏపీ లో కరోనా రాజకీయాలు ఊపందుకున్నాయి. వీటికి కేంద్ర బిందువు గా మారిన టిడిపి అధినేత చంద్రబాబు ఇప్పుడు హైదరాబాద్ లో చిక్కుకుపోయారు. అయినా కానీ నిత్యం ప్రెస్ మిట్లు పెట్టి జగన్ సర్కార్ కు నిత్య పూజ చేసేస్తున్నారు.
వీరెందుకు వదులుతారు …
చంద్రబాబు విమర్శల దాడి మొదలు పెడితే అధికారపార్టీ మాత్రం ఎందుకు చూస్తూ వూరుకుంటుంది. వెంటనే చంద్రబాబు అండ్ పార్టీని రేవు పెట్టేస్తుంది వైసిపి. దాంతో కరోనా పై యుద్ధం కన్నా రాజకీయ రచ్చ ఏపీ వాసుల్లో టైం పాస్ బఠాణి అయిపొయింది. బాబు చేసే సూచలనలు, సలహాలు కొన్ని చిత్రంగా, విచిత్రంగానే ఉంటున్నాయి. దేశంలో వైద్య సౌకర్యాలు జనాభా అన్ని తెలిసిన చంద్రబాబు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ప్రస్తుతం కరోనా విజృంభిస్తే దేశం వైద్యం అందించలేని అసహాయ స్థితికి చేరుతుంది. అందుకే లాక్ డౌన్ అస్త్రాన్ని భారత్ ఆశ్రయించింది. కేసుల సంఖ్య కూడా భారీగా పెరగడానికి ఢిల్లీ జమాత్ కార్యక్రమమే అన్నది దేశంలో అందరికి తెలిసిందే.
ఒక్క ఏపీకే ఈ సమస్య వచ్చినట్లు …
అలాగే ఈ సమస్య జమాత్ సదస్సు కారణంగా 17 రాష్ట్రాలు ఎదుర్కొంటున్నాయి. అది ఏపీ కి మాత్రమే సోకినట్లు లేదా ప్రభుత్వాలు పని చేయనట్లు చంద్రబాబు వ్యాఖ్యలు అధికారపార్టీని, ప్రభుత్వ సిబ్బంది నైతిక స్థైర్యం దెబ్బతీస్తున్నారని వైసిపి విమర్శలు మొదలు పెట్టింది. ఇక ప్రపంచంలో ఇప్పుడు అన్ని దేశాలకు వెంటిలేటర్ కొరత కానీ, మాస్క్ లు శానిటైజర్ లు ఇలా పర్సనల్ ప్రొటెక్షన్ పరికరాలు అవసరం అయినంత లేనేలేవు. ఇవన్నీ ముఖ్యమంత్రి జగన్ ప్రధాని దృష్టిలో కూడా ఉంచారు. ఇవన్నీ తెలిసిన మాజీ సీఎం చంద్రబాబు ఏదో ఒక విమర్శ చేయాలనే తప్ప నిర్మాణాత్మక సూచనలు ఎక్కడంటున్నారు వైసిపి నేతలు. పైగా అంతర్జాతీయ తీవ్రవాద లక్షణాలు చంద్రబాబు వి అంటూ సెటైర్లు పంచ్ లు విసురుతున్నారు. మొత్తానికి కరోనా వార్తలతో తలబొప్పి కట్టిన ప్రజలకు మాత్రం రాజకీయ వేడి మళ్ళీ రాజుకోవడం మాత్రం ఖాళీగా ఇంట్లో ఉన్న సమయంలో బాగా ఆస్వాదిస్తున్నారు.