అప్పడు చేదయింది… ఇప్పుడు ముద్దయిందా?
తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తామే అంతా అనుకున్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల అధికారాల్లో జోక్యం ఏమిటని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం వివక్షత చూపుతుందని విమర్శలు చేశారు. [more]
తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తామే అంతా అనుకున్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల అధికారాల్లో జోక్యం ఏమిటని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం వివక్షత చూపుతుందని విమర్శలు చేశారు. [more]
తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తామే అంతా అనుకున్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల అధికారాల్లో జోక్యం ఏమిటని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం వివక్షత చూపుతుందని విమర్శలు చేశారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సంస్థలను రాష్ట్రాల్లోకి రానివ్వకుండా అడ్డుకున్నారు. సీబీఐ, ఈడీ లాంటి సంస్థలు తమ అనుమతి లేనిది రాష్ట్రానికి రావడానికి వీల్లేదని హుకుం జారీ చేశారు. అయితే గత పది నెలల నుంచి టీడీపీకి కేంద్ర ప్రభుత్వంపై నమ్మకం అమాతంగా పెరిగిపోయింది.
అధికారంలో ఉన్నప్పడు…..
ప్రతి దానికీ సీబీఐ విచారణ చేయాలని టీడీపీ డిమాండ్ చేస్తుంది. అలాగే గవర్నర్ వ్యవస్థను ఎగతాళి చేస్తూ ఏకంగా అసెంబ్లీలోనే కామెంట్ చేసిన టీడీపీ ఇప్పుడు అదే గవర్నర్ కు నిత్యం పరుగులు తీస్తుంది. అధికారం కోల్పోయాక తాము విమర్శించిన వారే తమను కాపాడతారనే ధోరణికి టీడీపీ వచ్చింది. అధికారంలో ఉన్ననాళ్లూ అఖిలపక్షం ఊసెత్తని టీడీపీ తిరిగి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి తమ సలహాలను తీసుకోవాలని కోరుతుంది.
లెక్కలు దాచిపెడుతుందని…..
తాజాగా కరోనా వ్యాప్తి చెందుతున్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వ సక్రమంగా వ్యవహరించడం లేదన్నది టీడీపీ ఆరోపణ. కరోనా లెక్కలను కూడా దాచిపెడుతుందని టీడీపీ నేతలందరూ ఆరోపిస్తున్నారు. ఇక కరోనా లెక్కలపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం విడుదల చేసే హెల్త్ బులిటెన్ కు, వెబ్ సైట్ లో కన్పించే లెక్కలకు పొంతన లేకుండా ఉందని వారు విమర్శలు చేస్తున్నారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ జోక్యం చేసుకోవాలంటూ….
కరోనా లెక్కలు దాచిపెట్టడంపై కేంద్ర ప్రభుత్వం నిజానిజాలు నిగ్గుతీయాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది. ఒక అడుగు ముందుకేసి ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఏపీ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరుతోంది. తమ పరిపాలనలో చివరి రెండేళ్లు కేంద్ర ప్రభుత్వాన్ని, దానికి సంబంధించిన సంస్థలపై నిషేధం విధించిన టీడీపీ ఇప్పుడు అవే సంస్థలు తమకు ముద్దంటుండటంపై సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. పాత కామెంట్స్ ను జోడించి మరీ జోకులు పేలుస్తున్నారు. టీడీపీ ఈ డిమాండ్లు ఆశ్చర్యకరం కాకపోయినా…పాత వాసనలు వాటిని కమ్మేస్తున్నాయి.