చింతకాయలు రాలేటప్పుడే మంత్రాలా …?
తలపండిన రాజకీయం తో చంద్రబాబు ఇప్పుడు ఏపీ లో కాక రేపేందుకు సిద్ధం అయ్యారు. కొత్తగా ఏర్పడిన వైసిపి ప్రభుత్వానికి ఆరునెలలు సమయం ఇద్దామన్న చంద్రబాబు అస్సలు [more]
తలపండిన రాజకీయం తో చంద్రబాబు ఇప్పుడు ఏపీ లో కాక రేపేందుకు సిద్ధం అయ్యారు. కొత్తగా ఏర్పడిన వైసిపి ప్రభుత్వానికి ఆరునెలలు సమయం ఇద్దామన్న చంద్రబాబు అస్సలు [more]
తలపండిన రాజకీయం తో చంద్రబాబు ఇప్పుడు ఏపీ లో కాక రేపేందుకు సిద్ధం అయ్యారు. కొత్తగా ఏర్పడిన వైసిపి ప్రభుత్వానికి ఆరునెలలు సమయం ఇద్దామన్న చంద్రబాబు అస్సలు తనమాట మీద నిలబడలేక ఆగం ఆగం అయ్యారు. కారణం వైసిపి దూకుడుతో తమ పార్టీకి మొదటికే మోసం వస్తుందని గ్రహించడంతో బాటు టిడిపి ప్లేస్ ను ఆక్రమించేందుకు బిజెపి తహతహ, జనసేన వ్యూహాలు చూసి లాభం లేదని డిసైడ్ అయిపోయారు చంద్రబాబు. అంతే సర్కార్ చేసే ప్రతి అంశంలోని లోపాలు వెతికే పని పెట్టేశారు. వరదలు నుంచి అమరావతి, పోలవరం వరకు అన్నిటా తన రాజకీయ చాణక్యతను ప్రదర్శించడం స్టార్ట్ చేసేసారు.
మూడు నెలల తరువాత …
కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రజలు ప్రధానంగా ఎదుర్కొన్న సమస్య ఇసుక. తమ ప్రభుత్వం వచ్చి రావడంతోనే పాత ఇసుక పాలసీకి స్వస్తి పలికింది వైసిపి సర్కార్. ఆ తరువాత కొత్త విధానం ఆగస్టు నుంచి అని ఆ తరువాత సెప్టెంబర్ తొలి వారంలో అని ప్రకటించింది. ప్రజలకు ముఖ్యంగా భవన నిర్మాణ రంగంపై ఆధారపడిన వారికి ఇసుక లభ్యతే భుక్తి పెడుతుంది. అయితే దీనిపై వైసిపి ప్రభుత్వం ఇంత తాత్సారం చేసినా నోరు మెదపలేదు చంద్రబాబు. గత ప్రభుత్వంలో అడ్డగోలు గా ఇసుక అక్రమాలు చోటుచేసుకోవడం తెలుగుదేశం ఓటమిలో ఇసుక పాత్ర కూడా ఉందన్న విమర్శల నేపథ్యంలో తేలుకుట్టినట్లు ఉండిపోయారు చంద్రబాబు. తొలినుంచి ఈ వ్యవహారం పై కమ్యూనిస్ట్ లు మాత్రమే ఆందోళన బాట పట్టారు.
ఇప్పుడు రెడీ ….
అయితే సెప్టెంబర్ 5 నుంచి కొత్త ఇసుక విధానంతో ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం సిద్ధం అయ్యింది. దీనికి నాలుగు రోజుల ముందు రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేపట్టి తమవల్లే ఇసుక పాలసీ వచ్చిందనేందుకు రెడీ అయిపోయారు చంద్రబాబు. అందుకే ఆయన పోరాటానికి పిలుపు ఇచ్చేశారు. చింతకాయలు రాలేటప్పుడే మంత్రాలు చదవాలన్న ఎత్తుగడతో చంద్రబాబు ఈ పోరాటం చేపట్టడం సొంత పార్టీ వారిలోనే చర్చ ను రాజేసింది. అదేదో మూడు నెలలుగా మొదలు పెట్టి ఉంటే ప్రజల్లో మరింత మైలేజ్ లభించేది అని వారు భావిస్తున్నారు.
పరువు పోయాక విధానం సిద్ధం ….
ఇప్పటికే కొత్త ఇసుక పాలసీ పై వైసిపి టెండర్లు పిలిచి పని మొదలు పెట్టింది. వరదలు తగ్గుముఖం పట్టాక కొత్త విధానం ప్రవేశపెట్టాలనే సెప్టెంబర్ నుంచి ఇసుక ను అందుబాటులోకి తేవాలని నిర్ణయించినట్లు సర్కార్ చెబుతుంది. ఇప్పటినుంచి ఇసుకను యార్డ్ లలో భారీగా నిల్వలు ఏర్పాటు చేయాలని కూడా ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చింది. అయితే మద్యం పై తక్షణ నిర్ణయాలు ప్రకటిస్తూ ఎక్కడా ఆదాయం పడిపోకుండా చూసుకున్న వైసిపి ప్రభుత్వం ఇసుకపై మాత్రం నిదానంగా విధానం ప్రకటించడం మాత్రం ప్రజల్లో సర్కార్ ఇమేజ్ ను దెబ్బతీసింది. చంద్రబాబు కూడా పాలసీ సిద్ధమయ్యాక ఆందోళనకు దిగడం ఎందుకో?