టీడీపీలో వింత పోకడ…వద్దే వద్దంటున్నారే…? కారణమిదేనా?
అధికారంలో ఉంటే ప్రభుత్వ పదవులు.. లేకుంటే పార్టీ పదవులు. ఇది ఏ రాజకీయపార్టీలోనైనా సహజమే. కానీ తమకు ఎలాంటి పదవులు వద్దంటున్న వారు తెలుగుదేశం పార్టీలో ఎక్కువగా [more]
అధికారంలో ఉంటే ప్రభుత్వ పదవులు.. లేకుంటే పార్టీ పదవులు. ఇది ఏ రాజకీయపార్టీలోనైనా సహజమే. కానీ తమకు ఎలాంటి పదవులు వద్దంటున్న వారు తెలుగుదేశం పార్టీలో ఎక్కువగా [more]
అధికారంలో ఉంటే ప్రభుత్వ పదవులు.. లేకుంటే పార్టీ పదవులు. ఇది ఏ రాజకీయపార్టీలోనైనా సహజమే. కానీ తమకు ఎలాంటి పదవులు వద్దంటున్న వారు తెలుగుదేశం పార్టీలో ఎక్కువగా కన్పిస్తున్నారు. మరో నాలుగేళ్ల పాటు ప్రతిపక్షంలో ఉండటం, ఈ పదవులతో ఆర్థికంగా మరింత ఇబ్బంది పడతామని భావించి తెలుగుదేశం పార్టీ నేతలు కొందరు స్వయంగా చంద్రబాబుకు ఫోన్ చేసి మరీ తమకు ఎలాంటి పదవులు వద్దని చెప్పినట్లు తెలిసింది.
పదవులను అనుభవించిన వారే…..
గత పదిహేడు నెలలుగా టీడీపీ పరిస్థితి ఏపీలో ఏమాత్రం బాగా లేదు. పార్టీ అధినేత చంద్రబాబు ఇస్తున్న పిలుపులకు కూడా పెద్దగా స్పందన లేదు. నాయకులంతా ఓటమి తర్వాత కాడి పడేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సీనియర్ నేతలు, 2019 వరకూ పదవులను అనుభవించిన వారు సయితం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. దీంతోపాటు ప్రభుత్వం కక్ష సాధింపుచర్యలకు దిగడం, అక్రమ కేసులు బనాయిస్తుండటంతో నియోజకవర్గాలకు కూడా దూరంగా ఉన్న నేతలు లెక్కకు మించి ఉన్నారంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.
జోష్ నింపాలని…..
ీఈ నేపథ్యంలో పార్టీని గాడిన పెట్టాలని చంద్రబాబు పదవుల నియామకం చేపట్టారు. పార్లమెంటరీ ఇన్ ఛార్జిలను నియమించారు. ఇక రాష్ట్ర అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడిని నియమించిన చంద్రబాబు పొలిట్ బ్యూరోలో సభ్యుల సంఖ్యను డబుల్ చేశారు. అందరికీ అవకాశమివ్వాలని చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే పదవుల భర్తీ జరుగుతున్న సమయంలోనే చంద్రబాబుకు ఫోన్ చేసి కొందరు నేతలు తమకు ఎలాంటి పదవులు వద్దని చెప్పడం ఆశ్చర్యాన్ని కల్గిస్తుందంటున్నారు.
చంద్రబాబుకు చెప్పి మరీ….?
గుంటూరు జిల్లాకు చెందిన ఒక సీనియర్ నేత చంద్రబాబు ఇంటికి వెళ్లి తనకు పదవి వద్దని చెప్పివచ్చారని తెలిసింది. అలాగే రాయలసీమ జిల్లాలోని మరికొందరు నేతలు తమకు పదవులు వద్దని ఫోన్ ద్వారా చంద్రబాబుకు చెప్పినట్లు సమాచారం. ఇందుకు రెండు కారణాలున్నాయి. పదవులు వస్తే పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలి. అది అధికార పార్టీకి ఆగ్రహం తెప్పిస్తుంది. కేసులు నమోదవుతాయి. మరో కారణం ఆర్థికంగా ఇబ్బంది కూడా కొందరు సీనియర్ నేతలు పదవుల పట్ల విముఖత చూపడానికి కారణమని చెబుతున్నారు.