ఖర్మ.. బాబు మాజీ ఎమ్మెల్యే కూడానా…?
దశ పడితే వరసగా నిచ్చెన మెట్లు పట్టేసి పరమపధ సోపానం అధిరోహిస్తారో లేదో తెలియదు కానీ దరిద్రం పట్టిందా పాతాళానికి ఆలా వాయువేగంతో జారిపోవడం మాత్రం ఖాయం. [more]
దశ పడితే వరసగా నిచ్చెన మెట్లు పట్టేసి పరమపధ సోపానం అధిరోహిస్తారో లేదో తెలియదు కానీ దరిద్రం పట్టిందా పాతాళానికి ఆలా వాయువేగంతో జారిపోవడం మాత్రం ఖాయం. [more]
దశ పడితే వరసగా నిచ్చెన మెట్లు పట్టేసి పరమపధ సోపానం అధిరోహిస్తారో లేదో తెలియదు కానీ దరిద్రం పట్టిందా పాతాళానికి ఆలా వాయువేగంతో జారిపోవడం మాత్రం ఖాయం. ఎవరు నమ్మినా నమ్మకపోయినా దాన్నే యోగం అంటారు. అది బాగులేకపోతే ఎంతటి వారైనా మూలన చేరక తప్పదు. చండశాసనుడు, చాణక్యుడు అని పిలిపించుకున్న చంద్రబాబు ఇపుడు ఏపీకి పట్టక ప్రవాసంలో జామ్ యాప్ ఎదురుగా ఒక్కడూ కూర్చోవడం కంటే దారుణమైన ఓటమి అసలు ఉంటుందా. ఇది కదా అసలైన పరాజయం మరి.
మాజీ సీఎం నుంచి ….
ఇప్పటికి మూడు సార్లు ఓడినా కూడా చంద్రబాబు మాజీ ముఖ్యమంత్రిగానే ఉన్నారు. పైగా విపక్ష హోదా కూడా బంగారంలా ఉంది. కానీ జగన్ ఏలుబడిలో తొలిసారిగా ప్రధాన ప్రతిపక్ష కుర్చీ కిందకే నీళ్ళు వచ్చేశాయి. చంద్రబాబుని వట్టి ఎమ్మెల్యే చేయాలని వైసీపీ వేయని ఎత్తు లేదు. ఇప్పటికే కొందమంది ఎమ్మెల్యే తమ్ముళ్ళను కూడగట్టిన వైసీపీ టార్గెట్ కి చాలా చేరువలో ఉంది. రేపో మాపో ఆ శుభవార్త కూడా చంద్రబాబు వినేస్తారు అని కూడా అంటున్నారు. ఇలా మరో అడుగు కిందకు దిగిపోవడం అంటే రాజకీయంలో జారుడు మెట్ల మీద ఉన్నట్లే లెక్క.
కుప్పం తప్పిస్తే ….
చంద్రబాబు టీడీపీలో ఒక నాయకుడి స్థాయికి చేరిన దగ్గర నుంచి కుప్పం సీటు ఆయన్ని ఒక కాపు కాస్తూ వస్తోంది. కర్ణుడి కవచ కుండలాల మాదిరిగా కుప్పం ఎపుడూ చంద్రబాబుకు అదనపు ఆభరణంగా నిలుస్తూ వచ్చింది. అలాంటి కుప్పాన్ని 2019 ఎన్నికల్లో కదిపేసి కుదిపేసినంత పనిని జగన్ చేశారు. బాబు మెజారిటీ సగానికి సగం పడిపోవడమే కాదు కొన్ని రౌండ్లలో ఆయన వెనకబడ్డారని స్క్రోలింగ్ వచ్చిన వేళ బాబు అభిమానుల గుండె లయ తప్పింది కూడా. ఇపుడు ఆ కుప్పం పని పట్టేందుకు ముఖ్యమంత్రిగా జగనే ఏకంగా రంగంలోకి దిగారు.
ఆ సంచలనం కోసమే…..
కుప్పంలో చంద్రబాబు ఓడడమే జగన్ ధ్యేయం. అందుకోసం ఆయన ఇప్పటి నుంచే మాస్టర్ ప్లాన్ వేసి మరీ కధ నడుపుతున్నారు. మూడు దశాబ్దాలకు పైగా ఎమ్మెల్యేగా బాబు కొనసాగుతున్నా కుప్పానికి చేసింది ఏమీ లేదని జనం ముందు తొడకొట్టి మరీ జగన్ చెబుతున్నారు. కుప్పాన్ని ఏకంగా మునిసిపాలిటీ చేసేశారు. అంతే కాదు. అక్కడ దాదాపుగా 14 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు చేపట్టారు. ఇక కుప్పంలో బ్రాంచి కెనాల్ ని కూడా శరవేగంగా పూర్తి చేస్తున్నారు. ఇదంతా అభివృద్ధి అనుకుంటే మరో వైపు రాజకీయంగా టీడీపీ నేతలందరినీ వైసీపీలోకి తెచ్చేస్తున్నారు. దాంతో 2024 ఎన్నికలు చంద్రబాబుకు అతి పెద్ద గండంగా మారనున్నాయని అంటున్నారు. జనంలో పేరుకుపోయిన అసంతృప్తినే పెట్టుబడిగా చేసుకుని జగన్ వదులుతున్న అస్త్రం సరిగ్గా లక్ష్యానికి చేరితే చాలు బాబు ఇక మాజీ ఎమ్మెల్యే అయిపోతారు. అదే కనుక జరిగితే చంద్రబాబు రాజకీయ జీవితానికి అతి పెద్ద ఇనుపతెర శాశ్వతంగా పడిపోతుంది. జగన్ కోరుకున్నది కూడా అదే మరి.