బాబు క్విట్ అయితేనే బెటరట
టీడీపీ అధినేత చంద్రబాబుకు నలభై ఏళ్ల రాజకీయ అనుభం ఉంది. నాలుగు దశాబ్దాలుగా ఆయన ఎన్నో ఎన్నికలు చూశారు. జయాపజయాలను చవిచూశారు. ముఖ్యమంత్రిగా పథ్నాలుగేళ్లు ఉన్నారు. ప్రతిపక్ష [more]
టీడీపీ అధినేత చంద్రబాబుకు నలభై ఏళ్ల రాజకీయ అనుభం ఉంది. నాలుగు దశాబ్దాలుగా ఆయన ఎన్నో ఎన్నికలు చూశారు. జయాపజయాలను చవిచూశారు. ముఖ్యమంత్రిగా పథ్నాలుగేళ్లు ఉన్నారు. ప్రతిపక్ష [more]
టీడీపీ అధినేత చంద్రబాబుకు నలభై ఏళ్ల రాజకీయ అనుభం ఉంది. నాలుగు దశాబ్దాలుగా ఆయన ఎన్నో ఎన్నికలు చూశారు. జయాపజయాలను చవిచూశారు. ముఖ్యమంత్రిగా పథ్నాలుగేళ్లు ఉన్నారు. ప్రతిపక్ష నేతగా కూడా ఆయన పదేళ్లకు పైగానే ఉన్నారు. అయితే ప్రస్తుతం చంద్రబాబు ఎన్నడూ లేని గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. సభలో అవమానాలను ఎదుర్కొంటున్నారు. శాసనసభ కు వెళ్లినా ఆయన మౌనంగా చూస్తుండటమే తప్ప చేయగలిగిందేమీ లేదు.
శాసనసభకు రావాలంటేనే…?
చంద్రబాబు ఓటమి పాలయిన తర్వాత శాసనసభకు రావాలంటేనే ఇబ్బంది పడుతున్నారు. అలాగని ప్రతిపక్ష నేతగా రాకుండా ఉండలేరు. కానీ సభకు వస్తే వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఆయనను ర్యాగింగ్ చేస్తున్నారు. ఏ అంశమొచ్చినా చంద్రబాబుకు ముడిపెట్టి మరీ లాగి ఆయనను బద్నాం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కొన్నిసార్లు చంద్రబాబు ఇది తట్టుకోలేక బరస్ట్ అవుతున్నారు. ఎన్నడూ లేని విధంగా పోడియం వద్దకు వెళ్లి చంద్రబాబు కూర్చోవడమే ఇందుకు నిదర్శనం.
గెలిచిన ఎమ్మెల్యేలు కూడా…..
మొన్నటి ఎన్నికల్లో వైసీపీ నుంచి 151 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. టీడీపీ 23 మంది ఎమ్మెల్యేలను మాత్రమే సాధించుకుంది. అందులో నలుగురు ఎమ్మెల్యేలు అనధికారికంగా పార్టీని వీడారు. ఉన్న పందొమ్మిది మంది ఎమ్మెల్యేల్లో ఎక్కువ మంది చంద్రబాబుతో కలసి రావడం లేదు. గొట్టి పాటి రవికుమార్ లాంటి నేతలు సభకే దూరంగా ఉంటున్నారు. బాలకృష్ణ అంతే. ఇక గంటా శ్రీనివాసరావు, గణబాబు వంటి నేతలు చంద్రబాబు పార్టీకి దూరంగా ఉంటున్నారు.
అదే చేయాలంటున్న నేతలు…..
గత శాసనసభలోనూ టీడీపీ చేస్తున్న అవమానాలు భరించలేక జగన్ శాసనసభకే రాననని శపథం చేశారు. అపట్లో జగన్ కు నలభై మందికి పైగా శాసనసభ్యులు ఉండేవారు. అయినా అవమానాలు భరించలేక జగన్ అసెంబ్లీని బాయ్ కాట్ చేశారు. చంద్రబాబుది కూడా ఇప్పుడు అదే పరిస్థితి. అవమానాలు ఎదుర్కొనేకంటే అసెంబ్లీ సమావేశాలకు చంద్రబాబు దూరంగా ఉండటమే బెటరని సీనియర్ నేతలు అభిప్రాయపడుతున్నారు. మరి అవమానాలను ఈ వయసులో ఇంత అనుభవం ఉన్న చంద్రబాబు ఎదుర్కొనేకంటే శాసనసభ సమావేశాలకు దూరంగా ఉండి ప్రజలకు దగ్గరవ్వాలని టీడీపీ నేతలు కోరుకుంటున్నారు.