ఎన్టీయార్…బాలమురళి.. చంద్రబాబు…?
సంగీత సృష్ట డాక్టర్ మంగళంపల్లి బాలమురళీక్రిష్ణ. ఆయన తెలుగువారిగా పుట్టడం మన అదృష్టం. ఆయన దురదృష్టం అని ఒక మాట కూడా ఉంది. ఎందుకంటే ఆయన వేరే [more]
సంగీత సృష్ట డాక్టర్ మంగళంపల్లి బాలమురళీక్రిష్ణ. ఆయన తెలుగువారిగా పుట్టడం మన అదృష్టం. ఆయన దురదృష్టం అని ఒక మాట కూడా ఉంది. ఎందుకంటే ఆయన వేరే [more]
సంగీత సృష్ట డాక్టర్ మంగళంపల్లి బాలమురళీక్రిష్ణ. ఆయన తెలుగువారిగా పుట్టడం మన అదృష్టం. ఆయన దురదృష్టం అని ఒక మాట కూడా ఉంది. ఎందుకంటే ఆయన వేరే రాష్ట్రంలో కానీ దేశంలో కానీ పుడితే ఆయనకు ఇంతకు వందింతలు బిరుదులు వరించి ఉండేవి. కనీసం భారతరత్నకు కూడా నోచుకోకుండా ఆయన ఈ లోకాన్ని వీడిపోయారు. సరే ఒక అన్నమయ్య, త్యాగయ్య వంటి వారు ఏ బిరుదుల కోసం ఆశించి తమ సంగీతాన్ని జాతికి అంకితం చేశారు. అలాంటి వాగ్గేయకారుడు బాలమురళి కూడా అని చెప్పాలి. ఆయన జయంతి వర్ధంతులను సంగీత కులం ఘనంగా జరుపుకుంటుంది. అయితే ఇపుడు ఆయన్ని కూడా రాజకీయ దినుసుగా మార్చేసి వాడేసుకుంటోంది టీడీపీ.
జగన్ అవమానించారా…?
డాక్టర్ మంగళంపల్లి నాలుగేళ్ల క్రితం ఈ లోకాన్ని వీడారు. ఆనాడు అధికారంలో ఉన్న చంద్రబాబు సర్కార్ ఆయన జయంతులు వర్ధతులు ప్రభుత్వ పరంగా నిర్వహిస్తామని ప్రకటించింది. అలాగే జయంతి రోజున కళాకారులకు అవార్డులు కూడా ఇస్తామని పేర్కొంది. ఒక ఏడాది చంద్రబాబు అలా జరిపారు. తరువాత జగన్ అధికారంలోకి వచ్చారు. కానీ ఆయన దాన్ని చేయలేదు అంటోంది టీడీపీ, మహానుభావులను తలచుకోవడం మన కర్తవ్యం జగన్ రెడ్డీ అంటున్నారు చంద్రబాబు లోకేష్. ఈ విషయంలో వైసీపీది తప్పు అయితే అయి ఉండవచ్చు కానీ టీడీపీ కూడా ఆ మహానుభావుడిని గొప్పగా సమాదరించింది లేదు అన్న మాట కూడా ఉంది.
ఒక్క వేటుతో….?
కాంగ్రెస్ ప్రభుత్వం ఆస్థాన కళాకారులుగా కొందరిని తమ హయాంలో నియమించింది. అలా బాలమురళి అప్పట్లో కొనసాగారు. ఎపుడైతే 1983లో ఎన్టీయార్ అధికారంలోకి వచ్చారో నాడు ఆయన ఒక్కసారిగా ఒక్క కలం వేటుతో అస్థాన కళాకరుల పదవులు అన్నీ కూడా తొలగించేశారు. దాన్ని అవమానంగా భావించిన బాలమురళి ఎన్టీయార్ అధికారంలో ఉన్నంతవరకూ ఆంధ్ర రాష్ట్రంలో కచేరీలు చేయనని భీషణ ప్రతిన చేసి చెన్నై వెళ్ళిపోయారు. ఇది చరిత్ర. ఒక కళాకారుడుగా ఉంటూ సీఎం అయిన ఎన్టీయార్ సాటి కళాకారులను అలా అవమానించారు చారు అని చెప్పడానికి బాలమురళి ఉదంతం ఒక ఉదాహరణ. మరి నాడు టీడీపీలో ఉన్న చంద్రబాబుకు ఈ సంగతి తెలియదు అనుకోగలమా.
అలా చేయగలిగారా ..?
సరే బాలమురళి మీద అభిమానం ఉంటే చంద్రబాబు కనీసం భారత రత్న కోసం తన హయాంలో ఎందుకు ప్రయత్నం చేయలేదు అన్న ప్రశ్న కూడా వస్తుంది. ఆ మాటకు వస్తే ఆయన భారతరత్న కానీ పద్మ అవార్డులు కానీ ఎంతమంది కళాకారులకు ప్రతిపాదించి పంపారూ అన్న చర్చ కూడా ఉంది. ఎవరైనా బతికి ఉన్నపుడు గౌరవించడం మంచి సంప్రదాయం. వారు లేకపోయినా గుర్తు చేసుకోవడంకనీస ధర్మం. ఆ విషయంలో ఆనాటి ప్రభుత్వాలూ ఈనాటి పాలకులూ ఒక్కలాగే వ్యవహరిస్తున్నారు. ఆ మాత్రం దానికి ఆడిపోసుకోవడానికి, రాజకీయాలు చేయడానికీ మా బాలమురళీయే దొరికారా అంటూ కళాకారులు బాధపడితే తప్పు ఎవరిది. ఏది ఏమైనా ఒకరి ప్రతిభను గౌరవించడం అంటే అందులో కొంత గౌరవం మనకూ దక్కుతోంది అన్న సూక్ష్మ బుద్ధి లేకపోవడం వల్లనే ఇలాంటివి జరుగుతున్నాయి అనుకోవాలి.