పాతుకుపోయిన నేతలకు ఇక పాతరే
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కు వచ్చే ఎన్నికలు చావో రేవో కానున్నాయి. అందుకే వచ్చే ఎన్నికలకు సైన్యాన్ని ఇప్పటి నుంచే సిద్ధం చేయాలని చంద్రబాబు నిర్ణయించారు. [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కు వచ్చే ఎన్నికలు చావో రేవో కానున్నాయి. అందుకే వచ్చే ఎన్నికలకు సైన్యాన్ని ఇప్పటి నుంచే సిద్ధం చేయాలని చంద్రబాబు నిర్ణయించారు. [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కు వచ్చే ఎన్నికలు చావో రేవో కానున్నాయి. అందుకే వచ్చే ఎన్నికలకు సైన్యాన్ని ఇప్పటి నుంచే సిద్ధం చేయాలని చంద్రబాబు నిర్ణయించారు. పాత నేతలకు చెక్ పెట్టేందుకు డిసైడ్ అయిపోయారు. గతంలో వైసీపీ నుంచి వచ్చిన వారిని కూడా చంద్రబాబు పక్కన పెట్టాలని నిర్ణయించుకున్నారు. గెలుపు సంగతి పక్కన పెట్టి పార్టీకి అంకిత భావంతో పనిచేసే వారిని, యువకులకు టిక్కెట్లు ఇచ్చేందుకు చంద్రబాబు సిద్ధమయిపోయారు. ఈ మేరకు నేతలకు పలు నియోజకవర్గాల్లో ఇన్ ఛార్జిలను నియమించి సంకేతాలను పంపినట్లయింది.
తన వెంట నడిచినా…?
అధికారంలో ఉన్నప్పుడు తన వెంట నడిచిన వారిలో అనేక మందిని పక్కకు తప్పించాలనుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో వీరు పార్టీ విజయం కోసం పనిచేస్తే పదవులు ఇస్తామని చెబుతున్నారు. కొంతకాలంగా ఆ నియోజకవర్గాల్లో గెలుస్తూ, ఓడుతూ పాతుకుపోయిన నేతలకు పాతర వేయాలని చంద్రబాబు నిశ్చయించుకున్నారు. నారా లోకేష్ నాయకత్వానికి భవిష్యత్ లో ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలంటే కొత్త వారు, యువకులు అయితే బెటరని చంద్రబాబు భావిస్తున్నారు. పార్టీని దూకుడుతో నడిపించాలన్నా యువకులే ముఖ్యమని నమ్మి ఇప్పటికే కొందరిని నియమించారు.
ఇన్ ఛార్జులను నియమించి…..
ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం టీడీపీ ఇన్ ఛార్జిగా ఎరిక్సన్ బాబును నియమించారు. అక్కడ పాలపర్తి డేవిడ్ రాజు వైసీపీ నుంచి టీడీపీలో చేరతానని బహిరంగంగా ప్రకటించినా చంద్రబాబు లైట్ గా తీసుకున్నారు. సాధారణంగా కండువాలు కప్పేందుకు ఉత్సాహపడే చంద్రబాబు పాలపర్తి డేవిడ్ రాజు విషయంలో ఆ పని చేయలేక పోయారు. అలాగే తిరువూరు నియోజకవర్గంలోనూ సీనియర్ నేత నల్లగట్ల స్వామిదాసును పక్కన పెట్టారు. కొత్తగా ఎన్ఆర్ఐకి ఇన్ ఛార్జి పదవి ఇచ్చారు. భీమిలి నియోజకవర్గంలో కూడా టీడీపీ నేతలు ఊహించని వారికి చంద్రబాబు ఇన్ ఛార్జి పదవి ఇచ్చి అందరినీ ఆశ్చర్యపర్చారు.
వారిస్థానంలో వారసులు….
ఇక సీనియర్ నేతల స్థానంలో వారి వారసులకు టిక్కెట్లు ఇవ్వాలన్నది చంద్రబాబు ఆలోచన. ఉదాహరణకు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గత ఆరుసార్ల నుంచి వరసగా సర్వేపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలవుతున్నారు. ఆయన స్థానంలో కుమారుడు రాజగోపాల్ రెడ్డిని పోటీకి దింపితే కొంత సానుకూల వాతావరణం ఉంటుందన్నది చంద్రబాబు అంచనా. ఇప్పటికే అనేక నియోజకవర్గాల్లో పనిచేసుకోవాలంటూ చంద్రబాబు నుంచి కొందరు యువనేతలకు సంకేతాలు అందినట్లు చెబుతున్నారు. సీనియర్ నేతలకు అధికారంలోకి వస్తే పదవులు తప్ప టిక్కెట్లు లేవని చంద్రబాబు నిర్మొహమాటంగా చెప్పదలచుకున్నారు.